ఆ క్రెడిట్ కోసం తెలంగాణా భాజపా నేతల యావ!

తెలంగాణా, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు కేసీఆర్, దేవేంద్ర ఫడ్నవీస్ నిన్న నదీ జలాల పంపకాల కోసం ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసారు. అది తెరాస ప్రభుత్వం చొరవ కారణంగానే సాధ్యమయిందని అందరికీ తెలుసు. దాని కోసం రాష్ట్ర భాజపా నేతలు చేసిందేమీ లేకపోయినా, దాని క్రెడిట్ స్వంతం చేసుకొనేందుకు వారు ప్రదర్శించిన అత్యుత్సాహం చూసి రాష్ట్ర ప్రజలు నవ్వుకొంటున్నారు. ఆ ఒప్పందంపై ముఖ్యమంత్రులు ఇరువురూ సంతకాలు చేసిన తరువాత, రాష్ట్ర భాజపా నేతలు ముంబై చేరుకొని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ని కలిసి, తెలంగాణాకు సహకరించినందుకు కృతజ్ఞతలు చెప్పి, ఆయనతో కలిసి ఆ ఒప్పంద పత్రం పట్టుకొని మీడియాకి ఫోజులు ఇచ్చారు. ఆ ఒప్పందం జరగడానికి తెరాస ప్రభుత్వం చూపిన చొరవ కారణం అయితే, ఆ ఖ్యాతి మాత్రం మహారాష్ట్ర (భాజపా) ప్రభుత్వానికే దక్కుతుందని వారు చెప్పారు. దీని గురించి భాజపా మంత్రులు బండారు దత్తాత్రేయ, హన్స్రాజ్ ఆహిర్ చాలా కాలంగా కృషి చేస్తున్నారని కానీ దాని క్రెడిట్ తమకే దక్కాలని వారెన్నడూ ఆరాటపడలేదని భాజపా ఎమ్మెల్యే డా. లక్ష్మణ్ చెప్పారు.

మాజీ ప్రధాని వాజ్ పేయి హయంలోనే నదుల అనుసంధాన ప్రక్రియ గురించి ఆలోచనలు చేసారని దానిని ప్రధాని నరేంద్ర మోడి సాకారం చేస్తున్నారని, ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ ఒప్పందం జరగడం చాలా శుభ పరిణామమని వారు చెప్పారు. కేంద్రంలో, మహారాష్ట్రాలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలు సహకరించడం వలననే ఈ ఒప్పందం సాధ్యపడిందని వారు మీడియాకి చెప్పారు. తెలంగాణాలో గోదావరి మరియు ఇతర నదులపై నిర్మిస్తున్న ప్రాజెక్టులకు కేంద్రప్రభుత్వం సహాయసహకారాల కోసం తమవంతు ప్రయత్నాలు తాము చేస్తామని చెప్పారు. తెలంగాణాలో సముద్రం లేదు కనుక నదీ మార్గాలలో జలరవాణా వ్యవస్థల ఏర్పాటుకు సహకరించమని తాము చేసిన విజ్ఞప్తిని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సానుకూలంగా స్పందించారని వారు చెప్పారు. ఈ మహా ఒప్పందాన్ని తాము స్వాగతిస్తున్నామని భాజపా ఎమ్మెల్యే డా.లక్ష్మణ్ చెప్పారు.
కేంద్రంలో భాజపాయే అధికారంలో ఉన్నప్పటికీ తెలంగాణా కోసం రాష్ట్ర బీజేపీ నేతలు చేసిందేమీ లేదు కానీ తెలంగాణా ప్రభుత్వం చొరవతో సాధ్యమయిన ఈ ఒప్పందంపై క్రెడిట్ స్వంతం చేసుకోవడానికి హడావుడిగా అందరూ ముంబై పరుగులు తీయడం, ఆ క్రెడిట్ తెలంగాణా ప్రభుత్వానిది కాదు…మహారాష్ట్ర ప్రభుత్వానిది, కేంద్రప్రభుత్వానిదేనని వారు చెప్పుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది. తెలంగాణా భాజపా నేతలకు అటువంటి క్రెడిట్ కావాలని కోరుకొంతున్నట్లయితే, డిల్లీ వెళ్లి రాష్ట్రం కోసం ఏమయినా సాధించుకొని వస్తే బాగుంటుంది. కానీ వారు అలాగ చేయకుండా తెలంగాణా ప్రభుత్వం చేస్తున్న పనులను నిత్యం విమర్శిస్తూ కాలక్షేపం చేస్తుంటారు. మళ్ళీ అది చేసే ఇటువంటి మంచి పనులలో తమకీ వాటా ఉండాలని ఆశిస్తుంటారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జ‌గ‌న్ కు షాక్… వైసీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థికి 18నెల‌ల జైలు

వైసీపీ అధినేత జ‌గ‌న్ కు మ‌రోషాక్ త‌గిలింది. వైసీపీ ఎమ్మెల్యేగా మండ‌పేట అసెంబ్లీ నుండి పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు కోర్టు 18నెల‌ల జైలు శిక్ష విధించింది. 28 సంవ‌త్స‌రాల క్రితం...

కాంగ్రెస్ మేనిఫెస్టో వర్సెస్ బీజేపీ మేనిఫెస్టో ..!!

లోక్ సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించాలని బీజేపీ...ఈసారి ఎలాగైనా అధికారం చేపట్టాలని కాంగ్రెస్ మేనిఫెస్టోకు రూపకల్పన చేసి విడుదల చేశాయి. కాంగ్రెస్ న్యాయ్ పత్ర్ పేరుతో బీజేపీ సంకల్ప్ పత్ర్ పేరుతో...

సంయుక్త‌కు బాలీవుడ్ ఆఫర్‌

భీమ్లా నాయ‌క్‌, బింబిసార‌, సార్‌, విరూపాక్ష‌.... ఇలా తెలుగులో మంచి విజ‌యాల్ని త‌న ఖాతాలో వేసుకొంది సంయుక్త మీన‌న్‌. ప్ర‌స్తుతం నిఖిల్, శ‌ర్వానంద్ చిత్రాల్లో క‌థానాయిక‌గా న‌టిస్తోంది. సౌత్‌లో బిజీగా ఉన్న క‌థానాయిక‌ల‌పై...

‘పుష్ష 2’.. మ‌రో టీజ‌ర్ రెడీనా?

అల్లు అర్జున్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఇటీవ‌ల 'పుష్ష 2' గ్లింప్స్ విడుద‌లైంది. బ‌న్నీ ఫ్యాన్స్‌కు ఈ టీజర్ పూన‌కాలు తెప్పించింది. అయితే... మిగిలిన ఫ్యాన్స్‌కు అంత‌గా ఎక్క‌లేదు. టీజ‌ర్‌లో డైలాగ్ వినిపించ‌క‌పోవ‌డం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close