బిగ్ బాస్ విషయంలో మాత్రం సీపీఐ నారాయణది బీజేపీ భావజాలం..!

కమ్యూనిస్టు పార్టీ నేత సీపీఐ నారాయణ బిగ్ బాస్‌పై పైరయ్యారు. అది చాలా అనైతిక షో అని.. బూతుల ప్రపంచం అని విరుచుకుపడ్డారు. ఆయన అభిప్రాయం ఎలా ఉన్నా ఆయన మాత్రం ఆ షోను రెగ్యులర్‌గా చూస్తారు కాబట్టే ఈ అభిప్రాయానికి వచ్చారని అనుకోవచ్చు. ప్రత్యేకంగా బిగ్ బాస్ షోను చూస్తే.. సెల్ఫీ వీడియో తీసుకుని ఆ షోను బ్యాన్ చేయాలని తన అభిప్రాయంగా మీడియాకు పంపించారు సీపీఐ నారాయణ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి షోలకు ఎలా అనుమతి ఇస్తున్నాయని ఆయన ఆశ్చర్యపోతున్నారు. సమాజంలో విష సంస్కృతిని బిగ్‌బాస్ షో నింపుతోందని నారాయణ మండిపడ్డారు.

బిగ్ బాస్ షోపై ఎవరికీ మంచి అభిప్రాయాలు లేవు. అందరికీ తేడా అభిప్రాయాలే ఉన్నాయి. కానీ అందరూ చూస్తున్నారు. సీపీఐ నారాయణ కూడా చూస్తున్నారు. ఆ షో తీసేవాళ్లకు కావాల్సింది అదే. అయితే ఇక్కడ నారాయణ బ్యాక్ గ్రౌండ్ ఏమిటి ఆయన వ్యక్తం చేస్తున్న అభిప్రాయం ఏమిటి అన్నదే హాట్ టాపిక్ గా మారుతోంది. సాధారణంగా సంప్రదాయాలు, సమాజంలో విలువలు, సంస్కృతి పరిరక్షణ గురించి మాట్లాడేది బీజేపీ నేతలు. వారికి వ్యతిరేకంగా వాదనలు వినిపించేవారు కమ్యూనిస్టు పార్టీల నేతలు. అయితే సీపీఐ నారాయణకు మాత్రం బిగ్ బాస్ షో విషయానికి వచ్చే సరికి విలువలు గుర్తుకు వస్తున్నాయి. ఏకంగా బ్యాన్ చేయాలని అంటున్నారు.

గత ఏడాది కూడా సీపీఐ నారాయణకు బిగ్ బాస్ పై కోపం వచ్చింది. ఓ ఎపిసోడ్‌లో కంటెస్టెంట్ అభిజిత్‌కు ముగ్గరు హీరోయిన్ల ఫోటోలు చూపించి ఏం చేస్తావని నాగార్జున అడుగుతాడు. ఒక‌మ్మాయిని ముద్దు పెట్టుకుంటా, ఒక‌మ్మాయితో డేటింగ్ చేస్తా, మ‌రో అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెబుతాడు. ఈ సమాధానం వినిని నారాయణకు మండిపోయింది. తర్వాత రోజు మీడియా సమావేశం పెట్టి ఉతికి పారేశారు. అనైతిక చ‌ర్యల‌కు పాల్పడ‌టాన్ని మేము ఖండిస్తున్నామని ప్రకటించేశారు. మళ్లీ ఇప్పుడు కూడా కంటెస్టెంట్లు బూతులు మాట్లాడుకోవడంతో ఆయనకు చిర్రెత్తుకొచ్చింది. మరీ అంత ఇబ్బంది అయితే అంత పని గట్టుకుని చూడాల్సిన అవసరం ఏముందన్న సందేహం ఇతరులకు వస్తుంది. కానీ నారాయణ బిగ్ బాస్ చూస్తూనే ఉంటారు… బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తూనే ఉంటారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close