తెదేపా-వైకాపాల టామ్ అండ్ జెర్రీ షో?

ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి ప్రభుత్వం పిలిచినా తను రానని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చెప్పడం, వచ్చినా రాకపోయినా తప్పకుండా పిలిచి తీరుతాం అని తెదేపా నేతలు చెపుతుండటం చూస్తుంటే టామ్ అండ్ జెర్రీ కామెడీ షో గుర్తుకొస్తోంది. దానినే అచ్చ తెలుగులో చెప్పుకొంటే పిల్లికి చెలగాటం ఎలక్కి ప్రాణ సంకటం అని ఎంచక్కా వర్తింపజేసుకోవచ్చును. కాకపోతే ఈ కామెడీ షోలో రెండు పార్టీలు కూడా తామే టామ్ (పిల్లి) అని ఎదుటవాళ్ళే జెర్రి (ఎలుక) అనేసుకోవడమే ఈ షో ప్రత్యేకత. కనుక ఈ షోలో ఎప్పుడు ఎవరు ఏ పాత్రలో ఉన్నారో జాగ్రత్తగా అర్ధం చేసుకోవలసిన బాధ్యత ప్రేక్షకులదే (ప్రజలదే).

ఈ కామెడీ షోని (టామ్)లాగ ఫీలయిపోతూ జగన్ మొదలు పెట్టారు. ఎందుకంటే జెర్రీ (తెదేపా)ని అల్లరిపెట్టి ఆనందించాలని కావచ్చును లేదా వారం రోజులు తను కడుపు మాడ్చుకొని షో చేసినా పట్టించుకోని ప్రేక్షకుల (ప్రజల) దృష్టిని అమరావతి కార్యక్రమం నుంచి తనవైపు డైవర్ట్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో కావచ్చును. తను దీక్ష చేస్తూ జెర్రీ పాత్ర పోషిస్తున్నపుడు తెదేపా నేతలు టామ్ పాత్రలో లీనమయిపోయి అచ్చం ‘పిల్లికి చెలగాటం ఎలక్కి ప్రాణ సంకటం’ అన్నట్లుగానే తనతో తెగ ఆడేసుకొన్నారు. అంతేకాదు ఏదో ‘నీళ్ళు మట్టి’ అంటూ తెగ హడావుడి చేసేసి గుంటూరులో తన షోని అట్టర్ ఫ్లాప్ చేసి పడేశారు.
ఎలాగో ఆ ‘నాన్ స్టాప్ షో’కి ఫుల్ స్టాప్ పెట్టేసాక ఇప్పుడు జగన్ టామ్ పాత్రలోకి ప్రవేశించి జెర్రీ (తెదేపా)తో షో మొదలుపెట్టారు.

కానీ గమ్మతయిన విషయం ఏమిటంటే తెదేపా కూడా తనే టామ్ పాత్ర పోషిస్తున్నట్లు, జగనే జెర్రీ పాత్ర పోషిస్తున్నట్లు ఫీలయిపోతూ షోని కంటిన్యూ చేస్తోంది. ఎందుకంటే ఇప్పుడు జెర్రీ (జగన్)ని ఎంత రెచ్చగొడితే అన్ని తప్పులు మాట్లాడుతారు. తప్పులు చేస్తుంటారు. అప్పుడు ప్రేక్షకులు (ప్రజలు) జెర్రీని చూసి ఇంకా నవ్వుకొంటారు. చివరికి జెర్రీ (జగన్)తో చెలగాటం ఆడుకొన్నప్పటికీ అందరూ టామ్(తెదేపా) మంచిది…జెర్రీయే చెడ్డది అనుకొంటారు. అందుకే తెదేపా టామ్ లన్నీ జెర్రీ…జెర్రీ…అని ఒకటే కలవరిస్తున్నాయి.

అయితే షో మొదలుపెట్టేసిన జెర్రీ అకస్మాత్తుగా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలోకి వెళ్లి దాకొంది. జెర్రీ కాకపోతే దాని పి.ఏ.నయినా ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేసి షో కంటిన్యూ చేద్దామని టామ్ ఎంతగా ప్రయత్నిస్తున్నా అవతల జెర్రీ బ్యాచ్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని స్క్రోలింగులో న్యూస్ వస్తోంది. ఇవాల్టికి ఈ షో ఇంతవరకే సాగింది…బహుశః రేపటి షోలో జెర్రీతో బాటు జెర్రీ బ్యాచ్ కూడా ఎంట్రీ ఇస్తే షో మరింత రసవత్తరంగా సాగుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పెండింగ్‌లో ఉన్న మూడు డీఏల చెల్లింపునకు సీఎం జగన్ గ్రీన్‌సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు దసరా కానుక ప్రకటించింది. పెండింగ్‌లో ఉన్న మూడు డీఏల చెల్లింపునకు సీఎం జగన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. డీఏల చెల్లింపునకు కార్యాచరణ కూడా ప్రభుత్వం ప్రకటించింది. జులై 2018...

ఎన్నికలు నిర్వహణ వద్దంటున్న వైకాపా

దేశంలో కరోనా లాక్ డౌన్ విధించినప్పుడు ఎన్నికలు వాయిదా వేశారని నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను కులం పేరు పెట్టి మరీ బూతులు తిట్టిన మంత్రులు ఇప్పుడు.. అదే రమేష్ కుమార్ ఎన్నికలు పెడతానంటే...

అమరావతిలో “రియల్ పెయిడ్ ఉద్యమం” స్టార్ట్..!

అమరావతిలో పోటీ ఉద్యమాలు జరుగుతున్నాయి. భూములిచ్చిన రైతులు లాఠీదెబ్బలకు ఓర్చుకుని పోరాటం చేస్తూంటే.. వారికి పోటీగా కొంత మంది ఇప్పుడు ఉద్యమాలను ప్రారంభిస్తున్నారు. శంకుస్థాపన చేసి ఐదేళ్లయిన సందర్భంగా రైతుల సభ...

తిరుపతిలో బీజేపీ పోటీ ఖాయం.. కానీ అభ్యర్థి మాత్రం పక్క పార్టీ నుంచి..!

తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికల్లో పోటీ చేసి.. తాము ఏపీలో బలపడ్డామని నిరూపించుకోవాలని భారతీయ జనతా పార్టీ ఉబలాట పడుతోంది. ముఖ్యంగా ఏపీ వ్యవహారాల ఇన్చార్జ్‌గా ఉన్న సునీల్ ధియోధర్ తాను.. పార్టీని...

HOT NEWS

[X] Close
[X] Close