మార్చిలో రావాల్సిన సినిమా ‘పెద్ది’. ఏప్రిల్ 30 అన్నారు. కానీ.. సాధ్యం కాలేదు. జూన్లో `పెద్ది` విడుదల అంటూ చిత్రబృందం తేల్చేసింది. కానీ డేట్ మాత్రం ఖాయం చేయలేదు. జూన్ అనగానే అందరి కళ్లూ జూన్ 4పై పడ్డాయి. ‘టాక్సిక్’ రిలీజ్ డేట్ అది. ఆ సినిమా వాయిదా పడుతుందని, ఆ డేట్ ని ‘పెద్ది’ క్యాష్ చేసుకొంటుందని అనుకొన్నారు. ‘పెద్ది’ టీమ్ కూడా అందుకోసమే ఎదురు చూసింది. కానీ ఇప్పుడు మళ్లీ నిర్ణయం మార్చకొందని తెలుస్తోంది. జూన్ 25న ఈ సినిమాని విడుదల చేయాలని చిత్రబృందం ఫిక్సయ్యిందట. అధికారిక ప్రకటన ఈ నెలాఖరులోగా రావొచ్చు.
జూన్ 25 అన్నిరకాలుగా రైట్ డేట్. ఎందుకంటే అప్పటికి ‘టాక్సిక్’ వచ్చి వెళ్లిపోతుంది. పాన్ ఇండియా పరంగా సోలో రిలీజ్ డేట్ దొరుకుతుంది. పైగా.. ఐపీఎల్ గోల ఉండదు. దానికితోడు ఇంకా రెండు నెలల సమయం ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ కి, పబ్లిసిటీకి కావాల్సినంత సమయం ఉంటుంది. ‘పెద్ది’ని పాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేశ వ్యాప్తంగా ప్రెస్ మీట్లు, మీడియా ఇంట్రాక్షన్లు జరిపితే.. జనంలోకి బజ్ వెళ్లే అవకాశం ఉంది. అందుకు కొంత సమయం పడుతుంది. అందుకే జూన్ 4 కంటే, 25 బెటర్ అని చిత్రబృందం కూడా భావిస్తోంది. ఆర్.ఆర్. కోసం రెహమాన్ ఎక్కువ సమయం తీసుకొంటారు. ఆయనకూ కావాల్సినంత టైమ్ ఇచ్చినట్టు ఉంటుంది. సో.. జూన్ 25 న ‘పెద్ది’ రావడం దాదాపు ఖాయం అయినట్టే. అధికారిక ప్రకటన మాత్రం బాకీ.
ఈ సినిమాకు సంబంధించి 6 రోజుల షూటింగ్ బాకీ ఉందని చిత్రబృందం చెప్పింది. అందులో 2 రోజులు ‘రై.. రై రారా’ పాట కోసం కేటాయించారు. ఆ పాట ఇప్పుడు మొత్తం పూర్తయ్యింది. మరో నాలుగు రోజులు ఐటెమ్ గీతం కోసం వెచ్చిస్తారు. ఆ పాట త్వరలోనే షూట్ చేస్తారు.
