ల‌వ్ స్టోరీ కోసం చిరంజీవి

నాగార్జున‌తో చిరంజీవికి ఉన్న అనుబంధం ప్ర‌త్యేక‌మైన‌ది. ఈ విష‌యం చాలా సంద‌ర్భాల్లో రుజువైంది. నాగార్జున `వైల్డ్ డాగ్` స‌మ‌యంలో చిరు ప్ర‌త్యేక‌మైన అభిమానంతో ఆ సినిమాని ప్ర‌మోట్ చేశాడు. నాగ‌చైత‌న్య‌, అఖిల్ సినిమాల స‌మ‌యంలోనూ…అంతే. ఇప్పుడు చిరు `ల‌వ్ స్టోరీ`పైనా త‌న ప్రేమాభిమానాల్ని చూపిస్తున్నాడు. నాగ‌చైత‌న్య న‌టించిన ఈ చిత్రం ఈనెల 24న విడుద‌ల అవుతోంది. ఈ ఆదివారం హైద‌రాబాద్ లో ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ జ‌ర‌గ‌బోతోంది. దీనికి చిరంజీవి ముఖ్య అతిథి. సెకండ్ వేవ్ త‌ర‌వాత‌.. ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ల హడావుడి మ‌ళ్లీ మొద‌లైంది. అయితే.. పెద్ద స్టార్లెవ‌రూ ఫంక్ష‌న్ల‌కు రావ‌డం లేదు. `ల‌వ్ స్టోరీ`తో మ‌ళ్లీ ఆ హ‌వా మొద‌లైంద‌నుకోవాలి. సాయిప‌ల్ల‌వి క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రానికి శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌కుడు. పాట‌లు, ప్ర‌చార చిత్రాల‌కు మంచి స్పంద‌న వ‌స్తోంది. వెండి తెర‌పై ఓ స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌క‌థ వ‌చ్చి చాలా రోజులైంది. కాస్త క‌నెక్ట్ అయినా చాలు.. యువ‌త‌రం మ‌ళ్లీ థియేట‌ర్ల బాట ప‌ట్ట‌డానికి `ల‌వ్ స్టోరీ` దోహ‌దం చేస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close