ఆచార్య‌లో హీరోయిన్లు ఎంత‌మంది?

చిరంజీవి – కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రం ‘ఆచార్య‌’. ఇప్ప‌టికే ఈ సినిమాలో ఇద్ద‌రు హీరోయిన్లు ఉన్నారు. చిరుతో కాజ‌ల్ జోడీ క‌డుతుంటే, ఓ గీతంలో రెజీనా క‌నిపించ‌బోతోంది. ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ ఓ కీల‌క‌మైన పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. చ‌ర‌ణ్ ప‌క్క‌న నాయిక‌గా చాలామంది పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. ఆ పేరు కూడా ఖాయ‌మైపోతే.. మూడో హీరోయిన్ కూడా చేరిపోయిన‌ట్టే.

అయితే ఇక్క‌డితో చిరు – కొర‌టాల ఆగ‌డం లేదు. మ‌రో క‌థానాయిక‌నీ చూపించ‌బోతున్నార్ట‌. ఈ చిత్రంలో ఓ కీల‌క‌మైన స‌న్నివేశంలో ప్ర‌ముఖ క‌థానాయిక అతిథి పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ద‌ని స‌మాచారం. ఆ పాత్ర కోసం త‌మ‌న్నాని ఎంచుకున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. త‌మ‌న్నా కాసేపే ఉన్నా – ఆ స‌న్నివేశం క‌థ‌కు చాలా కీల‌కంగా మార‌బోతోంద‌ని టాక్‌. వీలైతే త‌మ‌న్నాకి ఓ గీతంలోనూ చూపించే అవ‌కాశాలున్నాయ‌ట‌. అయితే ఇదంతా చ‌ర్చ‌ల్లో ఉంది. ఆ స‌న్నివేశంలో ఎవ‌రిని చూపించాలి? ఆ స‌న్నివేశం నిడివి ఎంత‌? అనేది ఇంకా చ‌ర్చ‌ల ద‌శ‌లోనే ఉంది. త‌మ‌న్నా మెగా కుటుంబానికి అచ్చొచ్చిన నాయిక‌. చిరు, ప‌వ‌న్‌, అల్లు అర్జున్‌, చ‌ర‌ణ్‌… వీళ్లంద‌రితోనూ న‌టించేసింది. `ఆచార్య‌`లోనూ ఫైన‌ల్ అయితే – ఈ ప్రాజెక్టు మ‌రింత గ్లామ‌రెస్‌గా త‌యార‌వుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క‌రోనాని జ‌యించిన జ‌క్క‌న్న కుటుంబం

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్.రాజ‌మౌళి, అత‌ని కుటుంబ స‌భ్యుల‌కు క‌రోనా సోకిన విష‌యం తెలిసిందే. రెండు వారాల నుంచి రాజ‌మౌళి, కుటుంబ స‌భ్యులు హోం క్వారెంటైన్‌లోనే ఉంటున్నారు. డాక్ట‌ర్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఈరోజు...

ప్చ్…ఇళ్ల పట్టాల పంపిణీ మళ్లీ వాయిదా..!

ఆగస్టు పదిహేనో తేదీన 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలిస్తామన్న ఏపీ సర్కార్ మళ్లీ వాయిదా బాట పట్టింది. కోర్టుల్లో కేసులున్నాయంటూ... మరోసారి ముహుర్తం మార్చింది. ఈ సారి గాంధీ జయంతికి...

అనధికార కేబినెట్ భేటీని నిర్వహించేసిన కేటీఆర్..!

తెలంగాణ సర్కార్‌లో నెంబర్ టూగా ఉంటూ.. సీఎం రేంజ్ పవర్స్ తో పాటు విధులు కూడా నిర్వహిస్తున్న అనధికారికంగా కేబినెట్ భేటీ కూడా నిర్వహించేశారు. ప్రాక్టీస్ కోసం అన్నట్లుగా జరిగిన ఈ కేబినెట్...
video

స‌డ‌క్ 2 పై.. సుశాంత్ అభిమానుల సెగ‌

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ‌హ‌త్య వెనుక‌.. ప్ర‌త్య‌క్షంగానూ ప‌రోక్షంగానూ మ‌హేష్ భ‌ట్ ప్ర‌మేయం ఉంద‌ని సుశాంత్ అభిమానులు న‌మ్ముతున్నారు. చాలా రోజులుగా సుశాంత్ వ‌ర్గం మ‌హేష్ భ‌ట్ ని టార్గెట్ చేస్తోంది....

HOT NEWS

[X] Close
[X] Close