కాంగ్రెస్ పార్టీలో ఎవరి బాధ్యతలు ఎవరు నిర్వహిస్తారో తెలియదు. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను చూసుకోవాలని వచ్చే వారు.. నేరుగా పార్టీ కార్యక్రమాలను నిర్వహించేదుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో ఇంచార్జ్ గా వ్యవహరించిన దీపాదాస్ మున్షి నేరుగా పాలనలో జోక్యం చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ ఏకంగా పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. జులై 31 నుండి తెలంగాణలో పాదయాత్ర చేపట్టాలని నిర్మయించారు.
వారం రోజుల పాటు ముందుగా ఖరారు చేసిన నియోజకవరాల్లో 8 నుండి 10 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహిస్తారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకత్వం , కార్యకర్తలను యాక్టివ్ చేయడం, ప్రజల సమస్యలను నేరుగా వినడం మ, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు రుణమాఫీ, వెనుకబడిన తరగతుల జాతి గణన వంటి పథకాలను ప్రచారం చేయడం కోసం ఈ పాదయాత్ర చేస్తున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
పాదయాత్రలోనే పార్టీలోని సీనియర్ మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయం మెరుగుపరచడం , సంతృప్త నాయకుల సమస్యలను పరిష్కరించడం వంటివి చేయాలనుకుంటున్నారు. ఈ పాదయాత్రలో మీనాక్షినటరాజన్ వెంట టీ పీసీసీ చీఫ్ ఉంటారు. నేరుగా ఇలా పాదయాత్ర ప్రారంభించాలని నిర్ణయించడంతో.. కాంగ్రెస్ వర్గాలు ఎంత మేర యాక్టివ్ అవుతాయన్నది చర్చనీయాంశంగా మారింది.