న‌టుడు న‌ర్సింగ్ యాద‌వ్ ప‌రిస్థితి విష‌మం

సినీ న‌టుడు న‌ర్సింగ్ యాద‌వ్ ప‌రిస్థితి విష‌మంగా ఉంది. ఆయ‌న కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. ఈరోజు సాయంత్రం ఆయ‌న కోమాలోకి వెళ్లిపోయారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లోని య‌శోదా ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయ‌న ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని, ప్ర‌స్తుతం వెంటిలేట‌ర్ మీద చికిత్స అందిస్తున్నామ‌ని వైద్యులు తెలిపారు. న‌ర్సింగ్ యాద‌వ్ ఈరోజు సాయింత్రం 4 గంట‌ల‌కు ఆయ‌న స్వ‌గృహంలో ప్ర‌మాద‌వ‌శాత్తూ కింద ప‌డిపోయార‌ని, దాంతో త‌ల‌కు గాయాలై ఆసుప‌త్రికి చేరుకున్నార‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. వీటిపై ఆయ‌న భార్య స్పందించాల్సివ‌చ్చింది. కొంత‌కాలంగా ఆయ‌న అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నార‌ని, ఈ రోజు ఉద‌యం డ‌యాలిసిస్ కూడా ఇచ్చార‌ని, అయితే స‌డ‌న్‌గా కోమాలోకి వెళ్లిపోయార‌ని చెప్పారు. తెలుగు సినిమాలో కామెడీ విల‌న్‌, కామెడీ రౌడీ పాత్ర‌ల‌కు న‌ర్సింగ్ యాద‌వ్ ప్ర‌సిద్ధి. చాలా సినిమాల్లో విల‌న్ గ్యాంగ్ లో ఒక‌డిగా క‌నిపించి మెప్పించారు నర్సింగ్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘జై హ‌నుమాన్‌’లో తేజా స‌జ్జా లేడా?

'హ‌నుమాన్తో' తేజా స‌జ్జా ఒక్క‌సారిగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇప్పుడు సీక్వెల్‌గా 'జై హ‌నుమాన్' రూపుదిద్దుకొంటోంది. ఇందులో తేజా స‌జ్జా ఉంటాడా, ఉండ‌డా? అనేది పెద్ద ప్ర‌శ్న‌. నిజానికి ఈ సినిమాలో...

RRR రికార్డ్ బ్రేక్ చేసిన ‘పుష్ష 2’

'పుష్ష 2' రికార్డుల వేట మొద‌లైంది. మొన్న‌టికి మొన్న 'పుష్ష 2' హిందీ డీల్ క్లోజ్ అయ్యింది. దాదాపు రూ.200 కోట్లు హిందీ రైట్స్ రూపంలో వ‌చ్చాయి. ఆడియో రైట్స్ విష‌యంలోనూ పుష్ష...
video

‘మిరాయ్‌’… 20 రోజుల్లోనే ఇంత తీశారా?

https://www.youtube.com/watch?v=xnubQ829q0c తేజ స‌జ్జా, కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని కాంబినేష‌న్ లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి 'మిరాయ్‌' అనే టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్టు తెలుగు 360 ముందే చెప్పింది. ఇప్పుడు అదే...

కోమ‌టిరెడ్డిలో మ‌రో కోణం… కొడుకు పేరుతో సేవ!

నిత్యం ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లు... వేలాది మంది కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు.. హ‌డావిడి. వైఎస్ హాయం నుండి వేగంగా ఎదిగిన మంత్రి కోమటిరెడ్డి, సేవా కార్య‌క్ర‌మాల్లోనూ నేనున్నా అని అండ‌గా ఉంటారు. ముఖ్యంగా కోమ‌టిరెడ్డి కుమార్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close