పేదలకు ప్యాకేజీ ప్రకటించాలని టీడీపీ డిమాండ్..!

పేదలందరికి కుటుంబానికి రూ. ఐదు వేలు చొప్పున పంపిణీ చేయాలని తెలుగు దేశం పార్టీ డిమాండ్ చేసింది. కేంద్రం ఈ మేరకు రాష్ట్రాలకు సూచనలు చేసినా పట్టించుకోవడం లేదని మండి పడింది.రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు..లాక్ డౌన్ అంశాలపై చర్చించేందుకు తెలుగుదేశం పొలిట్ బ్యూరో సమావేశం అయింది.లాక్‌డౌన్‌ను నెలాఖరు వరకు పొడిగించాలని.. టీడీపీ పొలిట్‌బ్యూరో కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ తీర్మానం చేసింది. కూలీలు, పేదలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలిని డిమాండ్ చేశారు. ప్రజలు ఉపాధి కోల్పోయినా… అరకొర సాయంతో ప్రభుత్వం చేతులు దులుపుకుందని టీడీపీ మండిపడింది.కరోనాతో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని.. కరోనా వైద్యసేవలు అందిస్తూ మృతిచెందిన వారి కుటుంబాలకు.. రూ.50 లక్షలు ఇవ్వాలని తీర్మానం చేసింది.

ప్రజల కరెంట్‌, నీటి బిల్లులను రద్దు చేయాలని .. ఇతర రాష్ట్రాలు, దేశాల్లో చిక్కుకున్న తెలుగువారిని ఆదుకోవాలని డిమాండ్ చేసిది. అందరికీ ఉచితంగా కరోనా టెస్ట్‌లు చేయాలని సూచించింది. రైతుల సమస్యలపై టీడీపీ పొలిట్ బ్యూరో ప్రత్యేకంగా చర్చించింది. సీఎం అసమర్థత వల్ల రైతులు నష్టపోతున్నారని … ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి తక్షణం రైతుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేసింది. ఇప్పటికే రైతులు పంటను రవాణా చేసుకోలేక… అమ్ముకోలేక ఇబ్బంది పడుతున్నారని గుర్తు చేసింది. చంద్రబాబు ముందు చూపుతో ఏర్పాటు చేసిన మెడ్‌టెక్‌ జోన్‌ ఫలితం దేశమంతా ఉపయోగపడుతోందని పొలిట్ బ్యూరో అభినందించింది.

ఓ వైపు…వైసీపీ నేతలు.. జాతీయ విపత్తు సమయంలోనూ.. విమర్శలు చేస్తున్నారని..చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలతో విరుచుకుపడుతున్నారు. అయినా… ప్రజల డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచాల్సిందేనని టీడీపీ.. నిర్ణయించుకుంది. ప్రజల కోసం చేసేదే రాజకీయమని..వారికి కష్టాలొచ్చినప్పుడు..ప్రభుత్వం వైపు నుంచి పని చేసేలా ఒత్తిడి చేయాల్సిన బాధ్యత తమపై ఉందని టీడీపీ నేతలంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్ అన్న కొడుకు క‌న్నారావుపై మ‌రో కేసు…

కేసీఆర్ అన్న కొడుకు క‌న్నారావుపై మ‌రో కేసు న‌మోదైంది. ఇప్ప‌టికే ల్యాండ్ క‌బ్జా కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటూ జైల్లో ఉన్న కాన్నారావు దౌర్జ‌న్యాలు ఒక్కోటిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. పోలీసు అధికారుల‌తో క‌లిసి...

బీఆర్ఎస్ నుండి టీఆర్ఎస్…! త్వ‌ర‌లోనే మార్పు

తెలంగాణ కోసం పుట్టిన పార్టీ... తెలంగాణ రాష్ట్రం కోస‌మే ఎగిరిన గులాబీ జెండా.. తెలంగాణ బాగు కోస‌మే తండ్లాట‌... ఇలా త‌మ పార్టీ గురించి కేసీఆర్ ఎంతో గొప్ప‌గా చెప్పుకుంటారు. నిజానికి తెలంగాణ...

ఈసారి మోడీ కష్టమే… బీజేపీకి ఝలక్ ఇచ్చిన ఎంపీ అభ్యర్థి..!!

లోక్ సభ ఎన్నికల్లో 400సీట్లు సాధిస్తామని బీజేపీ నేతలు ధీమాగా చెబుతున్నారు. బీజేపీ మెజార్టీ సీట్ల గెలుపునకు మోడీ ఛరిష్మా దోహదం చేస్తుందని ప్రకటిస్తున్నారు. దేశమంతా మోడీ వేవ్ ఉందని బలంగా...

బీఆర్ఎస్ లో టెన్షన్ .. బినామీ ఆస్తుల అమ్మకానికి నిర్ణయం..?

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చోటు చేసుకున్న అక్రమాల గుట్టు బయటపడుతుందని బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన నెలకొందా..? భూకబ్జాలకు పాల్పడిన నేతలు ఎలాంటి చిక్కులు రాకుండా ఉండేందుకు ప్లాన్ చేస్తున్నారా..? అంటే అవుననే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close