సూర్య బ్ర‌ద‌ర్స్‌ని క‌లిపిన రీమేక్‌

సూర్య హీరోగా నిల‌దొక్కుని, ఓ ఇమేజ్ సాధించిన త‌ర‌వాతే… కార్తి రంగ ప్ర‌వేశం చేశాడు. తాను కూడా… త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే వీరిద్ద‌రూ క‌లిసి ఒక్క సినిమాలోనూ న‌టించ‌లేదు. మీ ఇద్ద‌రి మ‌ల్టీస్టార‌ర్ ఎప్పుడు అని ఎవ‌రిని అడిగినా… `చేద్దాం.. చూద్దాం` అనే స‌మాధానం చెప్పేవారు. మంచి క‌థ దొరికితే వెంట‌నే చేసేస్తాం… అనేవారు. వాళ్లు కూడా త‌మ‌కు త‌గిన క‌థ కోసం గ‌ట్టి ప్ర‌య‌త్నాలే చేశారు. ఇప్పుడు అలాంటి క‌థ దొరికేసింది. ‘అయ్య‌ప్ప‌యుమ్ కోషియ‌మ్ రూపంలో.

ఈ మ‌ల‌యాళ సినిమా తెచ్చుకున్న‌క్రేజ్ అంతా ఇంతా కాదు. భార‌తీయ భాష‌ల‌న్నీ ఇప్పుడు ఈ రీమేక్ పై ప‌డ్డాయి. తెలుగు రైట్స్ ఎప్పుడో అమ్ముడుపోయాయి. అయితే ఈ రీమేక్‌లో ఎవ‌రు న‌టిస్తారు? ఎవ‌రు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు? అనేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ఈలోగా ఈ క‌థ హిందీలోనూ రీమేక్ చేస్తున్నార‌న్న వార్త‌లొస్తున్నాయి. జాన్ అబ్ర‌హాం రీమేక్ రైట్స్‌ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు త‌మిళంలోనూ అమ్ముడుపోయింది. సూర్య – కార్తీ హీరోలుగా ఈ సినిమా రీమేక్ అవ్వ‌బోతోంద‌ని స‌మాచారం. ఈమ‌ధ్యే ఈ అన్న‌ద‌మ్ములు ‘అయ్య‌ప్ప‌యుమ్ కోషియ‌మ్ చూశార‌ని. ఇద్ద‌రికీ న‌చ్చ‌డంతో సూర్య ఈ సినిమా రీమేక్ రైట్స్‌సొంతం చేసుకున్నార‌ని తెలుస్తోంది. ద‌ర్శ‌కుడెవ‌రో ఇంకా తేలాల్సివుంది. అలా మొత్తానికి ఈ సోద‌రుల కోరిక ఓ రీమేక్ క‌థ తీర్చ‌బోతోంద‌న్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ నేతలు ఎన్ని మాటలన్నా బీజేపీ ఎందుకు భరిస్తోంది..!?

ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు వైసీపీ నేతలకు అలుసైపోయారు. వైసీపీ నేతలు ఏ స్థాయి వారైనా.. బీజేపీ నేతలపై ఇష్టం వచ్చినట్లుగా విమర్శలు చేస్తున్నారు. కానీ బీజేపీ నేతలు మాత్రం.. ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ.....

శేఖర్ రెడ్డి వద్ద దొరికిన ఆ “కోట్లు” సాక్ష్యాలు కావా..!?

టీటీడీ పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితుడు శేఖర్‌రెడ్డికి సీబీఐ కోర్టు క్లీన్‌చిట్ ఇచ్చింది. ఆయన నేరాలకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాలు లేవని.. కేసు మూసివేయవచ్చని సీబీఐ అధికారులు కోర్టుకు చెప్పడంతో ఈ మేరకు కోర్టు...

ఏపీ సర్కార్‌పై అశ్వనీదత్, కృష్ణంరాజు న్యాయపోరాటం..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎయిర్‌పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియాపై సినీ నిర్మాత అశ్వనీదత్, రెబల్ స్టార్ కృష్ణంరాజు హైకోర్టులో పిటిషన్లు వేశారు. గన్నవరం విమానాశ్రయ విస్తరణ కోసం తమ భూముల్ని తీసుకుని ఇస్తామన్న పరిహారం...

స్వరశిల్పి బాలుకు స్వరనివాళులర్పించిన తానా – వీక్షించిన 50,000 మంది…

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో గానగంధర్వుడు, పద్మభూషణ్‍ డాక్టర్ ఎస్‍.పి. బాలసుబ్రహ్మణ్యం మృతికి సంతాపంగా "స్వరశిల్పికి స్వర నివాళి" పేరుతో ఆన్‍లైన్‍ వేదికగా ఏర్పాటు చేసిన నివాళి కార్యక్రమానికి పలువురు...

HOT NEWS

[X] Close
[X] Close