త‌మ‌న్నాని మోసం చేసిన ద‌ర్శ‌కులెవ‌రు?

త‌మ‌న్నా గురించి ఎవ‌రు మాట్లాడినా… ‘ప‌క్కా.. ప్రొఫెష‌న‌ల్ క‌థానాయిక‌’ అంటుంటారు. న‌ట‌న‌, ఆమె టైమింగ్స్, సెట్స్‌లో చూపించే సిన్సియారిటీ, సినిమాపై ఆమెకుండే ప్రేమ‌… ఇవ‌న్నీ త‌మ‌న్నాని ప్రొఫెష‌న‌ల్ హీరోయిన్‌గా మార్చేశాయి. మీడియా ముందు కూడా త‌మ‌న్నా ఆచి తూచి మాట్లాడుతుంది. అయితే.. ఈమ‌ధ్య త‌మన్నా కాస్త కంట్రోల్ త‌ప్పేస్తోంది. ఏది అనుకొంటే.. అదే మాట్లాడుతుంది. ఎవ‌రేమైనా అనుకొంటారేమో.. అన్న ఆలోచ‌న కూడా లేదు. బ‌హుశా… ప‌దేళ్ల సీనియారిటీ వ‌చ్చేసింది క‌దా. పెద్ద‌దాన్న‌యిపోయా అనుకొంటుందేమో.

నేటిత‌రం ద‌ర్శ‌కుల‌పై త‌మ‌న్నా ఓ సెటైర్‌లాంటిది వేసింది. ”కొంత‌మంది ద‌ర్శ‌కులు ఒక‌టి చెప్పి, మ‌రోటి తీస్తున్నారు. అలాంటి ద‌ర్శ‌కులు నాక్కూడా త‌గిలారు. వాళ్ల‌తో నేను చాలా ఇబ్బంది ప‌డ్డాను. మొహ‌మాటానికి ఒప్పుకొన్న సినిమాలేం లేవుగానీ.. ఇలా మోస‌పోయిన సినిమాలైతే ఉన్నాయి..స‌స‌ అంటూ వాపోతోంది త‌మ‌న్నా. త‌న‌కు మంచి క్యారెక్ట‌ర్లు ప‌డ్డా… అది సీన్ పేప‌ర్ వ‌రకే ప‌రిమిత‌మైంద‌ని, తెర‌పై చూసుకొనేస‌రికి త‌న పాత్ర మ‌రోలా త‌యారైంద‌”ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తోంది త‌మన్నా. మ‌రింత‌కీ ఆ ద‌ర్శ‌కులెవ‌రో, త‌మన్నాని మోసం చేసిందెవ‌రో మాత్రం చెప్ప‌లేదు. మీకేమైనా తెలుసా??

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close