మళ్లీ కాజ‌ల్ ద‌గ్గ‌రే ఆగిన తేజ‌

తేజ – కాజ‌ల్ ది హిట్ కాంబినేష‌న్‌. ల‌క్ష్మీ క‌ల్యాణంతో కాజ‌ల్ కి లైఫ్ ఇచ్చాడు తేజ‌. నేనే రాజు నేనే మంత్రితో తేజ‌కి హిట్ ఇచ్చింది కాజ‌ల్‌. ఆ త‌ర‌వాత `సీత‌`లోనూ… కాజ‌లే క‌థానాయిక‌. అలా.. ఈ కాంబో లో హ్యాట్రిక్ సినిమాలొచ్చాయి. తాజాగా `అలివేలు వెంక‌ట‌ర‌మ‌ణ‌`. వెంక‌ట‌ర‌మ‌ణ‌గా గోపీచంద్ ఫిక్స‌య్యాడు. అలివేలు కావాలి. ఆ పాత్ర‌కు కాజ‌ల్ మొద‌టి ఛాయిస్‌. అయితే కాజ‌ల్ తో ప‌నిచేసీ ప‌నిచేసీ తేజ‌కు బోర్ కొట్టిన‌ట్టుంది. కొన్ని ఆప్ష‌న్లు చూశాడు. కీర్తి సురేష్‌, అనుష్క‌, ర‌కుల్ ప్రీత్ సింగ్‌.. ఇలా చాలా ప్ర‌త్యామ్నాయాలు అట్టి పెట్టుకున్నాడు. ఈ ముగ్గురిలో ఒక‌రు ఖాయం అనుకుంటున్న ద‌శ‌లో… తేజ మ‌ళ్లీ కాజ‌ల్ కే ఓటేసిన‌ట్టు తెలుస్తోంది. కీర్తి చేతిలో చాలా ప్రాజెక్టులున్నాయి. ఇప్పుడు త‌ను బాగా బిజీ. అనుష్క సినిమాలు చేయ‌డానికి అంతగా స‌ముఖ‌త వ్య‌క్తం చేయ‌డం లేదు. ఇక గోపీచంద్ – ర‌కుల్‌ల కాంబినేష‌న్ పాత‌దే. ఇది వ‌ర‌కే జ‌నాలు ఈ కాంబో చూశారు. దాంతో పోలిస్తే గోపీచంద్ -కాజ‌ల్ కాంబినేష‌న్ కాస్త ఫ్రెష్ గా ఉంటుంది. అందుకే… చివ‌రికి మ‌ళ్లీ కాజ‌ల్ నే ఎంచుకున్న‌ట్టు స‌మాచారం. ఆగ‌స్టులో ఈ చిత్రం లాంఛ‌నంగా ప్రారంభం అవుతుంది. ప‌రిస్థితులు అనుకూలిస్తే – రెగ్యులర్ షూటింగ్ కూడా మొద‌లెట్టాల‌ని భావిస్తున్నాడు తేజ‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్చ్…ఇళ్ల పట్టాల పంపిణీ మళ్లీ వాయిదా..!

ఆగస్టు పదిహేనో తేదీన 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలిస్తామన్న ఏపీ సర్కార్ మళ్లీ వాయిదా బాట పట్టింది. కోర్టుల్లో కేసులున్నాయంటూ... మరోసారి ముహుర్తం మార్చింది. ఈ సారి గాంధీ జయంతికి...

అనధికార కేబినెట్ భేటీని నిర్వహించేసిన కేటీఆర్..!

తెలంగాణ సర్కార్‌లో నెంబర్ టూగా ఉంటూ.. సీఎం రేంజ్ పవర్స్ తో పాటు విధులు కూడా నిర్వహిస్తున్న అనధికారికంగా కేబినెట్ భేటీ కూడా నిర్వహించేశారు. ప్రాక్టీస్ కోసం అన్నట్లుగా జరిగిన ఈ కేబినెట్...
video

స‌డ‌క్ 2 పై.. సుశాంత్ అభిమానుల సెగ‌

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ‌హ‌త్య వెనుక‌.. ప్ర‌త్య‌క్షంగానూ ప‌రోక్షంగానూ మ‌హేష్ భ‌ట్ ప్ర‌మేయం ఉంద‌ని సుశాంత్ అభిమానులు న‌మ్ముతున్నారు. చాలా రోజులుగా సుశాంత్ వ‌ర్గం మ‌హేష్ భ‌ట్ ని టార్గెట్ చేస్తోంది....

“చేయూత” డబ్బులతో వ్యాపారం నేర్పిస్తున్న జగన్..!

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళా సాధికారత కోసం.. మరో వినూత్నమైన ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ఆర్ చేయూత పథకాన్ని తాడేపల్లిలోని ఇంటి నుంచి ప్రారంభించారు. ఏడాదికి రూ. 18,750 ఇచ్చే ఈపథకం...

HOT NEWS

[X] Close
[X] Close