హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ మోసాల తీరు ఊహించని విధంగా మారుతోంది. సువర్ణభూమి ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ, ప్లాటింగ్ వెంచర్ల పేరిట పెట్టుబడిదారులను మోసం చేసి వందల కోట్ల మోసాలకు పాల్పడింది. సినీ నటులతో ఆకర్షణీయ ప్రకటనలు చేసి, బైబ్యాక్ స్కీమ్‌ల ద్వారా 30 లక్షల నుంచి 2 కోట్ల రూపాయల వరకు ప్రతి వ్యక్తి నుంచి వసూళ్లు చేసిన సంస్థ, ప్లాట్లు కేటాయించకుండా చెల్లని చెక్కులు ఇచ్చి పారిపోయింది.
వందల మంది సువర్ణ భూమి బాధితులు ఉన్నారు. సంస్థ ఎండీ శ్రీధర్‌పై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు జనవరి 2025లో సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ( కు బదిలీ చేశారు. సువర్ణభూమి సంస్థ 2021 నుంచి 2023 వరకు తమ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టమని ప్రలోభపెట్టింది. పెట్టుబడి పెట్టిన ఏడాది నుంచి 24% లాభాలు, ప్లాట్లు కేటాయించి బైబ్యాక్ ఆప్షన్ చెప్పింది. టీవీ యాడ్లలో ప్రముఖ నటులతో ప్రమోట్ చేయించారు.
చివరికి మోసం చేశాడని తెలియడంతో పలువురు పోలీస్ స్టేషన్లలోకేసులు పెట్టారు. సంస్థ ఎండీ నేని శ్రీధర్, డైరెక్టర్ దీప్తి , ఇతర ఉద్యోగులు మోసానికి పాల్పడ్డారని గతంలో కేసులు నమోదు అయితే. ముందస్తు. బెయిల్ తెచ్చుకుని మళ్లీ మోసాలు కొనసాగించారు. తెలంగాణ రెరా సువర్ణభూమి పై 6 ఫిర్యాదులు, ఆలస్యాలు, ఉల్లంఘనలపై పెనాల్టీలు విధించింది. అయినా మార్పు లేదు.
ఇప్పుడు ఈ కంపెనీ డైరక్టర్లు వేరే కంపెనీల పేరుతో మళ్లీ మోసాలు చేసేందుకుప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. కనీసం జైలుకు వెళ్లకుండా ..మోసాలు చేసి.. బెయిల్స్ పై ఉంటూ.. మళ్లీ మళ్లీ మోసాలకు పాల్పడటం వ్యవస్థల్ని వెక్కిరించడం అవుతుంది.
                                                
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
                                              
                                              
                                              
                                              
                                              