మాధవ్ వీడియోను ఇక టీడీపీ వదలదా !?

మాధవ్ వీడియో ఒరిజినల్ కాదు కాబట్టి .. అందులో ఉన్నది ఎవరో చెప్పలేమని అనంతపురం ఎస్పీ చెప్పారు. ఆ వీడియోను ఫోరెన్సిక్‌ను పంపలేదన్నారు. దీంతో టీడీపీ నేతలు అమెరికాలోని ప్రసిద్ధ ఫోరెన్సిక్ ల్యాబ్‌ను సంప్రదించి.. ఓ సర్టిఫికెట్ తీసుకచ్చారు. ఆ సర్టిఫికెట్‌ను మీడియా ముందు ప్రవేశ పెట్టారు. తాము అమెరికా ఫోరెన్సిక్ ల్యాబ్‌లో టెస్ట్ చేయించామని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరాం ప్రకటించారు. అమెరికా ఫోరెన్సిక్ ల్యాబ్‌లో నిర్వహించిన టెస్టులో ఆ వీడియో పూర్తి స్థాయిల ఒరిజినల్ అని తేలిదంన్నారు. అలాగే ఎలాంటి ఎడిటింగ్ లేదని కూడా స్పష్టమైందన్నారు.

మాధవ్ ఎపిసోడ్ విషయంలో ప్రభుత్వం పూర్తిగా బద్నాం అయిపోయింది. ఆ వీడియో ఫేక్ అని ఒక్కరంటే ఒక్కరూ నమ్మడం లేదు. వైసీపీ నేతలు కూడా నిజమైనదేనని అనుకుంటున్నారు. కానీ ఒప్పుకుంటే మొదటికే మోసం వస్తుందని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు కూడా అది ఫేక్ కాదని డిసైడైపోయారు. ప్రభుత్వమే అబద్దం చెబుతోందని నిర్ణయానికి వచ్చేశారు. అంటే..ప్రభుత్వం దాదాపుగా బద్నాం అయిపోయింది.మాధవ్‌తో పాటు ప్రభుత్వమూ తప్పు చేసిందని ఎక్కువ మంది భావిస్తున్నారు.

అయితే టీడీపీ మాత్రం ఇంకా అది రియలేనని నమ్మించాలన్న ప్రయత్నాలు చేస్తోంది. అమెరికా నుంచి రిపోర్టులు తెచ్చి హడావుడి చేస్తోంది. ఇలాంటి సమయంలో.. అది నిజం అని నమ్మించే ప్రయత్నం చేస్తే వైసీపీ వాళ్లు అది ఫేక్ అని మరింతగా ఎదురుదాడికి దిగుతారు. అదే చేస్తున్నారు. మాధవ్ ఎపిసోడ్‌లో అధికార పక్షం పూర్తిగా బ్లేమ్ అయినప్పుడు.. భిన్నమైన వ్యూహం టీడీపీపెట్టుకోవచ్చు కానీ.. ఎందుకు అది నిజమేనని నమ్మించే ప్రయత్నం చేస్తుందో టీడీపీ నేతలకూ అర్థం కాని విషయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంతకీ లాయర్లకు ఏపీ ప్రభుత్వం పెట్టిన ఖర్చెంత!?

కింది కోర్టుల, జిల్లా కోర్టులు, సీబీఐ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఇలా న్యాయస్థానాలన్నింటిలో ఏపీ ప్రభుత్వ కేసులు వందలు, వేలల్లో ఉంటాయి. కింది స్థాయిలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించుకుంటారు. కానీ హైకోర్టు,...

అమెరికాలో ఘోర ప్రమాదం – ముగ్గురు ప్రవాసాంధ్రులు మృతి !

అమెరకాలోని టెక్సాస్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో ముగ్గురు ప్రవాసాంధ్రులు చనిపోయారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) బోర్డు డైరెక్టర్ డాక్టర్ కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ భార్య యలమంచిలి వాణిశ్రీ, ఆయన ఇద్దరు...

కేసీఆర్ అంచనాల్ని అందుకోలేకపోయిన ప్రశాంత్ కిషోర్ !

ఐ ప్యాక్ అంటే తిరుగులేని పొలిటికల్ స్ట్రాటజీ కంపెనీ. దేశంలో ఉన్న ప్రతీ పార్టీ సేవలు అందుకోవాలని అనుకుంటుంది. ఐ ప్యాక్ కన్నా పీకే పైనే అందరికీ గురి. బెంగాల్ తర్వాత తాను...

సోషల్ మీడియాలోనూ దారి తప్పిన ఏపీ రాజకీయాలు !

తమలపాకుతో నువ్వకొటి అంటే.. తలుపు చెక్కతో నేను రెండు అంటా అన్నట్లుగా ఏపీలో రెండు పార్టీల నేతలూ.. సోషల్ మీడియా కార్యకర్తలు చెలరేగిపోతున్నారు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే రెండు పార్టీలకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close