దాడుల ధర్నాలు..! ఇవాళ టీఆర్ఎస్.. రేపు బీజేపీ..!

టీఆర్ఎస్ – బీజేపీ దాడుల రాజకీయాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. సోమవారం అంతా టీఆర్ఎస్ నేతలు పలు చోట్ల ఆందోళనలకు దిగారు. ధర్మారెడ్డి ఇంటిపై దాడికి నిరసనగా ఆయన నియోజకవర్గం పరకాలలో బంద్ పాటించారు. వరంగల్ జిల్లాలో పలు చోట్ల నిరసనలు చేపట్టారు. రాత్రి అంతా బీజేపీ నేతల ఇళ్లపై వరుస దాడులు జరిగాయి. దీంతో భారతీయ జనతా పార్టీ ముఖ్య నేతలు మండిపడ్డారు. మంగళవారం.. తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. శాంతియుతంగా నిరసనలు చేపట్టాలని ప్రత్యేకంగా పిలుపునిచ్చారు.

దీంతో తెలంగాణలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఓ వైపు తమ జోలికి వస్తే ఊరుకోబోమని.. తాము అధికార పార్టీ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. అయితే ఇదే ఎఫెక్ట్ కోసం బీజేపీ నేతలు చూస్తున్నట్లుగా ఉంది. టీఆర్ఎస్ నేతల్ని వీలైనంతగా రెచ్చగొట్టాలన్న ఉద్దేశంతోనే బీజేపీ నేతలు ఇలాంటి వ్యూహాలను అమలు చేస్తున్నట్లుగా అనుమానిస్తున్నారు. తమ నేతలపై దాడులు చేస్తున్నారని… ఆపకపోతే.. తాము ఊరుకోబోమని అంటున్నారు. అయోధ్య విరాళాల అంశం సున్నితమైనది కావడంతో బీజేపీ నేతలు దీన్ని మరింత పెద్దది చేయాలనుకుంటున్నారు.

రామాలయం నిర్మాణానికి కేసీఆర్ అనుకూలమా కాదా.. అన్న వాదన తీసుకు వస్తున్నారు. దీంతో టీఆర్ఎస్ నేతలు కాస్త ఇబ్బంది పడాల్సి వస్తోంది. తాము రాముడి ఆలయానికి వ్యతిరేకం కాదని.. బీజేపీ నేతల దందాకే వ్యతిరేకమని చెబుతున్నారు. ఈ వివాదం మరిన్ని మలుపులు తిరగడం ఖాయంగా కనిపిస్తోంది. త్వరలో వరంగల్ మేయర్ ఎన్నిక జరగనున్న నేపధ్యంలో ఈ వివాదాన్ని ఇలా కొనసాగించాలనే వ్యూహం బీజేపీలో ఉందంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హైద‌రాబాద్ లో భూమి కొన్న మైక్రోసాఫ్ట్…

ప్ర‌ముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ త‌న కార్య‌క‌లాపాల‌ను మ‌రింత విస్తృతం చేయ‌నుంది. ఇప్ప‌టికే హైద‌రాబాద్ స‌హా దేశంలోని ప్ర‌ముఖ న‌గ‌రాల నుండి మైక్రోసాఫ్ట్ ఆఫీసులు ప‌నిచేస్తుండ‌గా, అతిపెద్ద డేటా సెంట‌ర్ ను...

‘స్వ‌యంభూ’ యాక్ష‌న్‌: 12 రోజులు… రూ.8 కోట్లు

'కార్తికేయ 2'తో నిఖిల్ ఇమేజ్ మొత్తం మారిపోయింది. ఆ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇది వ‌ర‌కు రూ.8 కోట్లుంటే నిఖిల్ తో సినిమా చేసేయొచ్చు. ఇప్పుడు ఓ యాక్ష‌న్ సీన్...

నాని సైతం.. ప‌వ‌న్ కోసం

ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేన పార్టీ స్థాపించి ప‌దేళ్ల‌య్యింది. మెగా ఫ్యామిలీ, కొంత‌మంది క‌మెడియ‌న్లు, ఒక‌రిద్ద‌రు ప‌వ‌న్ డై హార్డ్ ఫ్యాన్స్ త‌ప్ప‌, ప‌వ‌న్‌కు నేరుగా పొలిటిక‌ల్ గా స‌పోర్ట్ ఎవ‌రూ చేయ‌లేదు. దానికి...

కేసీఆర్‌కు ధరణి – జగన్‌కు టైటిలింగ్ యాక్ట్ !

తెలంగాణలో కేసీఆర్ ఎందుకు ఓడిపోయారు.. అంటే ప్రధాన కారణాల్లో ధరణి అని ఒకటి వినిపిస్తుంది. ఈ చట్టం వల్ల కేసీఆర్ , బీఆర్ఎస్ నేతలు భూములు దోచుకున్నారన్న ఓ ప్రచారం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close