పవన్ కంటే జగన్ బెస్ట్: కమలనాథులు

తెలుగు రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ఎదగాలంటే జనసేన అధ్యాక్షుడు పవన్ కల్యాణ్ కంటే ఏపీ సీఎం జగన్మోహన రెడ్డితో స్నేహమే మేలు చేస్తుందని తెలుగు రాష్ట్రాల కమలనాధులు అభిప్రాయ పడుతున్నారు. ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి కలసిన నేపథ్యంలో ఈ రెండు పార్టీలు కలవనున్నాయని వార్తలు వచ్చాయి. ఈ వార్తల అనంతరం భారతీయ జనతా పార్టీ వైఎస్ జగన్మోహన రెడ్డితో స్నేహం చేస్తే తాము బీజేపీ కి దూరం అవుతామంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈ ప్రకటన పై బీజేపీ శ్రేణులు పవన్ కంటే అధికారంలో ఉన్న జగన్మోహన రెడ్డితో కలవడమే మేలు అని అభిప్రాయ పడుతున్నట్లు సమాచారం. ఈ కలయిక వల్ల రెండు తెలుగు రాష్ట్రాలలోను భారతీయ జనతా పార్టీకి మేలు చేకూరుతుంది అన్నది కమలానాథులు ఆలోచనగా చెబుతున్నారు. దీనికి కారణం స్నేహ సంబంధంలో భాగంగా ఏపీలో తమకు కొన్ని నామినేటెడ్ పదవులు దక్కే అవకాశం ఉందని త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలలో కూడా వైఎస్ ఆర్ కాంగ్రెస్ నుంచి తనకు ఆఫర్ వచ్చే అవకాశం ఉందని కమలనాథుల ఆలోచనగా చెబుతున్నారు.

రాజకీయంగా పవన్ కల్యాణ్ లో పరిణితి లేదని, ఆయన ఏ సందర్భంలో ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదని, అలాంటి పవన్ కల్యాణ్ తో ప్రయాణించడం కంటే అధికారంలో ఉన్న వైఎస ఆర్ కాంగ్రెస్తో ప్రయాణించడం పార్టీకి మేలు చేస్తుందని కమలనాథుల ఆలోచన. అలాగే తెలంగాణలో కూడా వైఎస్ ఆర్ కాంగ్రెస పార్టీకి అంతో ఇంతో క్యాడర్ ఉందని, పవన్ కల్యాణ్ జనసేన పార్టి తో పోలిస్తే వైఎస్ ఆర్కాం గ్రెస్ పార్టీ వల్ల ఎక్కువ మేలు జరుగుతుందన్నది కమలనాథుల ఆలోచనగా చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com