ఎస్వీ కృష్ణారెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో…

ఒక‌ప్పుడు కుటుంబ క‌థా చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్స్‌గా క‌నిపించిన పేరు.. ఎస్వీ కృష్ణారెడ్డి. దాదాపు అన్నీ హిట్లే. హీరోగా మారాక ఆయ‌న కెరీర్ గ్రాఫ్ అమాంతంగా ప‌డిపోయింది. ద‌ర్శ‌కుడిగానూ బ్యాక్ స్టెప్ వేయాల్సివ‌చ్చింది. స్వీ కృష్ణారెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ హాలీవుడ్ చిత్రం కూడా తెర‌కెక్కింది. `ఆహ్వానం` చిత్రాన్ని `డైవ‌ర్స్ ఇన్విటేష‌న్‌` పేరుతో అక్క‌డ తెర‌కెక్కించారు. కానీ అదీ ఫ‌ట్టే. య‌మ‌లీల 2 త‌ర‌వాత ఆయ‌న మ‌ళ్లీ మెగా ఫోన్ ప‌ట్ట‌లేదు. ఇంత‌కాలానికి మ‌ళ్లీ ఎస్వీ.కృష్ణారెడ్డి కెప్టెన్ కుర్చీలో కూర్చోబోతున్నారు. ప్ర‌స్తుతం స్క్రిప్టు వ‌ర్క్ జ‌రుగుతోంది. త్వ‌ర‌లోనే క‌థానాయ‌కుడు, నిర్మాణ సంస్థ వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌స్తాయి. అయితే ఎస్వీ కృష్ణారెడ్డి మార్కు సినిమాలు ఇప్పుడు న‌డ‌వ‌వు. జ‌న‌రేష‌న్ మారింది. ఆలోచ‌న‌లు మారాయి. సినిమా చూసే, తీసే ప‌ద్ధ‌తులు మారాయి. మ‌రి.. ఈసారి స‌రికొత్త కృష్ణారెడ్డి బ‌య‌ట‌కు వ‌స్తారో, లేదంటే… పాత స్టైల్‌లోనే క‌నిపిస్తారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close