రేవంత్ విమ‌ర్శ‌లు ఓకే.. కాంగ్రెస్ విధాన‌మేంటి..?

ఆర్టీసీ కార్మికుల స‌మ్మె వ్య‌వ‌హారం ఇంకా బిగుసుకునే అవ‌కాశాలే క‌నిపిస్తున్నాయి. కేబినెట్ స‌మావేశంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న నిర్ణ‌యం ఏంటో స్ప‌ష్టంగా చెప్పేశారు. ప్రైవేటీక‌ర‌ణ‌వైపే మొగ్గుచూపుతున్నార‌న్న‌ది సుస్ప‌ష్టం. అయితే, ఇదే స‌మ‌యంలో దాదాపు 50 వేల మంది ఆర్టీసీ ఉద్యోగుల ప‌రిస్థితి ఏంటీ, మ‌ర‌ణించిన వారి కుటుంబాల ప‌ట్ల క‌నీస సానుభూతైనా వ్య‌క్తం చేయ‌లేదు. ఇక‌, రాజ‌కీయంగా చూసుకుంటే… ఆర్టీసీ కార్మికుల స‌మ‌స్య‌ను భాజ‌పా సీరియ‌స్ గా తీసుకుని కార్యాచ‌ర‌ణ‌కు సిద్ధ‌మైంది. కేంద్రం జోక్యానికి రంగం సిద్ధం చేస్తోంది. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అనేది ప్ర‌శ్న‌?

కేబినెట్ భేటీపై ఎంపీ రేవంత్ రెడ్డి స్పందిస్తూ… కేసీఆర్ తీరులో అడుగ‌డుగునా అహంకారం కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తోంద‌న్నారు. 16 మంది కార్మికులు చ‌నిపోతే వారిపై క‌నీస‌ సానుభూతి లేక‌పోవ‌డం అమాన‌వీయం అని విమ‌ర్శించారు. ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్న‌వారికి ధైర్యం చెప్పే ప్ర‌య‌త్న‌మే లేద‌నీ, ఇక‌పై తెలంగాణ స‌మాజం కేసీఆర్ ని భ‌రించ‌లేద‌న్నారు. బ‌తికితే బ‌త‌కండీ, లేక‌పోతే చావండి అన్న‌ట్టుగా నియంత‌లా ముఖ్య‌మంత్రి వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నీ, రాచరికం రోజుల్లో కూడా ఇలాంటి దారుణ‌మైన ప‌రిస్థితులు చూడ‌లేద‌న్నారు. ఆర్టీసీని కొంత‌మంది పెద్ద‌ల‌కు అమ్మేయ‌డానికి కేసీఆర్ నిర్ణ‌యించుకుని, నెపాన్ని కార్మికులూ ప్ర‌తిప‌క్ష పార్టీల‌పై నెట్టేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ మండిప‌డ్డారు.

ఇలా రేవంత్ త‌న‌దైన ధోర‌ణిలో ముఖ్య‌మంత్రి తీరుపై తీవ్రంగా విమ‌ర్శ‌లు చేశారు. ఈ విమ‌ర్శ‌లు ఓకే… ఇప్పుడు పార్టీప‌రంగా కాంగ్రెస్ ఏదో ఒక‌టి చెయ్యాల్సిన అవ‌స‌రం వారికీ ఉంది. ఎందుకంటే, ఇదే అదనుగా భాజ‌పా చురుగ్గా స్పందిస్తూ… రాష్ట్రంలో మేమే ప్ర‌త్యామ్నాయంగా ఉన్నామ‌ని నిరూపించుకునేందుకు ఈ సంద‌ర్భాన్ని ఒక అవ‌కాశంగా మార్చుకునే ప్ర‌య‌త్నంలో ఉంది. క‌రెక్టేగానీ, కాంగ్రెస్ అధికారంలో లేదుక‌దా ఏం చేస్తుందీ అనిపించొచ్చు! రాష్ట్ర స్థాయిలో కార్మికుల‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నామ‌నే భ‌రోసా వారికి క‌లిగేలా కార్యాచ‌ర‌ణ ఉండాలి. ప్ర‌స్తుతం అదే ప‌నిచేస్తున్నారు క‌దా అనిపించొచ్చు. అలా అని కాంగ్రెస్ నేత‌లు అనుకుంటున్నారేమోగానీ, వాస్త‌వంలో వేరే విధంగా క‌నిపిస్తోంది. కార్మికుల‌కు మ‌ద్ద‌తుగా ప్ర‌గ‌తి భ‌వ‌న్ ముట్ట‌డి కార్య‌క్ర‌మాన్నే తీసుకుంటే, అది కేవ‌లం కాంగ్రెస్ కార్య‌క్ర‌మంగా, రేవంత్ రెడ్డి సెంట్రిక్ గా మాత్ర‌మే జ‌రిగింది. దాన్లో కార్మికుల ఆవేద‌న హైటైల్ కాలేదు. రాష్ట్ర‌స్థాయిలో కేసీఆర్ స‌ర్కారు మీద ఆర్టీసీ అంశ‌మై కాంగ్రెస్ పార్టీ పెంచిన ఒత్తిడి అంటూ చెప్పుకోవ‌డానికి ఏం క‌నిపించ‌దు! అంటే, ప్ర‌తిప‌క్షంగా స‌మ‌స్య‌ల ప‌ట్ల ప్ర‌భుత్వాన్ని గ‌ట్టిగా నిల‌దీసే సంద‌ర్భం వ‌చ్చినా, కాంగ్రెస్ నిల‌బ‌డ‌లేక‌పోయింద‌నే అభిప్రాయ‌మే క‌లుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close