సాయిధ‌ర‌మ్ తేజ్‌పై రెండు కేసులు

శుక్ర‌వారం రాత్రి హైద‌రాబాద్ లోని కేబుల్ బ్రిడ్జ్‌పై సాయిధ‌ర‌మ్ తేజ్ రోడ్డు ప్ర‌మాదానికి గురైన సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌మాదంలో తేజ్‌కి గాయాల‌య్యాయి. ఆయ‌న అప‌స్మార‌క స్థితిలోకి కూడా వెళ్లిపోయారు. ప్ర‌స్తుతం అపోలో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘ‌ట‌న‌పై రాయ‌దుర్గం పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. నిర్ల‌క్ష పూరిత‌మైన‌, వేగ‌వంత‌మైన డ్రైవింగ్ వ‌ల్ల ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్టు పోలీసులు ప్రాధ‌మిక నిర్దార‌ణ‌కు వ‌చ్చారు. దాంతో సాయిధ‌ర‌మ్ పై ఐపీసీ సెక్ష‌న్ 336, మోట‌ర్ వెహికిల్ యాక్ట్ 184 కింద రెండు కేసులు న‌మోదు చేశారు. తేజ్ హెల్మెట్ పెట్టుకోవ‌డం వ‌ల్ల పెను ప్ర‌మాదం త‌ప్పింది. ఆయ‌న మ‌ద్యం సేవించి సేవించి ఉన్నాడ‌ని ముందు అనుమానించారు. కానీ అలాంటిదేం లేద‌ని వైద్యులు క్లారిటీ ఇచ్చారు. లేదంటే… డ్రంక్ అండ్ డ్రైవ్ సెక్ష‌న్ లో మ‌రో కేసు బుక్ అయ్యేది. తేజ్ కి స్పోర్ట్స్ బైక్స్ అంటే ఇష్టం. ఖాళీ స‌మ‌యాల్లో షికారు కొడుతుంటాడు. అయితే కేబుల్ బ్రిడ్జ్‌పై ఇసుకు పేరుకుపోవ‌డంతో బండి అదుపు త‌ప్పింది. ఆ స‌మ‌యంలో తేజ్ ఏ స్పీడులో బండి న‌డుతున్నాడో తెలియాల్సివుంది. సీసీ కెమెరా ఫుటేజీ చూస్తుంటే… తేజ్ మ‌రీ ప్ర‌మాద‌క‌ర‌మైన వేగంతో బండి న‌డ‌ప‌డం లేద‌ని అర్థ‌మ‌వుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

విష్ణు నిర్ణ‌యం బాగుంది.. కానీ!?

`మా` అధ్య‌క్షుడిగా ఇటీవ‌లే ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించారు మంచు విష్ణు. వీలైనంత త్వ‌ర‌గా త‌న మార్క్ ని చూపించాల‌ని తాప‌త్ర‌య‌ప‌డుతున్నారు. `మా` బై లాస్ లో కొన్నింటికి మార్చాల‌న్న‌ది విష్ణు ఆలోచ‌న‌. ...

ఏపీ చీకట్లే తెలంగాణ వెలుగులకు సాక్ష్యాలన్న కేసీఆర్

టీఆర్ఎస్ అధినేతగా 9వసారి ఏకగ్రీవంగా ఎన్నికైన కేసీఆర్ తన ప్రసంగంలో .. తెలంగాణ అభివృద్ధిని.. ఏపీతో పోల్చి విడిపోవడం వల్ల ఎంత ప్రగతి సాధించామో వివరించారు. రాష్ట్రం విడిపోతే తెలంగాణ చీకట్లోకి...

పూరి గ‌ట్స్‌.. రెండ్రోజుల ముందే ప్రీమియ‌ర్‌

సినిమాకి టాక్ చాలా ముఖ్యం. పాజిటీవ్ టాక్ వ‌స్తే - క‌ల‌క్ష‌న్లు వ‌స్తాయి. ఏమాత్రం తేడా వ‌చ్చినా - ఫ‌ట్‌మ‌న‌డం ఖాయం. రిలీజ్ డే టాక్ అనేది వ‌సూళ్ల‌లో కీల‌క పాత్ర పోషిస్తుంటుంది....

‘RRR’కి పోటీనే లేదా?

సంక్రాంతి బ‌రిలోకి RRR దిగ‌డంతో... స‌మీక‌ర‌ణాలు పూర్తిగా మారిపోయాయి. ఈ సంక్రాంతికి భీమ్లా నాయ‌క్‌, ఎఫ్ 3, స‌ర్కారు వారి పాట‌, రాధే శ్యామ్ ముందుగానే క‌ర్చీఫ్ లు వేసుకున్నాయి. అయితే స‌డ‌న్...

HOT NEWS

[X] Close
[X] Close