స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌పై తమ్మినేని వివాదాస్పద వ్యాఖ్యలు

స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాడి.. ఓ రేంజ్‌లో ఉంది. రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్న స్పీకర్ దగ్గర్నుంచి మంత్రుల వరకూ.. అందరూ.. తమ తమ రేంజ్‌లో విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. స్పీకర్ గా ఉంటూ… నాటు భాషలో రాజకీయ విమర్శలు చేయడంలో తనదైన ప్రత్యేకత సాధించిన తమ్మినేని సీతారాం.. ఈ సారి తన భాషా ప్రావీణ్యాన్ని ఎస్ఈసీపై ప్రయోగించారు. వెధవలకు పదవులు, గాడిదలకు కొమ్ములొచ్చినా ప్రమాదమేనని ఘాటుగా స్పందించారు.ఈసీ అన్ని నిర్ణయాలు తీసుకుంటే ప్రభుత్వం ఎందుకు… రమేష్‌ కుమార్‌ను సీఎం కుర్చీలో కూర్చోమనండి అని తేల్చేశారు.

ప్రభుత్వంతో సంప్రదించకుండా నోటిఫికేషన్‌ రద్దు చేసి ఎన్నికలు నిర్వహించే అధికారం ఈసీకి లేదని తేల్చేశారు. ప్రభుత్వంపై ఎస్ఈసీ పెత్తనం ఏంటని .. రమేష్‌కుమార్‌ వంటి వ్యక్తులు కీలక స్థానాల్లో ఉంటే రాజ్యాంగానికి అవమానమని మండిపడ్డారు. రమేష్‌కుమార్‌.. రాష్ట్రం వాళ్ల అబ్బ జాగీరు అనుకుంటున్నాడా … రాష్ట్రానికి రావాల్సిన 14వ ఆర్ధిక సంఘం నిధులు ఎవరిస్తారని విరుచుకుపడ్డారు. మంత్రులు ఎక్కువగా చంద్రబాబే ఆ నిర్ణయం తీసుకున్నారన్నట్లుగా ప్రచారం చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

చంద్రబాబు ప్రలోభాలకు ఈసీ లొంగినట్టు కనిపిస్తోందని మంత్రి నాని విమర్శలు గుప్పించారు. ఓ వ్యక్తి కోసం, తన సామాజికవర్గం కోసం… ఎన్నికల కమిషనర్‌ నిర్ణయం తీసుకోవడం బాధాకరమని మంత్రి అనిల్ తేల్చేశారు. కరోనా కన్నా… చంద్రబాబు పెద్ద వైరస్‌లా తయారయ్యాడని మండిపడ్డారు. ఏపీలో పొలిటికల్ కరోనా కొనసాగుతోందని .. ఏపీలో ఆర్ధిక ఎమర్జెన్సీని ప్రతిపక్ష పార్టీలు ఆహ్వానిస్తున్నాయని మరో సీనియర్ నేత ఆనం మండిపడ్డారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీకి కరోనా చాలా విషయమే. కరోనా కన్నా.. ఎన్నికలు నిర్వహణ తమకు అత్యంత ముఖ్యమని వాదిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పెండింగ్‌లో ఉన్న మూడు డీఏల చెల్లింపునకు సీఎం జగన్ గ్రీన్‌సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు దసరా కానుక ప్రకటించింది. పెండింగ్‌లో ఉన్న మూడు డీఏల చెల్లింపునకు సీఎం జగన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. డీఏల చెల్లింపునకు కార్యాచరణ కూడా ప్రభుత్వం ప్రకటించింది. జులై 2018...

ఎన్నికలు నిర్వహణ వద్దంటున్న వైకాపా

దేశంలో కరోనా లాక్ డౌన్ విధించినప్పుడు ఎన్నికలు వాయిదా వేశారని నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను కులం పేరు పెట్టి మరీ బూతులు తిట్టిన మంత్రులు ఇప్పుడు.. అదే రమేష్ కుమార్ ఎన్నికలు పెడతానంటే...

అమరావతిలో “రియల్ పెయిడ్ ఉద్యమం” స్టార్ట్..!

అమరావతిలో పోటీ ఉద్యమాలు జరుగుతున్నాయి. భూములిచ్చిన రైతులు లాఠీదెబ్బలకు ఓర్చుకుని పోరాటం చేస్తూంటే.. వారికి పోటీగా కొంత మంది ఇప్పుడు ఉద్యమాలను ప్రారంభిస్తున్నారు. శంకుస్థాపన చేసి ఐదేళ్లయిన సందర్భంగా రైతుల సభ...

తిరుపతిలో బీజేపీ పోటీ ఖాయం.. కానీ అభ్యర్థి మాత్రం పక్క పార్టీ నుంచి..!

తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికల్లో పోటీ చేసి.. తాము ఏపీలో బలపడ్డామని నిరూపించుకోవాలని భారతీయ జనతా పార్టీ ఉబలాట పడుతోంది. ముఖ్యంగా ఏపీ వ్యవహారాల ఇన్చార్జ్‌గా ఉన్న సునీల్ ధియోధర్ తాను.. పార్టీని...

HOT NEWS

[X] Close
[X] Close