తానా 2021 ఎన్నికల షెడ్యూల్ విడుదల

అమెరికాలో తెలుగువాళ్ళంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. ఈ ఎన్నికలను పర్యవేక్షించేందుకు కమిటీని కూడా నియమించారు. ఎన్నికల కమిటీ చైర్మన్‌గా కనకం బాబు ఇనంపూడి, సభ్యులుగా ఆంజనేయులు కోనేరు, రాజా ముత్యాల వ్యవహరించనున్నట్లు బోర్డ్‌ చైర్మన్‌ హరీష్‌ కోయ తెలిపారు.

తానా ఎన్నికల షెడ్యూల్‌ ఈ విధంగా ఉంది. జనవరి 31వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల, నామినేషన్ల దాఖలుకు ఆఖరు తేదీ ఫిబ్రవరి 13. అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన, అభ్యర్థుల ప్రకటనను ఫిబ్రవరి 16న చేయనున్నారు. అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ గడువు ఫిబ్రవరి 22. ఫిబ్రవరి 25న నామినేషన్ల తుదిజాబితా విడుదల, మార్చి 1న తానా వెబ్‌సైట్‌లో క్యాండిడేట్ల వివరాలు, బ్యాలెట్‌ మెయిలింగ్‌ యుఎస్‌పిఎస్‌ (ఫస్ట్‌ క్లాస్‌) మార్చి, 22, బ్యాలెట్‌ స్వీకరణకు తుది గడువు మే 14గా నిర్ణయించారు. మే 15న ఓట్ల లెక్కింపు, మే 16న ఎన్నికల ఫలితాల ప్రకటన ఉంటుంది.

ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పదవికి పోటీ పడే అభ్యర్థులు నామినేషన్‌ ఫీజుగా 5,000 డాలర్లు చెల్లించాలి. రీజినల్‌ రిప్రజెంటేటివ్‌ పదవులకు పోటీ పడే అభ్యర్థులు 1,500 డాలర్లు చెల్లించాలి. ఇతర పదవులకు పోటీ చేసేవాళ్ళు 2,500 డాలర్లు చెల్లించాలి. ఒకవేళ ఎన్నికల కమిటీ ఎవరి నామినేషన్‌ను అయినా రిజెక్ట్‌ చేస్తే ఆ అభ్యర్థికి పూర్తి సొమ్మును చెల్లిస్తారు. అభ్యర్థే స్వయంగా నామినేషన్‌ను ఉపసంహరించుకుంటే 50శాతం నామినేషన్‌ ఫీజును వాపస్‌ చేస్తారు.

ఈ కింది పదవులకు పోటీలు జరగనున్నాయి.

బోర్డ్‌ డైరెక్టర్‌ పదవులకు సంబంధించి 3 పదవులకు ఓపెన్‌ కెటగిరీ కింద ఎన్నికలు జరుగుతాయి. ఈ పదవుల్లో గెలిచినవాళ్ళు 4 సంవత్సరాలపాటు (2021-25) పదవుల్లో ఉండవచ్చు. నాన్‌ డోనర్‌ డైరెక్టర్‌ (2 పోస్టులు), డోనర్‌ డైరెక్టర్‌ (ఒక పోస్టు)లకు ఎన్నికలు జరుగుతాయి.

ఎగ్జిక్యూటివ్‌ కమిటీ పోస్టులకు సంబంధించి 20 ఓపెన్‌ కేటగిరీ పోస్టులు ఉన్నాయి. 2 ఏళ్ళపాటు (2021-23) వారు పదవుల్లో ఉండవచ్చు.

ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, సెక్రటరీ, ట్రెజరర్‌, జాయింట్‌ సెక్రటరీ, జాయింట్‌ ట్రెజరర్‌, కమ్యూనిటీ సర్వీస్‌ కో ఆర్డినేటర్‌, కల్చరల్‌ సర్వీస్‌ కో ఆర్డినేటర్‌, ఉమెన్‌ సర్వీస్‌ కో ఆర్డినేటర్‌, కౌన్సిలర్‌ ఎట్‌ లార్జ్‌, ఇంటర్నేషనల్‌ కో ఆర్డినేటర్‌, స్పోర్ట్స్‌ కో ఆర్డినేటర్‌ పదవులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

రీజినల్‌ రిప్రజెంటెటివ్‌ పోస్టులకు సంబంధించి న్యూఇంగ్లాండ్‌, న్యూయార్క్‌, న్యూజెర్సి, మిడ్‌ అట్లాంటిక్‌, క్యాపిటల్‌, అప్పలాచియాన్‌, సౌత్‌ ఈస్ట్‌, నార్త్‌, ఒహాయోవ్యాలీ, మిడ్‌ వెస్ట్‌, సౌత్‌ సెంట్రల్‌, డిఎఫ్‌డబ్ల్యు, సౌత్‌వెస్ట్‌, నార్త్‌ సెంట్రల్‌, సదరన్‌ కాలిఫోర్నియా, నార్తర్న్‌ కాలిఫోర్నియా, నార్త్‌ వెస్ట్‌, రాకీ మౌంటెన్స్‌ ఏరియా పదవులకు కూడా ఎన్నికలు జరుగుతాయి.

తానా ఫౌండేషన్‌కు సంబంధించి 7 ఓపెన్‌ పోస్టులు ఉన్నాయి. (2021-25 వరకు ఈ పదవుల్లో కొనసాగవచ్చు), ఫౌండేషన్‌ ట్రస్టీ – 5 పదవులు (4 సంవత్సరాల పదవీ కాలం), ఫౌండేషన్‌ డోనర్‌ ట్రస్టీ 2 పదవులు (4 సంవత్సరాల పదవీ కాలం)

ఎన్నికలకు సంబంధించి ఇతర సమాచారం కోసం కమిటీని ఇ-మెయిల్‌ ద్వారా సంప్రదించవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నలభై రోజుల్లో మునుగోడు ఉపఎన్నిక !

మనుగోడులో బీజేపీని గెలిపించే బాధ్యతను సునీల్ భన్సల్‌కు హైకమాండ్ ఇచ్చింది. ఆయన ఇక్కడకు వచ్చి మొత్తం ప్లాన్ రెడీ చేస్తున్నారు. మరో నలభై రోజుల్లో ఉపఎన్నిక వస్తందని క్లారిటీ ఇచ్చేశారు. ఉపఎన్నిక...

ట్విట్టర్ ఖాతాలను కూడా టీడీపీ కాపాడుకోలేకపోతోందా !?

తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా ఇటీవలి కాలంలో రెండో సారి హ్యాక్‌కు గురైంది. మొదటి సారి అసభ్య పోస్టులు పెట్టారు. రెండో సారి అసభ్యత లేదుకానీ.. టీడీపీ సోషల్ మీడియా డొల్లతనాన్ని...

తెలంగాణలో తటస్తులపై బీజేపీ గురి !

మీడియాలో ఊపు వచ్చింది కానీ క్షేత్ర స్థాయిలో క్యాడర్ లేని పరిస్థితిని అధిగమింంచడానికి తెలంగాణ బీజేపీ చాలా ప్రయత్నాలు చేస్తోంది. చేరికలు అనుకున్న విధంగా సాగడం లేదు. కాంగ్రెస్ నుంచి వచ్చి కొంత...

5జీ సేవలు పొందడానికి ద్వితీయ శ్రేణిలోనే ఏపీ ప్రజలు !

నిన్నామొన్నటిదాకా ఏపీ అంటే టెక్నాలజీకి స్టార్టింగ్ ప్లేస్. ఇన్నోవేటివ్ టెక్నాలజీని టెస్టింగ్ చేయడంలనూ ప్రజలకు అందించడంలోనూ ముందుండేది. కానీ ప్రభుత్వాలు మారిన తర్వాత ప్రయారిటీలు మారిపోయాయి. ఆ పరిస్థితి మార్పును స్పష్టంగా చూపిస్తోది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close