తమిళనాడులోనూ గ్రామ సచివాలయాలు !

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న గ్రామ సచివాలయాల వ్యవస్థను తమ రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్‌కే స్టాలిన్ ప్రకటించారు. గ్రామ సచివాలయాల ఏర్పాటును విడతల వారిగా చేపట్టనున్నట్లు స్టాలిన్ ప్రకటించారు. వీటిలో 600 ఈ ఏడాదికి రానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర అసెంబ్లీలో సీఎం స్టాలిన్ వెల్లడించారు. గ్రామ సచివాలయాలను మన రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేస్తాం. ఇందులో సమావేశ మందిరంతో సహా అన్ని సౌకర్యాలు ఉంటాయని తెలిపారు. ఒక్కొక్కటి రూ. 40 లక్షల అంచనా వ్యయంతో నిర్మిస్తాంమన్నారు.

నవంబర్ 1వ తేదీని “స్థానిక పాలనా దినోత్సవం”గా జరుపుతాం. ఏడాదికి గ్రామసభలు నిర్వహించే సమావేశాలను 4 నుంచి 6కు పెంచుతాం, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు కొత్త వాహనాలు కొనుగోలు చేస్తాం. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే గ్రామ సచివాలయ వ్యవస్థ అమలులో ఉంది. దేశంలోనే మొదటిసారిగా గ్రామ సచివాలయాలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2019 ఎన్నికల్లో విజయం సాధించి, తొలిసారి అధికారంలోకి వచ్చిన జగన్ నాయకత్వంలోని వైఎస్ఆర్సీపీ అదే ఏడాది అక్టోబరు 2 నుంచి గ్రామ సచివాలయాలకు శ్రీకారం చుట్టింది. వీటి ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందజేయడానికి ప్రయత్నిస్తోంది. 700 వందలకుపైగా సేవలను అందిస్తోంది.

అయితే స్టాలిన్ పంచాయతీలకు సమాంతరంగా వీటిని ఏర్పాటు చేస్తూ కొత్తగా ఉద్యోగుల్ని నియమించే ప్రయత్నం చేయడం లేదు. పంచాయతీల ఆధ్వర్యంలోనే పంచాయతీ ఉద్యోగులతోనే నిర్వహించనున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జ‌గ‌న్ కు ష‌ర్మిల సూటి ప్ర‌శ్న‌లు… జ‌వాబు చెప్పే ద‌మ్ముందా?

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఆయ‌న చెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో వైసీపీ చేసిన ధ‌ర్నా, అక్క‌డ జ‌గ‌న్ చేసిన...

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

అమరావతిలో AI హబ్ !

అమరావతిని కొనసాగించి ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ హబ్‌గా మారి ఉండేదని సీఎం చంద్రబాబునాయుడు అసెంబ్లీలో బాధగా చెప్పారు. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది..ఎందుకు ఉపయోగించుకోకూడదని నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ప్రసిద్ది...

HOT NEWS

css.php
[X] Close
[X] Close