‘ట‌క్’ ఎఫెక్ట్‌… విజ‌య్ సినిమాపైన?

నిన్ను కోరి, మ‌జిలీ లాంటి డీసెంట్స్ హిట్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ‌. ఇప్పుడు నానితో ట‌క్ జ‌గ‌దీష్ సినిమా చేశాడు. వ‌రుస‌గా రెండు హిట్లు కొట్ట‌డంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. అందుకే.. విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా శివ‌తో ఓసినిమా చేయ‌డానికి ఉత్సాహం చూపించాడు. వీరిద్ద‌రి మ‌ధ్యా క‌థా చ‌ర్చ‌లు కూడా జ‌రిగాయి. అయితే విజ‌య్ ఈ సినిమా చేయాలా వ‌ద్దా?? అనే డైలామాలో ప‌డిన‌ట్టు ముందు నుంచీ వార్త‌లొస్తూనే ఉన్నాయి. పాన్ ఇండియా మోజులో ఉన్న విజ‌య్‌… శివ చెప్పిన ల‌వ్ స్టోరీకి క‌నెక్ట్ కాలేక‌పోయాడ‌ని ఇన్‌సైడ్ టాక్‌.

కానీ ఈమ‌ధ్య ఓ ఇంట‌ర్వ్యూలో మాత్రం `విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో సినిమా చేస్తున్నా. నా త‌దుప‌రి చిత్రం అదే` అంటూ క్లారిటీ ఇచ్చాడు శివ నిర్వాణ‌. నిజానికి ట‌క్ జ‌గ‌దీష్ రిపోర్ట్ బాగా వ‌చ్చి ఉంటే… విజ‌య్ – శివ ల సినిమాపై ఎవ‌రికీ ఎలాంటి డౌటూ ఉండేది కాదు. కానీ.. ట‌క్ జ‌గ‌దీష్ కి డిజాస్ట‌ర్ రిపోర్ట్ వ‌చ్చింది. ఓటీటీ – బ్ర‌హ్మోత్సవం అంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజ‌న్లు. ఇది ఓటీటీలో విడుద‌లైంది కాబ‌ట్టి స‌రిపోయింది… థియేట‌ర్ల‌లో వ‌స్తే ప‌రిస్థితేంటి? అంటూ లెక్క‌లేస్తున్నాయి ట్రేడ్ వ‌ర్గాలు. ఇలాంటి స‌మ‌యంలో… విజ‌య్ దేవ‌ర‌కొండ శివ నిర్వాణ‌కి అవ‌కాశం ఇవ్వ‌డం క‌ష్ట‌మే. ట‌క్ విడుద‌ల‌కు ముందే ఈ సినిమా చేయాలా వ‌ద్దా అనే డైలామాలో ఉన్న విజ‌య్ కి `ట‌క్‌` రిపోర్ట్ తో ఓ క్లారిటీ ఇచ్చేసి ఉంటుంది. ఇక‌.. శివ మ‌రో హీరోని వెదుక్కోవ‌డం త‌ప్ప‌దేమో.??

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘గీతా’లో మరో సంతకం

'బొమ్మరిల్లు’ సినిమా దర్శకుడు భాస్కర్ జాతకాన్ని మార్చేసింది. ఆ సినిమానే ఆయన ఇంటిపేరు అయింది. రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి పెద్ద హీరోలతో సినిమా చేసే ఛాన్స్ త్వరగానే వచ్చేసింది. అయితే...

విష్ణు నిర్ణ‌యం బాగుంది.. కానీ!?

`మా` అధ్య‌క్షుడిగా ఇటీవ‌లే ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించారు మంచు విష్ణు. వీలైనంత త్వ‌ర‌గా త‌న మార్క్ ని చూపించాల‌ని తాప‌త్ర‌య‌ప‌డుతున్నారు. `మా` బై లాస్ లో కొన్నింటికి మార్చాల‌న్న‌ది విష్ణు ఆలోచ‌న‌. ...

ఏపీ చీకట్లే తెలంగాణ వెలుగులకు సాక్ష్యాలన్న కేసీఆర్

టీఆర్ఎస్ అధినేతగా 9వసారి ఏకగ్రీవంగా ఎన్నికైన కేసీఆర్ తన ప్రసంగంలో .. తెలంగాణ అభివృద్ధిని.. ఏపీతో పోల్చి విడిపోవడం వల్ల ఎంత ప్రగతి సాధించామో వివరించారు. రాష్ట్రం విడిపోతే తెలంగాణ చీకట్లోకి...

పూరి గ‌ట్స్‌.. రెండ్రోజుల ముందే ప్రీమియ‌ర్‌

సినిమాకి టాక్ చాలా ముఖ్యం. పాజిటీవ్ టాక్ వ‌స్తే - క‌ల‌క్ష‌న్లు వ‌స్తాయి. ఏమాత్రం తేడా వ‌చ్చినా - ఫ‌ట్‌మ‌న‌డం ఖాయం. రిలీజ్ డే టాక్ అనేది వ‌సూళ్ల‌లో కీల‌క పాత్ర పోషిస్తుంటుంది....

HOT NEWS

[X] Close
[X] Close