త‌మిళ ‘వాస‌న‌’తో హీరో ఉక్కిరి బిక్కిరి

తెలుగులో త‌మిళ ద‌ర్శ‌కుల హ‌వా ఇప్పుడు మ‌ళ్లీ మొద‌లైంది. వాళ్ల‌తో సినిమాలు చేయ‌డానికి మ‌న హీరోలు ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే త‌మిళ తంబీల‌తో వ్య‌వ‌హారం అంత ఈజీ కాద‌న్న‌ది ఆయా హీరోల‌కు ఇప్పుడిప్పుడే అర్థం అవుతోంది. ఓ యువ హీరో – ఓ త‌మిళ ద‌ర్శ‌కుడితో సినిమా ఇటీవ‌లే మొద‌లైంది. ద‌ర్శ‌కుడు చెప్పిన క‌థ‌కు ఫ్లాటైపోయిన ఆ హీరో – వెంట‌నే డేట్లు ఇచ్చేశాడు.

అయితే ఇప్పుడు ఆ హీరోకి సెట్లో చుక్క‌లు క‌నిపిస్తున్నాయ‌ట. త‌మిళ ద‌ర్శ‌కుడి సినిమా క‌దా. సెట్లో అంతా త‌మిళ వాస‌నే. త‌మిళ అసిస్టెంట్లు, త‌మిళ ఫైట‌ర్లు.. ఇలా ఎక్క‌డ చూసినా అదే తంతు. పైగా.. తెలుగు సినిమాని త‌మిళ స్టైల్లో తీస్తున్నాడ‌ట. త‌మిళ ఆడియన్స్ సెన్సిబులిటీస్‌వేరు గా ఉంటాయి. తెలుగులో వేరు. కొన్ని త‌మిళ సినిమాలు తెలుగులో ఆడ‌క‌పోవ‌డానికి కార‌ణం అదే. అయితే ఈ ద‌ర్శ‌కుడు మాత్రం ఈసినిమాని పూర్తిగా త‌మిళ స్టైల్ లో తీసుకుంటూ వెళ్తుండే స‌రికి… తాను చేస్తోంది తెలుగు సినిమానా? త‌మిళ సినిమానా? అనే డౌటు ఆ హీరోకే వేస్తోంద‌ట‌. ఈ విష‌యం ద‌ర్శ‌కుడికి ఎన్నిసార్లు చెప్పినా చెవికెక్కించుకోవ‌డం లేద‌ట‌. `మ‌న స్టైలే ఇది క‌దా` అంటూ న‌వ్వేస్తూ హీరో మాట‌ల్ని లైట్ తీసుకుంటున్నాడ‌ట‌. దాంతో ఈ సినిమా రిజ‌ల్ట్ పై హీరోకి ఆల్రెడీ బెంగ మొద‌లైపోయింద‌ని ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బిగ్ బ్రేకింగ్ – షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం

షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నందిగామ శివార్ సమీపంలోని అలెన్ హోమియో , హెర్బల్ కంపెనీలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి....

సూప‌ర్ స్టార్ బ‌ర్త్‌డేని టార్గెట్ చేసిన సుధీర్ బాబు

మే 31... సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు - రాజ‌మౌళి కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమైనా వ‌స్తుందా? అని మ‌హేష్...

జేడీ లక్ష్మినారాయణకు ప్రాణహాని – ఎవరి పని ?

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ కు ఫిర్యాదు చేశారు. ఇంత కాలం నిర్భయంగా తిరిగిన ఆయనకు హఠాత్తుగా ప్రాణభయం ఏర్పడటానికి...

వైసీపీలో చేరి అన్నీ పోగొట్టుకుని బయటకు వచ్చిన డొక్కా !

ఆయన ప్రముఖ దళిత నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత...

HOT NEWS

css.php
[X] Close
[X] Close