కరోనాపై హైకోర్టు ఫైర్‌ను పట్టించుకోని తెలంగాణ సర్కార్..!

తెలంగాణలో కరోనా పరీక్షల నిర్వహణ రోజు రోజుకు గందరగోళంగా మారుతోంది. హైకోర్టు ప్రభుత్వం తీరుపై విచారణ జరినప్పుడల్లా తీవ్రంగా మండిపడుతోంది. బుధవారం విచారణలో.. కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినా ప్రభుత్వం .. పెద్దగా సీరియస్‌గా తీసుకున్నట్లుగా లేదు. ఆ తీర్పు వచ్చిన ఒక్క రోజులో.. ప్రైవేటు ల్యాబుల్లో పరీక్షలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. కొద్ది రోజుల క్రితం… ప్రైవేటు ల్యాబుల్లో వైద్య ఆరోగ్య శాఖ జరిపిన పరీక్షల్లో లోపాలు బయటపడ్డాయని.. వాటన్నింటినీ నాలుగు రోజుల్లో సరి చేసుకోవాలని.. సరి చేసుకున్న తర్వాతే టెస్టులు చేయాలని సూచించినట్లుగా తెలుస్తోంది. దీంతో.. ప్రైవేటు ల్యాబుల్లో కరోనా టెస్టులు నిలిచిపోయాయి.

అయితే.. ప్రభుత్వం మాత్రం ఉచిత కరోనా టెస్టులను కొనసాగిస్తోంది. జంట నగరాల్లో మొత్తం 11 ఆస్పత్రుల్లో కోవిడ్ టెస్టింగ్ సెంటర్లు ఉన్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. అక్కడ ఉన్న టెస్టింగ్ సామర్థ్యం… ప్రస్తుతం బయట పడుతున్న కేసులతో పోలిస్తే చాలా తక్కువ. ఇప్పటికే తెలంగాణ సర్కార్.. ప్రభుత్వ.. ప్రైవేటు ల్యాబుల్లో నాలుగు రోజుల పాటు టెస్టుల్ని నిలిపివేసింది. గతంలో సేకరించిన శాంపిళ్లను మాత్రమే పరిశీలిస్తోంది. కొద్ది శాంపిళ్లతోనే పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడు ప్రైవేటు ల్యాబ్స్‌లోనూ నిలిపివేశారు. దీంతో కరోనా టెస్టులు మరింతగా తగ్గనున్నాయి.

కరోనా టెస్టింగ్ సామర్థ్యం పెంచుకోవడంలో తెలంగాణ సర్కార్ పూర్తి స్థాయి నిర్లక్ష్యం ధోరణిని ప్రదర్శించిందనే విమర్శలు మొదటి నుంచి వస్తున్నాయి. హైకోర్టు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నా.. లైట్ తీసుకుంది. ఆర్టీ పీసీఆర్, ట్రూ నాట్ టెస్టుల సామర్థ్యం పెంపు కోసం పెద్దగా దృష్టి పెట్టలేదు. పొరుగు రాష్ట్రాలు.. పెద్ద ఎత్తున టెస్టింగ్ చేసి… వైరస్‌ను కనిపెట్టి.. నియంత్రించడానికి ప్రయత్నిస్తూంటే.. తెలంగాణ సర్కార్ మాత్రం లైట్ తీసుకుంది. ఆ ప్రభావం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close