భ‌క్త క‌న్న‌ప్ప‌.. స్క్రిప్టు మళ్లీ బ‌య‌ట‌కు

`భ‌క్త క‌న్న‌ప్ప‌`ని రీమేక్ చేయాల‌ని కృష్ణంరాజు ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నారు. ఆ పాత్ర‌లో ప్ర‌భాస్ ని చూసుకోవాల‌న్న‌ది ఆయ‌న ఆశ‌. ద‌ర్శ‌క‌త్వం కూడా ఆయ‌నే చేప‌ట్టాల‌నుకున్నారు. కానీ ఆ ప్రాజెక్టు.. ఒక్క అడుగు కూడా ముందుకు వేయ‌లేదు.

`కన్న‌ప్ప‌` క‌థ‌ని సినిమాగా తీయాల‌ని త‌నికెళ్ల భ‌ర‌ణి కూడా ఫిక్స‌య్యారు. త‌న హీరోగా.. సునీల్ ని ఎంచుకున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చింది. ఆ త‌ర‌వాతే… ఈ సినిమాకి సంబంధించిన ఎలాంటి అప్‌డేటూ లేదు. సునీల్ కూడా డ్రాప‌యిపోవ‌డంతో.. భ‌ర‌ణి ఆ స్క్రిప్టుని పక్క‌న పెట్టేశారు.

భ‌ర‌ణి ద‌గ్గ‌ర `క‌న్న‌ప్ప‌` స్క్రిప్టు రెడీగా ఉంద‌ని తెలుసుకున్న మోహ‌న్ బాబు… ఆసినిమాతో విష్ణుతో చేస్తే బాగుంటుంద‌ని భావించారు. విష్ణు ఎంట‌ర్ అయ్యాక‌… ఈ సినిమా బడ్జెట్ తో పాటు స్వ‌రూప స్వ‌భావాల‌న్నీ మారిపోయాయి. దాదాపు 50 కోట్ల‌తో ఈ సినిమాని తెర‌కెక్కించాల‌ని ప్లాన్ చేశారు. ఇంత పెద్ద సినిమా మోయ‌డం త‌న వ‌ల్ల కాదని… భ‌ర‌ణి ఈ ప్రాజెక్టు నుంచి త‌ప్పుకున్నారు. దాంతో.. హాలీవుడ్ నుంచి ఓ డైరెక్ట‌ర్ ని రంగంలోకి దింపాడు విష్ణు. ఆ త‌ర‌వాత‌.. ఆ ప్రాజెక్టు గురించి ఎలాంటి స‌మాచార‌మూ లేదు.

ఇప్పుడు మ‌ళ్లీ ఈ క‌థ‌ని బ‌య‌ట‌కు తీసిన‌ట్టు తెలుస్తోంది. ఈ స్క్రిప్టు ఇప్పుడు బుర్రా సాయి మాధ‌వ్ ద‌గ్గ‌ర‌కు చేరింద‌ట‌. ఆయ‌న క‌థ‌లో మార్పులూ చేర్పులూ చేస్తున్నార‌ని టాక్‌. ఎలాగైనా స‌రే.. ఈ యేడాది క‌న్న‌ప్ప‌ని సెట్స్ పైకి తీసుకెళ్లాల‌ని విష్ణు ఫిక్స‌య్యాడు. మార్చి లేదా ఏప్రిల్ లో ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది. ఈసారైనా… అన్నీ ప‌క్కాగా జ‌రుగుతాయా? మ‌ళ్లీ క‌న్న‌ప్ప‌కి బ్రేకులు ప‌డ‌తాయా? అన్న‌ది ఆస‌క్తిక‌రం. ఎందుకంటే.. ఈ క‌న్న‌ప్ప క‌థ ఎప్పుడూ న‌లుగుతూనే ఉంటుంది త‌ప్ప‌, బ‌య‌ట‌కు రాదు. ఈసారీ ప్ర‌క‌ట‌న‌ల‌కే ప‌రిమితం అయితే.. క‌న్న‌ప్ప కి ఏదో బ్యాడ్ సెంటిమెంట్ వెంటాడుతున్న‌ట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్‌ను బుక్ చేయడానికి రేవంత్ రెడీ..! సంజయ్ సిద్ధమేనా..?

కేసీఆర్ ఎంపీగా పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించారని.. ఆ విషయాలను తాను బయటపెడతానని బండి సంజయ్ బెదిరించారు. స్పీకర్ పర్మిషన్ తీసుకున్నానని.. తప్ప సరిగా పార్లమెంట్‌ను కుదిపేస్తుందని కూడా చెప్పుకొచ్చారు. అయితే బండి సంజయ్...

కొన్ని చోట్ల మళ్లీ మున్సిపల్ నామినేషన్లు..!

దౌర్జన్యాలు, బలవంతపు ఉపసంహరణలు జరిగాయని ఆరోపణలు వచ్చిన చోట మరోసారి నామినేషన్లకు ఎస్‌ఈసీ అవకాశం కల్పించారు. ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతి కార్పొరేషన్‌, పుంగనూరు, రాయచోటి పురపాలక సంఘాలు,...

బాలికను పెళ్లి చేసుకుంటావా? విచారణలో రేపిస్ట్‌ను అడిగిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్..!

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్.ఎ. బోబ్డే మైనర్‌పై అత్యాచారం చేసిన ప్రభుత్వ ఉద్యోగి కేసు విచారణ సమయంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. మైనర్‌పై అత్యాచారం చేసిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమేనా...

జనసేనతో మాకు ఎలాంటి పొత్తు లేదు: బీజేపీ నేత డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఒక టీవీ డిబేట్ లో మాట్లాడుతూ తమ పార్టీకి జనసేనతో ఎటువంటి పొత్తు లేదని , ఉండబోదని వ్యాఖ్యానించడం ప్రస్తుతం సంచలనంగా మారింది వివరాల్లోకి వెళితే.. బీజేపీ...

HOT NEWS

[X] Close
[X] Close