టాలీవుడ్ పై ప‌రాయి ద‌ర్శ‌కుల హ‌వా!

తెలుగులో ఇది వ‌ర‌కు హీరోయిన్ల కొర‌త మాత్ర‌మే ఉండేది. ఇప్పుడు అలా కాదు. హీరోలు సైతం దొర‌క‌డం లేదు. పెద్ద ద‌ర్శ‌కులు, హిట్లు కొట్టిన వాళ్లు… హీరోలు లేక స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. ఈలోగా… ప‌రాయి ద‌ర్శ‌కులు తెలుగు గ‌డ్డ‌పై అడుగుపెట్టి, త‌మ హవా చూపించ‌డం మొద‌లెడుతున్నారు. ఈమ‌ధ్య మ‌న హీరోల‌కు పొరుగింటి ద‌ర్శ‌కుల‌పై గురి కుదురుతోంది. వాళ్ల‌తో సినిమాలు చేయ‌డానికి ఉత్సాహం చూపిస్తున్నారు.

కేజీఎఫ్ తో ఆక‌ట్టుకున్న ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్‌. ఇప్పుడు ఈ ద‌ర్శ‌కుడు టాలీవుడ్ కి మోస్ట్ వాంటెడ్ అయిపోయాడు. ప్ర‌భాస్ తో `స‌లార్‌` ని ప‌ట్టాలెక్కిస్తున్న ప్ర‌శాంత్…. రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌ల‌ను లైన్ లో పెట్టాడు. ఆ త‌ర‌వాత అల్లు అర్జున్ క్యూలో ఉన్నాడు. ఈ మూడు ప్రాజెక్టులు పూర్త‌య్యేస‌రికి మ‌రో నాలుగేళ్ల‌యినా ప‌డుతుంది. అంటే… నాలుగేళ్ల పాటు, ప్ర‌శాంత్ నీల్ కేరాఫ్ అడ్ర‌స్స్ టాలీవుడ్ అన్న‌మాట‌.

ఖైదీతో త‌న‌దైన ముద్ర వేసిన ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్‌. ఆ సినిమా చూసి టాలీవుడ్ హీరోలు లోకేష్‌కి ఫ్యాన్స్ అయిపోయారు. ఫోన్లు చేసి క‌థ‌లు వినిపించ‌మ‌న్నారు. ఇద్ద‌రు ముగ్గురు స్టార్ హీరోలు లోకేష్ కి ట‌చ్‌లోనే ఉన్నారు. లోకేష్ త‌దుప‌రి సినిమా.. టాలీవుడ్ హీరోతోనే. అదెవ‌ర‌న్న‌ది ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్‌. లోకేష్ క‌నుక స‌రైన క‌థ‌ల‌తో వ‌స్తే.. బ‌డా హీరోలు డేట్లు ఇవ్వ‌డానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు బంతి.. లోకేష్ కోర్టులోనే వుంది.

పందెంకోడి సినిమాతో ర‌చ్చ చేశాడు లింగుస్వామి. ఆ స‌మ‌యంలోనే టాలీవుడ్ నుంచి త‌న‌కు ఆఫ‌ర్లు వెళ్లాయి. కానీ ప్రాజెక్టేం సెట్ కాలేదు. లింగు స్వామి ఇప్పుడు ఫ్లాపుల్లో ఉన్నాడు. కానీ మ‌న హీరోల న‌మ్మ‌కం స‌డ‌ల్లేదు. రామ్ తో ఓ సినిమా ఓకే చేయించుకున్నాడు. ఇక కెరీర్‌లో ఇప్ప‌టి వ‌ర‌కూ తెలుగులో ఒక్క స్ట్రయిట్ సినిమా కూడా చేయ‌లేదు శంక‌ర్‌. అలాంటిది రామ్ చ‌ర‌ణ్‌తో సినిమా ఓకే అయ్యింది. ఇది కూడా దాదాపు 200 కోట్ల బ‌డ్జెట్ డిమాండ్ చేసే క‌థే. మురుగ‌దాస్ ఓ క‌థ ప‌ట్టుకుని టాలీవుడ్ అంతా తిరుగుతున్నాడు. బ‌న్నీతో ఓకే అవ్వాల్సిన సినిమా అది. ఇప్పుడు రామ్ చేతుల్లోకి వెళ్లింద‌ని తెలుస్తోంది. మొత్త‌మ్మీద ఎలా చూసినా, త‌మిళ ద‌ర్శ‌కుల హ‌వా టాలీవుడ్ లో బాగానే క‌నిపిస్తోంది. తెలుగు, త‌మిళం ఇలా రెండు మార్కెట్ల‌నీ క‌వ‌ర్ చేద్దామ‌నుకుంటున్న టాలీవుడ్ హీరోల‌కు.. త‌మిళ ద‌ర్శ‌కుల్ని ఎంచుకోవ‌డం మంచి ఆప్ష‌న్ కూడా. మ‌రి.. ఈ జోరు ఎంత‌కాల‌మో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మళ్లీ తెలంగాణలో డ్రగ్స్ కేసుల కలకలం !

హైదరాబాద్, సైబరాబాద్‌కు ఇప్పుడు ఉన్న కమిషనర్ల నేరస్తును ఓ ఆట ఆడిస్తున్నారు. సైబరాబాద్ కమిషనర్ సైబర్ ఫ్రాడ్‌ల మీద దృష్టి పెడితే.. హైదరాబాద్ కమిషన్ సీవీ ఆనంద్ డ్రగ్స్ కేసుల్ని వెలికి తీస్తున్నారు....

ఎన్నికల జిమ్మిక్ అనుకున్నా సరే.. ప్రధాని స్టైల్ అదే !

ప్రధానమంత్రి నరేంద్రమోడీ రిపబ్లిక్ డే వేడుకల్లో భిన్నంగా కనిపించారు. భగత్ సింగ్ తరహా టోపీ..  ఓ విభిన్నమైన కండువాతో వేడుకల్లో పాల్గొన్నారు. టోపీపై బ్రహ్మకమలం ముద్ర ఉంది. కాసేపటికే నెటిజన్లు అవి ఎక్కడివో...

అదే నరసింహన్ గవర్నర్ అయితే ఇలా జరిగేదా !?

రిపబ్లిక్ డే రోజున కేసీఆర్ రాజ్యాంగాన్ని అవమానించారని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఫైరయ్యారు. కారణం ఏమిటంటే రాజ్‌భవన్‌లో జరిగే రిపబ్లిక్ డే వేడుక.. జెండా పండుగకు కేసీఆర్ వెళ్లలేదు. కనీసం సీనియర్...

“కొత్త జిల్లాల పని” చేస్తామంటున్న ఉద్యోగ సంఘాలు !

ఉద్యోగులంతా ఉద్యమంలో ఉన్న సమయంలో ప్రజల దృష్టి మరల్చేందుకే కొత్త జిల్లాలంటూ ప్రభుత్వం ప్రకటనలు చేసిందని ఆరోపణలు వస్తున్న సమయంలో ఉద్యోగ సంఘాలు భిన్నంగా స్పందించాయి. ఐఏఎస్‌లు మినహా ఉద్యోగలంతా సమ్మెలోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close