నాగ్ చెబుతున్నాడు..! ఒట్టు..నమ్మండి..!

బిగ్ బాస్ విజేతపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్ని నమ్మకండి. ఇంకా ఫైనల్ డే షూటింగ్ జరగలేదు.. అంటూ.. బిగ్ బాస్ -3 హోస్ట్ నాగార్జున ట్వీట్ చేశారు. ఇప్పటికే.. సోషల్ మీడియాలో … రాహుల్ సిప్లిగంజ్ విన్నరని.. హోరెత్తిపోతోంది. అందరూ ఆయనే విన్నరని డిసైడైపోయారు. దీంతో.. ఇప్పటికే అంతంత మాత్రం రేటింగ్స్‌తో సాగిన బిగ్ బాస్.. చివరి ఎపిసోడ్ కూడా.. తేలిపోతుందని భయపడ్డారేమో కానీ.. నిర్వాహకులు.., ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేకెత్తించడానికి ఏకంగా నాగార్జునతోనే ట్వీట్ చేయించినట్లున్నారు. కానీ.. బిగ్ ఎలినిమిషన్స్ ప్రారంభమైనప్పటి నుండి.. సోషల్ మీడియాలో వచ్చిన వార్తల్లో.. ఒక్కటీ కూడా తప్పు కాలేదు. ఎప్పుడెప్పుడు ఎవరెవరు ఎలిమినేట్ అవుతారో.. రెండు రోజుల ముందుగానే సోషల్ మీడియాలో తెలిసిపోయింది.

ఇప్పుడు.. చాలా వరకూ.. శ్రీముఖి విన్నర్ గా నిలుస్తుందన్న ప్రచారం జరిగింది. కానీ.. చివరికి రాహుల్ సిప్లిగంజ్‌కే అత్యధికంగా ఓట్లు వచ్చినట్లుగా… ఆయనే విన్నర్ అవుతున్నట్లుగా లెక్కలతో సహా.. సోషల్ మీడియాలో పోస్టింగులు కనబడుతున్నాయి. ఆయననే విజేతగా డిక్లేర్ చేస్తూ..అందరూ అభినందనలు కూడా చెబుతున్నారు. ఈ క్రమంలో నాగార్జున ట్వీట్‌ … ఆసక్తి పెంచే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. బిగ్‌బాస్ షోకు మొదటి నుంచి ఈ లీకుల సమస్య ఉంది. మొదటి సీజన్… పుణెలో షూట్ చేసి.. అక్కడే ఎడిట్ చేయడంతో.. లీకుల సమస్య పెద్దగా లేదు. కానీ రెండో సీజన్, మూడో సీజన్ హైదరాబాద్‌లోనే కానిచ్చేస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియో పక్క నుంచి వెళ్లేవాళ్లకి.. అక్కడ బిగ్ బాస్ వ్యవహారం నడుస్తోందని..అర్థమైపోతుంది.

ఇక సాంకేతిక సిబ్బందిలో.. అరవై శాతం తెలుగువాళ్లే.. స్థానికలే ఉన్నారు. వారిలో ఏ ఒక్కరు చిన్న సమాచారం లీక్ చేసినా.. చాలు సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. అలా లీకులు అవుతూనే ఉన్నాయి. కానీ స్టార్ మా యాజమాన్యం కట్టడి చేయలేకపోయింది. దీంతో.. షో పై ఆసక్తి కూడా తగ్గిపోయింది. గోగినేని బాబు లాంటి మాజీ కంటెస్టంట్లు కూడా.. ఇదే విషయాన్ని చెప్పారు. అన్నపూర్ణ స్టూడియో పక్క వీధిలో ఉన్న వారికే.. ఎప్పుడేం జరిగిపోతోందో తెలిసిపోతోందని.. దాని వల్ల.. ఆసక్తి ఏముంటుందని… ప్రశ్నించారు. ఇప్పుడు అదే సమస్య…నాగార్జున నమ్మవద్దని ప్రకటించినప్పటికీ.. రాహులే విజేతని.. జనం నమ్ముతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close