స్వాతి రీ – రీ – ఎంట్రీ

చ‌టుక్కున వ‌చ్చి రెండు మూడు సినిమాలు చేసి, కామ్ అయిపోవ‌డం. మ‌ళ్లీ ట‌చ్‌లోకి రావ‌డం, మ‌ళ్లీ దూర‌మ‌వ్వ‌డం… స్వాతికి అల‌వాటే. చేతిలో అష్టాచ‌మ్మా, స్వామి రారా, కార్తికేయ లాంటి హిట్స్ ప‌డినా – స్వాతి బండి ఎందుకో స్పీడ్ అందుకోలేదు. ఇటీవ‌లే స్వాతి పెళ్లి చేసుకొంది. పెళ్ల‌య్యాక న‌ట‌న‌కు ఫుల్ స్టాప్ పెడుతుందేమో అనుకున్నారంతా. కానీ… స్వాతి మ‌ళ్లీ మేక‌ప్‌వేసుకోవ‌డానికి రెడీ అయ్యింది. ఓసినిమాలో న‌టించ‌డానికి సంత‌కాలు కూడా పెట్టేసింది. అదే.. కార్తికేయ 2లో.

కార్తికేయ‌లో నిఖిల్ – స్వాతి జంట‌గా న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా సీక్వెల్ లో మాత్రం అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ని క‌థానాయిక‌గా ఎంచుకున్నారు. దాంతో ఈ టీమ్ లో మిస్స‌య్యింది స్వాతి ఒక్క‌ర్తే అనుకున్నారంతా. కానీ ఇప్పుడు స్వాతిని సైతం కార్తికేయ 2లో తీసుకున్నారు. కార్తికేయ క‌థ ఎక్క‌డైతే ఆగిందో, అక్క‌డి నుంచి కార్తికేయ 2 మొద‌ల‌వుతుంది. అంటే.. కార్తికేయ‌లో క‌నిపించిన ప్ర‌తీ పాత్రా.. పార్ట్ 2లోనూ చూపించాలి. అందుకే… స్వాతిని ఎంచుకున్నారు. ఇది స్వాతికి రీ – రీ ఎంట్రీ.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రాణభయంతో దేశం విడిచి వెళ్లిన పట్టాభి !?

టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాల్దీవ్స్ వెళ్లారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.  ఆయన విమానం ఎక్కినప్పటి నుండి దిగిన వరకూ ఆయనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో కనిపించాయి. ఓ పార్టీ...

‘గీతా’లో మరో సంతకం

'బొమ్మరిల్లు’ సినిమా దర్శకుడు భాస్కర్ జాతకాన్ని మార్చేసింది. ఆ సినిమానే ఆయన ఇంటిపేరు అయింది. రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి పెద్ద హీరోలతో సినిమా చేసే ఛాన్స్ త్వరగానే వచ్చేసింది. అయితే...

విష్ణు నిర్ణ‌యం బాగుంది.. కానీ!?

`మా` అధ్య‌క్షుడిగా ఇటీవ‌లే ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించారు మంచు విష్ణు. వీలైనంత త్వ‌ర‌గా త‌న మార్క్ ని చూపించాల‌ని తాప‌త్ర‌య‌ప‌డుతున్నారు. `మా` బై లాస్ లో కొన్నింటికి మార్చాల‌న్న‌ది విష్ణు ఆలోచ‌న‌. ...

ఏపీ చీకట్లే తెలంగాణ వెలుగులకు సాక్ష్యాలన్న కేసీఆర్

టీఆర్ఎస్ అధినేతగా 9వసారి ఏకగ్రీవంగా ఎన్నికైన కేసీఆర్ తన ప్రసంగంలో .. తెలంగాణ అభివృద్ధిని.. ఏపీతో పోల్చి విడిపోవడం వల్ల ఎంత ప్రగతి సాధించామో వివరించారు. రాష్ట్రం విడిపోతే తెలంగాణ చీకట్లోకి...

HOT NEWS

[X] Close
[X] Close