హరిత హారం భేష్..జానా! హారంలో కుంభకోణం..భట్టి!

తెలంగాణా అంతటా పచ్చదనం నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం హరితహారం పేరిట ఈరోజు నుంచి మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభిస్తోంది. ఏ ప్రభుత్వమైనా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం సాధారణమైన విషయమే. కానీ అటువంటివాటి కార్యక్రమాలని ప్రభుత్వాలు కేవలం ప్రచారార్భాటం కోసమే చేస్తుండటం వలన వాటిలో విజయవంతం అయినవి చాలా తక్కువగా ఉంటాయి. కానీ విజయవంతమయితే అవి ఆ ప్రభుత్వాలకి, ముఖ్యమంత్రులకి ఎనలేని కీర్తి ప్రతిష్టలు, ప్రజాభిమానాన్ని సంపాదించిపెడతాయని స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పధకం, చంద్రబాబు ప్రవేశపెట్టిన రైతు బజార్లు నిరూపిస్తున్నాయి. ఒకవేళ తెలంగాణా ప్రభుత్వం ఈ హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయగలిగితే, దాని వలన ముఖ్యమంత్రి కెసిఆర్ కి కూడా అటువంటి శాశ్వితమైన కీర్తి ప్రతిష్టలు దక్కుతాయి.

ఈ హరితహారం కార్యక్రమంపై ప్రతిపక్ష నేత కె. జానారెడ్డి ప్రశంసలు కురిపించారు. తెరాస ప్రభుత్వం చాలా మంచి కార్యక్రమం మొదలుపెట్టిందని, దానిలో రాష్ట్ర ప్రజలు అందరూ భాగస్వాములు అవ్వాలని పిలుపునిచ్చారు. సాధారణంగా ప్రభుత్వం చేపట్టే ఏ కార్యక్రమానైనా ప్రతిపక్షాలు తప్పనిసరిగా విమర్శించాలనే మూర్కత్వం నుంచి జానారెడ్డి బయటపడి ఈవిధంగా స్పందించడం అభినందనీయం. దానికీ రాజకీయ కారణాలు, ఆలోచనలు ఏవైనా ఉన్నాయేమో తెలియదు కానీ ప్రభుత్వం ఒక మంచిపని చేస్తున్నపుడు దానికి అందరూ సహకరించాలని ప్రతిపక్ష నేత పిలుపునీయడం చాలా మంచి పరిణామమే.

జానారెడ్డి ఆ కార్యక్రమాన్ని మెచ్చుకొని దానికి ప్రజలందరూ సహకరించాలని పిలుపునిస్తే, తెలంగాణా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క హరితహారం పేరుతో చాలా పెద్ద కుంభకోణం జరుగుతోందని తెరాస ప్రభుత్వాన్ని విమర్శించడం విశేషం. నల్గొండలో నిన్న మీడియాతో మాట్లాడుతూ, “ఒక మొక్క నాటేందుకు సుమారు రూ.1,000 ఖర్చు అవుతున్నట్లు తెలిసింది. ఆ లెక్కన రాష్ట్ర వ్యాప్తంగా కోట్ల మొక్కలు నాటితే ఎంత ఖర్చవుతుందో ఎవరూ ఊహించలేము. హరితహారం పేరిట తెరాస ప్రభుత్వం మరో బారీ కుంభకోణానికి బీజం వేసినట్లు అనుమానం కలుగుతోంది,” అని అన్నారు.

ఈవిధంగా ఒకే పార్టీకి చెందిన ఇద్దరు నేతలు హరితహారం కార్యక్రమంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం చూస్తే, తెలంగాణా కాంగ్రెస్ పార్టీలో నేతల మద్య సరైన సమన్వయం, అవగాహన లేదని చాటుకొన్నట్లు అయ్యింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close