చిన్నారి హత్యాచార నిందితుడి “ఆత్మహత్య” శిక్ష!

రాజకీయ వివాదంగా మారిన సింగరేణి కాలనీలో చిన్నారిపై హత్యాచారం ఘటనలో నిందితుడు చివరికి “ఆత్మహత్య” శిక్షకు గురయ్యాడు. రాజు అనే ఆ నిందితుడి మృతదేహాన్ని రైలు పట్టాలపై గుర్తించారు. ఘట్ కేసర్ నుంచి వరంగల్ వెళ్లే రైల్వే ట్రాక్ పై అతని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మొహం గుర్తుపట్టలేనంతగా ఛిద్రమైన స్థితిలో ఉండగా పోలీసులు గుర్తించారు. చేతిపై మౌనిక అనే పేరును పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. చేతిలో ఆ పేరు స్పష్టంగా కనిపిస్తూండటంతో కుటుంబసభ్యుల్ని పిలిపించారు. వారు రాజును గుర్తించడంతో అధికారికంగా నిందితుడు రాజు చనిపోయినట్లుగా తేల్చారు.

తెలంగాణ డీజీపీ మహేంద్ర రెడ్డి ఈ విషయాన్ని ట్విట్టర్ ఖాతా ద్వారా ధ్రువీకరించారు. సైదాబాద్ లో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన మానవ మృగం రాజు ఆత్మహత్య చేసుకున్నట్లు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. డీజీపీ మహేంద్రరెడ్డి ఈ విషయాన్ని నిర్థారణ చేశారని ఆయన తెలిపారు. తొమ్మిదో తేదీన సైదాబాద్‌లోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల పాపను ఎత్తుకెళ్లిన నిందితుడు రాజు అత్యాచారానికి పాల్పడి హత్య చేసి మృతదేహాన్ని ఇంట్లోనే వదిలి పెట్టి పరారయ్యాడు.

ఈ ఘటనను మొదట రెండు రోజులు ఎవరూ పట్టించుకోలేదు కానీ సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రభుత్వంపై విరుచుకుపడటంతో ఒక్క సారిగా కదలిక వచ్చింది. పెద్ద ఎత్తున రాజకీయనేతలు పరామర్శలకు వెళ్లారు. నిందితుడ్ని ఎన్ కౌంటర్ చేయాలన్న డిమాండ్లు వినిపించాయి. అయితే అనూహ్యంగా అతనే ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించడంతో నిందితుడికి శిక్ష పడినట్లయింది. అయితే నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న ప్రచారం రెండు,మూడురోజుల నుంచి సాగుతోంది. దానిని పోలీసులు ధృవీకరించలేదు. అయితే పట్టుకోలేదని … ఆత్మహత్య చేసుకున్నాడని ఇవాళ తేలింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భయమే బంగారమాయెనా…

హారర్ సినిమా అనగానే ఆడియన్స్ లిమిట్ అయిపోతారు. స్టార్ హీరోలు ఈ కథలని వినడానికి పెద్ద ఆసక్తి చూపించారు. కానీ చాలా మంది ఫిల్మ్ మేకర్స్ కి హారర్ సినిమాలంటే క్రేజ్. నిజానికి...

భయమా..? అభద్రతాభావమా..?

కొద్ది రోజుల కిందట వరకు దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూల పరిస్థితి ఉన్నప్పటికీ ఎన్నికలకు సమయం సమీపించే కొద్దీ ఆ పార్టీ గ్రాఫ్ వేగంగా పతనం అవుతూ వస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్...

ఖ‌మ్మం పంచాయితీ మ‌ళ్లీ షురూ… ఈసారి కాంగ్రెస్ లో!

ఖ‌మ్మం జిల్లా రాజ‌కీయాలు అంటేనే ఎప్పుడూ ఏదో ఒక పంచాయితీ న‌డుస్తూనే ఉంటుంది. అధికార పార్టీలో నాయ‌కుల మ‌ధ్య స‌యోధ్య చాలా క‌ష్టం. మొన్న‌టి వ‌ర‌కు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న స‌మ‌యంలో తుమ్మ‌ల‌,...

దాస‌రికి ఇదే ఘ‌న‌మైన నివాళి!

మే 4... ద‌ర్శ‌క ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌న్మ‌దినం. దాస‌రి పుట్టిన రోజుని ద‌ర్శ‌కుల దినోత్స‌వంగా జ‌రుపుకొంటుంది టాలీవుడ్. ద‌ర్శ‌కుల‌కు కూడా స్టార్ స్టేట‌స్ క‌ల్పించిన దాస‌రికి ఇది స‌రైన నివాళే. అయితే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close