ఏపీలో ఇళ్ల రుణాల వన్‌టైం సెటిల్మెంట్ పథకం !

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏపీలో ప్రజలను ఇళ్ల రుణాల నుంచి విముక్తుల్ని చేయాలని నిర్ణయించారు. హౌసింగ్ లోన్ల భారంతో కట్టలేకపోయిన 46 లక్షల మందిని గుర్తించారు. వారందరికీ వన్ టైం సెటిల్మెంట్ పథకం అమలు చేయాలని కేబినెట్‌లో నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.20 వేలు మున్సిపాలిటీల్లో రూ.30 వేల వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ కింద చెల్లించి పేదలు ఇళ్ల రుణాల నుంచి విముక్తి కావొచ్చు.

1983 నుంచి ఏపీలో హౌసింగ్ కార్పొరేషన్ పేరు మీద ఇళ్లు ఇస్తున్నారు. సగం సొమ్ము సబ్సిడీగా మిగతా సగం సొమ్ము లబ్దిదారులు రుణంగా ఇళ్లు ఇస్తారు. ఆ సగం సొమ్మును లబ్దిదారులు పది లేదా ఇరవై ఏళ్ల వాయిదాల్లో చెల్లించాలి. అయితే ఇళ్లను తీసుకుంటున్న లబ్దిదారులు ప్రభుత్వమే కదా అని చెల్లించడం లేదు. ప్రభుత్వాలు కూడా లైట్ తీసుకున్నాయి. అడగడం మానేశాయి. దాంతో ఆ లోన్లు అలాగే ఉండిపోయాయి. ఆ ఆస్తులపై యాజమాన్య హక్కులు లోన్ పూర్తి కాకపోవడం వల్ల వారిపైకి మారలేదు.

అందుకే సీఎం జగన్ వారికి వన్ టైం సెటిల్మెంట్ ప్రకటించి రుణవిముక్తుల్ని చేసి వారి ఆస్తులకు వారినే యజమానులను చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయం వల్ల 46,61,737 మంది లబ్ధి పొందుతారని మంత్రి పేర్ని నాని ప్రకటించారు. అయితే అసలు పేదలు కిస్తీలు కట్టడం మానేసిన ఏళ్ల తర్వాత వాటిని మాఫీ చేయాల్సింది పోయి వన్ టైం సెటిల్మెంట్ పేరుతో ఎప్పుడో తీసుకున్న రుణాలను ఈ ప్రభుత్వం వసూలు చేయడం ఏమిటని విపక్షాలు… పేదలు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...
video

‘మ‌న‌మే’ ఫ‌స్ట్ సింగిల్: సోలో లైఫే సోబెట‌రంటున్న శ‌ర్వా!

https://www.youtube.com/watch?v=XGJtiqVzZiA ఈమ‌ధ్య టాలీవుడ్ లో గ‌ట్టిగా వినిపిస్తున్న పేరు... హేష‌మ్‌ అబ్దుల్ వాహ‌బ్‌. 'ఖుషి', 'హాయ్ నాన్న‌' సినిమాల్లో సూప‌ర్ హిట్ పాట‌లు ఇచ్చారు. ఇప్పుడు శ‌ర్వానంద్ 'మ‌న‌మే' చిత్రానికీ ఆయ‌నే స్వ‌రాలు అందిస్తున్నారు....

ఇంకా “బలమైన” భ్రమల్లోనే కేటీఆర్ !

కేటీఆర్ నియోజకవర్గాల వారీ సమీక్ష సమావేశాల్లో రేవంత్ రెడ్డిని తిట్టి... ఎన్నికల్లో దున్నిపారేస్తామని ప్రసంగించి వెళ్లిపోతున్నారు. గ్రౌండ్ లెవల్లో పరిస్థితిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించడం లేదు. కనీసం ...
video

ట్రైల‌ర్ టాక్‌: ఫ్యామిలీమెన్ టూ మెంట‌ల్ మెన్‌

https://www.youtube.com/watch?v=xB7b3RzicUU విజ‌య్ దేవ‌ర‌కొండ అంటే ఎగ్రెసివ్‌నెస్ గుర్తొస్తుంది. అర్జున్ రెడ్డి నుంచి అది అల‌వాటైపోయింది. అయితే... త‌న‌లో కూల్ & కామ్ పెర్‌ఫార్మ‌ర్ ఉన్నాడు. దాన్ని బ‌య‌ట‌కు లాగే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు ప‌ర‌శురామ్. 'ఫ్యామిలీస్టార్‌'...

HOT NEWS

css.php
[X] Close
[X] Close