తాప్సి మళ్ళీ అలిగింది.. ఈ సారి హీరోలపై

తాప్సి తీరు వేరు. ఏ ఎండ‌కా గొడుగు అన్న‌ట్టు ఉండ‌దు. మ‌న‌సుకు ఏది అనిపిస్తే అది మాట్లాడేస్తుంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వెళ్లాక‌… టాలీవుడ్ తీరు ఎండ‌గ‌ట్టేసింది. అస‌లు త‌న‌ని ఇక్క‌డెవ‌రూ స‌రిగా వాడుకోలేద‌ని, త‌న ప్ర‌తిభ ఏమాత్రం గుర్తించ‌లేద‌ని వాపోయింది. అంతేనా… ఆ మ‌ధ్య ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావుపై సెటైర్లు పేల్చి వెటకారం చేసింది. ఇప్పుడు బాలీవుడ్ హీరోల్ని టార్గెట్ చేసింది. ”త‌నకు హీరోల‌తో పాటు స‌మాన‌మైన ఇమేజ్ ఉన్నా – బాలీవుడ్‌లో పెద్ద హీరోలెవ్వ‌రూ త‌న‌ని ప‌ట్టించుకోవ‌డం లేదు” అంటూ… గోల పెడుతోంది.

తాప్సి న‌టించిన బేబీ సూప‌ర్ హిట్ అయ్యింది. పింక్ అయితే… టాక్ ఆఫ్ ద ఇండ్ర‌స్ట్రీగా మారింది. ఈ రెండు సినిమాలు చూసి మురిసిపోతోంది తాప్సి. పింక్‌కి ముందూ.. ఆ త‌ర‌వాత బాలీవుడ్ లో చేసిన ప్ర‌య‌త్నాలేం ఫ‌లించ‌లేదు. జుడ్వా 2 కూడా అట్ట‌ర్ ఫ్లాప్‌గా మిగిలిపోయింది. తాప్సికి మ‌రో హిట్ వ‌స్తే గానీ బాలీవుడ్‌లో భ‌విష్య‌త్తు లేదు. ఇలాంట‌ప్పుడే కాస్త ఒద్దిక‌గా ఉండి సినిమాలు వ‌చ్చేలా చూసుకోవాలి. కానీ.. తాప్సి మాత్రం రివ‌ర్స్ గేర్‌లో వెళ్తోంది. బాలీవుడ్‌లో హీరో వ‌ర్షిప్‌ని స‌వాల్ చేస్తూ కామెంట్లు విసురుతోంది. ఇలాంటి వ్యాఖ్య‌లు తాప్సి కెరీర్‌కు అంత మంచి చేయ‌వు. పైపెచ్చు అహంకారి అనే ముద్ర వేస్తాయి. అయినా తాప్సి భ‌య‌ప‌డ‌డం లేదు. సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌తో ఎప్పుడూ ట‌చ్‌లోఉండ‌డం అనే సూత్రాన్ని మాత్రం తాప్సి బాగానే ఒంట‌ప‌ట్టించుకొన్న‌ట్టు క‌నిపిస్తోంది. చూద్దాం.. ఇలాగైనా కాస్త పాపులారిటీ సంపాదించుకొని, రెండు సినిమాలు వెన‌కేసుకొంటుందేమో..??

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com