కోమటి జయరాం కి మాతృ వియోగం, పలువురి సంతాపం

తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) మాజీ అధ్యక్షుడు, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రతినిధి, కోమటి జయరాం తల్లి కోమటి కమలమ్మ ఏప్రిల్ 9, గురువారం తెల్లవారుజామున(భారత కాలమానం) 2:15లకు కన్నుమూశారు. ఆమె వయస్సు 85 సంవత్సరాలు. కృష్ణాజిల్లా మైలవరం మాజీ ఎమ్మెల్యే దివంగత కోమటి భాస్కరరావు సతీమణి కమలమ్మ. కోమటి భాస్కరరావు ఎమ్మెల్యేగానే కాకుండా సమితి అధ్యక్షునిగా, మార్కెటింగ్ సొసైటీ అధ్యక్షుడిగా కోమటి భాస్కరరావు కృష్ణా జిల్లా రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారు. కోమటి భాస్కరరావు చిన్న కుమారుడు సుధాకర్ 1999 లో కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యే గా పోటీ చేయగా, మనవడు అప్పసాని సందీప్ 2009 లో కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యే గా పోటీ చేసారు. కరోనా వైరస్‍ కారణంగా అంతర్జాతీయ ప్రయాణాల మీద నిషేధం కారణంగా అమెరికా నుంచి ఇండియా వచ్చే అవకాశాలు లేకపోవడంతో అంత్యక్రియలకు ఇండియాకు వెళ్ళలేకపోతున్నందుకు చాలా బాధగా ఉందని జయరాం కోమటి తెలిపారు. కరోనా ఇబ్బందుల కారణంగా ఈరోజు ఉదయమే తల్లి అంత్యక్రియలను నిర్వహిస్తున్నట్లు చిన్నకుమారుడు సుధాకర్‍ కోమటి తెలిపారు. కాగా కమలమ్మ మృతి పట్ల అమెరికా, కెనడా,బ్రిటన్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా తదితర దేశాల నుంచి పలువురు ఎన్నారైలు జయరాం కుటుంబానికి తమ సంతాపాన్ని తెలిపారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close