కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాల జమానా నడుస్తోంది. అర్జున్ రెడ్డితో ఓ సూపర్ డూపర్ హిట్టందుకున్న విజయ్ దేవరకొండ కూడా ఈసారి కాన్సెప్ట్ కథనే ఎంచుకున్నాడు. అదే టాక్సీవాలా. ఇదో సైంటిఫిక్ థ్రిల్లర్. దానికి తగ్గట్టుగానే టీజర్ ని వెరైటీగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు. టీజర్లో ఇదో సైంటిఫిక్ థ్రిల్లర్ అనే సంగతి అర్థమైంది. కారుతో ముడిపడిన కథ. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో కథానాయకుడ్ని కాబ్ డ్రైవర్‌గా చూపిస్తున్నారు. కాన్సెప్ట్ ఏంటన్నది స్పష్టంగా తెలియకపోయినా.. థియేటర్లో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసే ప్రయత్నమేదో జరుగుతున్నట్టు అర్థమవుతోంది. పంచ్ డైలాగుల జోలికి పోకుండా.. ఓ కాన్సెప్ట్ ప్రకారం ఈ టీజర్‌ని కట్ చేశారు. జీఏ 2, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్కెఎన్ నిర్మాత. రాహుల్ సంకృత్యాన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మే 18న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ప్రియాంకా జవల్కర్, మాలవికా నాయర్ కథానాయికలుగా నటించారు.