చైతన్య : మళ్లీ టీడీపీ – బీజేపీ – జనసేన..!?

కలిసి చేసే ప్రజాపోరాటాలే.. ఎన్నికల స్నేహాలకు దారి తీస్తూ ఉంటాయి. ఏపీలో ప్రస్తుత ప్రజాపోరాట స్నేహాలు.. కొత్త సమీకరణాలపై.. చర్చను రేకెత్తిస్తున్నాయి. లాంగ్ మార్చ్‌కు టీడీపీ మద్దతు ప్రకటించిది. ఇతర పార్టీలు సంఘిభావం తెలిపాయి. ఈ బాధ్యత .. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే తీసుకుంది. వరుస పాలనా వైఫల్యాలపై అందరూ కలిసి పోరాడే వేదికను.. వైసీపీనే సిద్ధం చేస్తోంది. భవిష్యత్‌లో అందరూ కలిసినా.. అది పాలక పక్ష వైఫల్యమే..!. ఇది మళ్లీ.. కొత్త రాజకీయ సమీకరణాలకు దారి తీస్తోంది.

జనసేనకు టీడీపీ మద్దతు రాజకీయాల్ని మారుస్తుందా..?

రాజకీయాల్లో ఎవరైనా కలిసి పని చేయడం ప్రారంభించారంటే..దానికి చాలా దూరం అర్థాలు తీస్తాయి .. ప్రత్యర్థి పార్టీలు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ అదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. పవన్ కల్యాణ్ పార్టీ పెట్టినప్పటి నుండి.. ప్రత్యేకంగా …టార్గెట్ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత .. మరింత పదును పెట్టింది. జనసేన పార్టీ నేతల్ని ఎక్కడికక్కడ చేర్చుకోవడమో.. లేక కేసులతో ఇబ్బంది పెట్టి సైలెంటయ్యేలా చేయడమో చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో.. ఇసుక కొరత విషయంలో ప్రభుత్వ వైఖరిపై .. పవన్ రోడ్డెక్కుతూండటం… దానికి తెలుగుదేశం పార్టీ మద్దతు ఇవ్వడంతో.. ఆ పార్టీ విమర్శలకు.. ఆనకట్ట తెగినట్లయింది. పవన్ కల్యాణ్‌ను చంద్రబాబు దత్తపుత్రుడిగా చెబుతూ.. వైసీపీ నేతలు విమర్శలు ప్రారంభించారు. చంద్రబాబు డైరక్షన్‌లోనే ఇలా చేస్తున్నారంటూ మండి పడుతున్నారు. అధికారపక్షం విపక్షాలన్నీ ఏకం కాకుండా చూసుకోవడం కోసం ప్రయత్నిస్తోంది. ఆ విషయంలో ఇప్పటికీ వైసీపీ వ్యూహం కొంత సక్సెస్ అయింది. అయితే.. ప్రధానంగా.. టీడీపీ- జనసేన కలసి పోరాటం చేయకుండా చూడాలని…వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేసింది. రివర్స్‌ ప్రచారం మొదలు పెట్టింది. టీడీపీతో కలవడం ఏమిటని.. జనసేన నేతలను.. జనసేనతో కలవడం ఏమిటని.. వైసీపీ నేతలను రెచ్చగొట్టేలా వైసీపీ నేతలు ప్రకటనలు చేస్తూ వస్తున్నారు.

మితృత్వం ఉభయతారకం అని ఇప్పటికైనా గుర్తించారా..?

పవన్ కల్యాణ్ విషయంలో… చంద్రబాబుకు మొదటి నుంచి సాఫ్ట్ కార్నర్ ఉంది. గతంలో.. తమతో మిత్రపక్షంగా ఉండి… అప్పటి గవర్నర్, ఇతరుల వ్యూహాల కారణంగా.. తమకు దూరమయ్యారని.. చంద్రబాబు నమ్ముతున్నారు. ఎన్నికల ముందు కూడా.. కలసి పని చేద్దామని.. పిలుపునిచ్చారు. కానీ.. జనసేనాని అప్పటికే కమ్యూనిస్టులతో కలిసి… ఎన్నికల సమరం ప్రారంభించారు. తన బలం ఏమిటో తేల్చుకోవాలనుకుంటున్నానని అందుకే ఒంటరిగా పోటీ చేయాలనుకుటున్నట్లుగా స్పష్టం చేశారు. అయితే.. ఎన్నికల్లో… రెండు పార్టీలకూ నష్టం జరిగింది. ఉభయగోదావరి, ఉత్తరాంధ్రల్లో అనేక నియోజవకవర్గాల్లో జనసేన పార్టీ వల్ల టీడీపీ కీలక అభ్యర్థులు పరాజయం పాలయ్యారు. చివరికి.. పవన్ కల్యాణ్‌కు కూడా కలసి రాలేదు. ఆయన కూడా రెండు చోట్ల పరాజయం పాలయ్యారు. ఆరు శాతం మాత్రమే ఓట్లు వచ్చాయి. విడివిడిగా పోటీ చేయడం వల్ల.. ఎన్నికల వాతావరణం ఓ రకంగా.. వైసీపీకి ఏకపక్షంగా మారిపోయిందని… ఫలితాలే తేల్చాయి. భవిష్యత్ రాజకీయాలను బట్టి చూసినా.. రాజకీయ సమీకరణాలు అన్నీ ఈ రెండు పార్టీల మధ్య ఉంటాయనే అంచనా రాజకీయవర్గాల్లో ఉంది.

త్వరలో బీజేపీ కూడా కలిసే అవకాశం ఉందా..?

పవన్ కల్యాణ్‌తో కలిసేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నించింది. కానీ పవన్ కల్యాణ్ మాత్రం.. కమ్యూనిస్టులతో పోరాటానికి సిద్ధమయ్యారు కాబట్టి లైట్ తీసుకుంది. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా.. బీజేపీ.. పవన్ కల్యాణ్‌తో సంప్రదిపులు జరిపింది. జనసేనను.. బీజేపీలో విలీనం చేయాలనే ప్రతిపాదనలు పెట్టింది. పవన్ కల్యాణ్.. తానా సభల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లినప్పుడు.. అక్కడ రామ్ మాధవ్‌తో కూడా చర్చలు జరిపారు. ప్రాంతీయ పార్టీలు మనుగడ సాగించలేవని.. బీజేపీలో విలీనం చేయాలనే ప్రతిపాదన పెట్టినట్లుగా ప్రచారం జరిగింది. అయితే.. పవన్ కల్యాణ్ అంగీకరించలేదని చెబుతారు. ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్ని చూస్తే.. బీజేపీకి నమ్మకమైన మిత్రపక్షం కాగలిగేది.. జనసేన మాత్రమే. అందుకే.. పవన్ కల్యాణ్ విషయంలో ఆ పార్టీ నేతలు సాఫ్ట్ గా ఉంటారు. ఈ పరిణామాలన్నీ చూస్తే.. ఏపీలో ఓ కొత్త రాజకీయం.. తెర ముందుకు రావడం ఖాయంగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close