హీరోల్లేక ఎంత ఇబ్బందో…?

ఇండ్ర‌స్ట్రీకి ఇప్పుడు ఓ వింత స‌మ‌స్య వ‌చ్చి ప‌డింది. అదే… హీరోలు లేక‌పోవ‌డం. అది నిజం. ప‌రిశ్ర‌మ‌లోంచి రోజుకో కొత్త హీరో వ‌స్తున్నాడు. ఇక ఫ్యామిలీ హీరోల‌కు లెక్క‌లేదు. ఒక్కో ఇంట్లోంచి ఇద్ద‌రు ముగ్గురు హీరోలు వ‌రుస‌గా వ‌స్తూనే ఉన్నారు. అయినా సరే, హీరోల కొర‌త క‌నిపించ‌డం విడ్డూరం. అందునా స్టార్ ద‌ర్శ‌కుల‌కు హీరోలు దొర‌క‌డం లేదు. ఓ స్టార్ ద‌ర్శ‌కుడు, మ‌రో స్టార్ హీరోతో ప‌నిచేస్తేనే కిక్కూ, క్రేజూ. అందుకే పెద్ద ద‌ర్శ‌కులంతా, పెద్ద హీరోల‌తో ప‌నిచేయ‌డానికి ఇష్ట‌ప‌డుతుంటారు. వాళ్ల‌కే ఇప్పుడు హీరోలు దొర‌క‌డం లేదు.

తాజాగా ఈ ప‌రిస్థితి సురేంద‌ర్ రెడ్డికి ఎదురైంది. సైరా త‌ర‌వాత సూరి సినిమా ఏమిటో ఇప్ప‌టి వ‌ర‌కూ క్లారిటీ లేదు. స్టార్ హీరోలంతా ఎవ‌రి ప్రాజెక్టుల‌తో వాళ్లు బిజీగా ఉన్నారు. మ‌రో రెండేళ్ల‌కు స‌రిప‌డా సినిమాలు వాళ్ల చేతుల్లో ఉన్నాయి. ఈ ద‌శ‌లో ద‌ర్శ‌కుల‌కు హీరోల్ని ప‌ట్టుకోవ‌డం కష్టంగా మారుతోంది. సురేంద‌ర్ రెడ్డి నిర్మాణంలో ఓ సినిమా ప‌ట్టాలెక్కాల్సింది. ఈ సినిమాకి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌డంతో పాటు, క‌థ అందిస్తున్నాడు సూరి. మ‌రోవైపు త‌న ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాప‌ట్టా లెక్కించాల‌ని ప్లాన్ చేస్తున్నాడు. ఇది వ‌ర‌కే వ‌ర‌కే కొంత‌మంది నిర్మాత‌ల ద‌గ్గ‌ర అడ్వాన్సు తీసుకున్నాడు సూరి. వాళ్ల‌కు సినిమాలు చేసి పెట్టాలి. అందుకే ఏదోలా ఓ హీరోని వెదుక్కోవాల్సివ‌స్తోంది. అల్లు అర్జున్‌, చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్… వీళ్లంతా సూరితో సినిమాలు చేయ‌డానికి రెడీ. కాక‌పోతే.. ఎవ‌రి ద‌గ్గ‌రా కాల్షీట్లు లేవు. ఎవ‌రి సినిమాల‌తో వాళ్లు బిజీ. వాళ్లంతా ఖాళీ అవ్వాలంటే క‌నీసం రెండేళ్లు ప‌డుతుంది. మిగిలిన హీరోల ప‌రిస్థితీ ఇంతే. స్టార్ల‌ని వ‌దిలేసి, కొత్త‌వాళ్ల‌తో సినిమాలు చేసేంత సాహ‌సం చేయ‌లేరు. క‌నీసం మిడిల్ రేంజు హీరోల‌తో స‌ర్దుకుపోదామంటే.. వాళ్లు మ‌రింత బిజీ. అందుకే… హీరోల కోసం ప‌డిగాపులు కాస్తున్నాడు సూరి. స్టార్ ద‌ర్శ‌కుల‌కే ఇలాంటి ప‌రిస్థితి ఎదురైతే.. మీడియం రేంజు ద‌ర్శ‌కుల మాటేంటో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మీడియా వాచ్ : టీవీ9 నుంచి ఇంకెంత మంది బయటకు..!?

తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టీవీ9పై ఇప్పుడు రాజకీయ రంగు పడింది. అధికారానికి మడుగులొత్తే చానల్‌గా మారిపోయింది. అదే సమయంలో పాత చార్మ్‌ను కొద్ది కొద్దిగా కోల్పోతూ.. వెలిసిపోతూ...

“సీఎంఆర్ఎఫ్ విరాళాల”పై రేవంత్ గురి..!

తెలంగాణ సర్కార్‌ను ఇరకాటంలో పెట్టడానికి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కొత్త తరహాలో ఆలోచిస్తూ ఉంటారు. కేటీఆర్ .. ఫామ్‌హౌస్ విషయాన్ని ప్రజల్లోకి చర్చకు పెట్టి టీఆర్ఎస్ ను కాస్త...

కేసీఆర్‌కు రామ్‌మాధవ్ బెదిరింపులేంటో..!?

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ అధికార, రాజకీయ కార్యకలాపాలకు త్వరలోనే ముగింపు తప్పదంటూ... బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ చేసిన హెచ్చరికలు ఇప్పుడు హైలెట్ అవుతున్నాయి. కరోనా విషయంలో... కాళేశ్వరం నిర్మాణ...

జగన్ పట్టుబట్టినా కర్ణాటకకే “మందాకిని”..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం .. కేంద్రానికి ఎంతగా సహకరిస్తున్నా... ఢిల్లీ సర్కార్ మాత్రం.. ఏపీ ప్రయోజనాలను కనీసం పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఏపీకి కేంద్రం కేటాయిస్తుందని ఆశలు పెట్టుకున్న మందాకిని బొగ్గు గనిని కర్ణాటకకు...

HOT NEWS

[X] Close
[X] Close