గుడ్ న్యూస్‌: థియేట‌ర్ల‌కు గ్రీన్ సిగ్న‌ల్

థియేట‌ర్లు తెర‌చుకోవ‌డానికి అనుమ‌తులు ఇస్తూ.. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఈరోజు ఓ జీవోని విడుద‌ల చేసింది. అయితే కొన్ని ష‌ర‌తులు విధించింది. సిట్టింగ్ సామ‌ర్థ్యాన్ని 50 శాతానికి ప‌రిమితం చేసింది. ప్ర‌తి ప్రేక్ష‌కుడూ.. క‌చ్చితంగా మాస్క్ ధ‌రించే థియేట‌ర్లోకి అడుగుపెట్టాల‌ని, థియేట‌ర్ ఆవ‌ర‌ణ‌లో శానిటైజ‌ర్లు ఉంచాల‌ని స్ప‌ష్టం చేసింది. ప్రేక్ష‌కులు భౌతిక దూరం పాటించేలా థియేట‌ర్ యాజ‌మాన్యం జాగ్ర‌త్త వ‌హించాల‌ని, థియేట‌ర్ ఆవ‌ర‌ణ‌లో గుంపులు గుంపులుగా తిర‌గ‌డం నిషేధించామ‌ని జీవోలో స్ప‌ష్టం చేశారు. ప్రతి షో ముందు కామన్ ఏరియాలో సానిటీజేషన్ చేయాలని, ఉష్ణోగ్ర‌త‌ల‌ను 24 నుంచి 30 డిగ్రీ సెల్సీయస్ మధ్య ఉంచాలని, హ్యూమిడిటిని 40 నుంచి 70 శాతం మధ్య ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించింది.

థియేట‌ర్లు తెర‌చుకోవ‌డం శుభ‌వార్తే అయినా… 50 శాతం సిట్టింగ్ కి నిర్మాత‌లు మొగ్గు చూపిస్తారా, లేదా? అన్న‌ది ప్ర‌ధాన స‌మ‌స్య‌గా మారింది. విమానాల్లో, బ‌స్సుల్లో, రైల్వేల‌లో… 50 శాతం సిట్టింగ్ అన్న ష‌ర‌తులు లేవు. అలాంటిది థియేట‌ర్ల‌కు మాత్రం ఎందుక‌న్న‌ది నిర్మాత‌ల ప్ర‌శ్న‌. పెద్ద సినిమాలు విడుద‌ల‌కు రెడీగా లేక‌పోయినా.. చిన్న సినిమాలు మాత్రం విడుద‌ల‌కు మొగ్గు చూపే అవ‌కాశం ఉంది. ఏదేమైనా – థియేట‌ర్లు తెర‌చుకోవ‌డం చిత్ర‌సీమ‌కు ఓర‌కంగా భారీ ఊర‌ట అని చెప్పాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close