తొక్కిసలాట మృతులపై స్వామీజీ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: హిందూ ధర్మ ప్రచారసమితి కన్వీనర్ కమలానందభారతి స్వామీజీ నిన్న రాజమండ్రిలో తొక్కిసలాట దుర్ఘటనలో చనిపోయినవారిగురించి స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మృతుల బంధువులకు బాధ ఉంటుందని, అయితే ఆధ్యాత్మిక కోణంలో చూస్తే చనిపోయిన వారంతా వైకుంఠప్రాప్తి పొందినట్లేనని చెప్పారు. అదృష్టం ఉండటంవలనే ఆ 27మందీ అలా మరణించారని, అది ఎవరికీ సాధ్యంకాదని అన్నారు. వారందరికీ మోక్షప్రాప్తి కలిగిందని, ఈ దుర్ఘటనను ఇలాగే పరిగణించాలని ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. మృతుల బంధువులు ఆ బాధను అధిగమించి ముందుకు పోవాలని అన్నారు. నదిలో మనం కొద్దిగా నీరు తీసుకుంటే నదికేమీ లోటుండదని, అలాగే ఒక కార్యక్రమం జరుగుతుంటే ఒక ఘటన జరిగితే మిగతా కార్యక్రమాన్ని జారవిడుచుకోవాల్సిన అవసరంలేదని చెప్పారు. అన్నట్లు ఈ స్వామీజీ 2013 సంవత్సరంలో అక్బరుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలపై తీవ్రంగా ప్రతిస్పందించినందుకుగానూ అరెస్టయ్యారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com