‘ల‌వ్ స్టోరీ’కి ‘సిటీమార్’ బూస్ట్

ప‌క్కా మాస్ సినిమా ప‌డితే.. కచ్చితంగా జ‌నాలు థియేట‌ర్ల‌కు వ‌స్తార‌న్న‌ది నిర్మాత‌లు, పంపిణీదారుల న‌మ్మ‌కం. దాన్ని `సిటీమార్‌` కొంత వ‌ర‌కూ నిల‌బెట్టింది. శుక్ర‌వారం విడుద‌లైన ఈ సినిమాకి రివ్యూలు నెగిటీవ్ గా వ‌చ్చినా, వ‌సూళ్లు బాగున్నాయి. ముఖ్యంగా బీ, సీ సెంట‌ర్ల‌లో సిటీమార్ ప్ర‌భావం చూపిస్తోంది. పండ‌గ రోజు కావ‌డం, సిటీమార్ త‌ప్ప మ‌రో ఆప్ష‌న్ లేక‌పోవ‌డంతో టికెట్లు బాగానే తెగాయి. శ‌ని, ఆది వారాలూ ఈ జోరు కొన‌సాగితే – సిటీమార్ పాసైపోయిన‌ట్టే. ఇప్పుడు ఈ సినిమా రిజ‌ల్ట్.. ల‌వ్ స్టోరీకి బూస్ట‌ప్ ఇచ్చిన‌ట్టైంది. ఎప్పుడైతే సిటీమార్ కి మంచి ఓపెనింగ్స్ వ‌చ్చాయ‌ని తెలిసిందో.. అప్పుడే ల‌వ్ స్టోరీ రిలీజ్ డేట్ ప్ర‌క‌టించేశారు నిర్మాత‌లు ఈనెల 24న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్న‌ట్టు అధికారికంగ ఆప్ర‌క‌టించారు. నిజానికి మాస్ సినిమాకి ఉండే ఆక‌ర్ష‌ణే.. ల‌వ్ స్టోరీల‌కూ ఉంటుంది. పైగా శేఖ‌ర్ క‌మ్ముల నుంచి ఓ ల‌వ్ స్టోరీ వ‌స్తోందంటే అంచ‌నాలు భారీగా ఉంటాయి. దానికి తోడు.. సాయి ప‌ల్ల‌వి లాంటి క‌థానాయిక‌, సారంగ ద‌రియా లాంటి పాట ఉండ‌డం పెద్ద ప్ల‌స్సులు. ల‌వ్ స్టోరీ కూడా క్లిక్క‌యి.. యూత్ తో పాటు కుటుంబ స‌భ్యులూ థియేట‌ర్ల‌కు వ‌స్తే – తెలుగు చిత్ర‌సీమ దారిన ప‌డిన‌ట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఇరుక్కుపోనున్న వైసీపీ !

వైసీపీకి తెలంగాణ పెద్ద చిక్కుముడిగా మారిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఏపీ కంటే ముందే తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో వైసీపీ లేదు. కానీ ఆ పార్టీకి కొంచెం ఓటు బ్యాంక్ ఉంది. ...

మునుగోడులో కాంగ్రెస్ కు మేలు చేసేలా టీఆర్ఎస్ ప్లాన్ !?

" మునుగోడు ఉపఎన్నిక చిన్నదే. దాని వల్ల వచ్చేదేం ఉండదు.. పోయేదేం ఉండదు " అని మంత్రి కేటీఆర్ ఇటీవల నెటిజన్లతో నిర్వహించిన ఆస్క్ కేటీఆర్ కార్యక్రమంలో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు...

మాధవ్ ఫిర్యాదు మీదే విచారణ చేస్తున్నారట !

న్యూడ్ వీడియో విషయంలో ఎంపీ మాధన్‌ను రక్షించడమే కాదు.. బాధితుడిగా చూపించేందుకు ప్రభుత్వం సిద్ధపడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఈ అంశం ఎంతకీ సద్దుమణగకపోతూండటం .. విచిత్రమైన రియాక్షన్స్‌తో అందరూ ప్రజల దృష్టిలో చులకన అవుతూండటంతో...

ఖాళీగా ఉన్న నేతలందరికీ బీజేపీ నుంచి ఆహ్వానాలు !

తెలంగాణలో పెద్ద ఎత్తున చేరికలు ఉన్నాయని చెప్పడానికో .. లేకపోతే సీనియర్ నేతల అవసరం ఉందనుకుంటున్నారో కానీ తెలంగాణలో ఖాళీగా ఉన్న నేతలందరికీ బీజేపీ నుంచి ఫోన్లు వెళ్తున్నాయి. చేరికల కమిటీ చైర్మన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close