‘జానూ’ విష‌యంలో ర‌ష్మిక హ్యాపీ!

స‌మంత న‌టించిన ‘జానూ’ ఈమ‌ధ్యే విడుద‌లైంది. స‌మంత‌, శ‌ర్వాల న‌ట‌న‌కు మంచి మార్కులు ప‌డినా, ఈ సినిమా ఫ్లాప్ లిస్టులో చేరిపోయింది. స‌మంత‌, శ‌ర్వాల క‌ష్టానికి ఎలాంటి ప్ర‌తిఫ‌లం రాలేదు. అయితే ఈ సినిమా రిజ‌ల్ట్ విష‌యంలో ర‌ష్మిక హ్యాపీగా ఉంది. ఈ సినిమాకీ ర‌ష్మిక‌కీ సంబంధం ఏమిటంటారా..?

నిజానికి ఈ ఆఫ‌ర్ ర‌ష్మిక ద‌గ్గ‌ర‌కీ వెళ్లింది. ఈ సినిమా చేయాలా, వద్దా? అని స‌మంత స‌త‌మ‌త‌మ‌వుతున్న‌ప్పుడు దిల్ రాజు ద‌గ్గ‌ర మ‌రో ఆప్ష‌న్ రెడీగా ఉంది. త‌నే… ర‌ష్మిక‌. ’96’ రీమేక్‌లో న‌టించ‌మ‌ని దిల్ రాజు స్వ‌యంగా ర‌ష్మిక‌ని అడిగాడు. కానీ… ర‌ష్మిక ‘నో’ చెప్పింది. చివ‌రి క్ష‌ణాల్లో స‌మంత ఓకే చెప్పేయ‌డంతో, ర‌ష్మిక వ‌ద్ద‌న్నా ఈ ప్రాజెక్టు ముందుకెళ్లింది. ‘జానూ’ సినిమా కోసం మిమ్మ‌ల్ని సంప్ర‌దించిన మాట నిజ‌మేనా…? అని అడిగితే న‌వ్వుతూనే స‌మాధానం దాటేస్తోంది ర‌ష్మిక‌. ”అది అయిపోయిన విష‌యం క‌దా.. నేను చెప్ప‌కూడ‌దు. ష్‌…“ అంటూ క‌ప్ప‌దాటేసింది. అంత మంచి క్యారెక్ట‌ర్ వ‌దిలేసినందుకు బాధ ప‌డినా… రిజ‌ల్ట్ చూసి ‘వ‌దులుకోవ‌డ‌మే మంచిదైంది’ అని సంతోష ప‌డి ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మీడియా వాచ్ : టీవీ9 నుంచి ఇంకెంత మంది బయటకు..!?

తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టీవీ9పై ఇప్పుడు రాజకీయ రంగు పడింది. అధికారానికి మడుగులొత్తే చానల్‌గా మారిపోయింది. అదే సమయంలో పాత చార్మ్‌ను కొద్ది కొద్దిగా కోల్పోతూ.. వెలిసిపోతూ...

“సీఎంఆర్ఎఫ్ విరాళాల”పై రేవంత్ గురి..!

తెలంగాణ సర్కార్‌ను ఇరకాటంలో పెట్టడానికి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కొత్త తరహాలో ఆలోచిస్తూ ఉంటారు. కేటీఆర్ .. ఫామ్‌హౌస్ విషయాన్ని ప్రజల్లోకి చర్చకు పెట్టి టీఆర్ఎస్ ను కాస్త...

కేసీఆర్‌కు రామ్‌మాధవ్ బెదిరింపులేంటో..!?

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ అధికార, రాజకీయ కార్యకలాపాలకు త్వరలోనే ముగింపు తప్పదంటూ... బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ చేసిన హెచ్చరికలు ఇప్పుడు హైలెట్ అవుతున్నాయి. కరోనా విషయంలో... కాళేశ్వరం నిర్మాణ...

జగన్ పట్టుబట్టినా కర్ణాటకకే “మందాకిని”..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం .. కేంద్రానికి ఎంతగా సహకరిస్తున్నా... ఢిల్లీ సర్కార్ మాత్రం.. ఏపీ ప్రయోజనాలను కనీసం పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఏపీకి కేంద్రం కేటాయిస్తుందని ఆశలు పెట్టుకున్న మందాకిని బొగ్గు గనిని కర్ణాటకకు...

HOT NEWS

[X] Close
[X] Close