వైసీపీకి ఠాకూర్ ఎలాగో… టీడీపీకి సవాంగ్ అలా..!

చెప్పులు, రాళ్లు విసరడాన్ని భావప్రకటనా స్వేచ్చగా చెప్పి.. ఏపీ డీజీపీ గౌతం సవాంగ్… ట్రెండ్ సెట్టర్ కాప్ గా నిలిచారు. ఏం జరుగుతుందో చూద్దామని.. వైసీపీ కార్యకర్తలు, నేతల్ని చంద్రబాబు బస్సుపైకి వదిలామని.. సమర్థించుకోవడం… డీజీపీ విధినిర్వహణలోని మరో హైలెట్. నిన్న చంద్రబాబు బస్సుపై రాళ్లు , చెప్పులు విసిరిన వారి కన్నా… డీజీపీ సవాంగే…అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆయన తీరుపై.. సోషల్ మీడియాలో… సెటైర్లు పడటమే కాదు.. టీడీపీ నేతలు… తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు.బయటి వ్యక్తులు వచ్చి దాడి చేస్తే డీజీపీ వాళ్లని సపోర్ట్‌ చేయడమేమిటని మాజీ హోంమంత్రి చినరాజప్ప మండిపడ్డారు. జగన్ పాదయాత్రకు టీడీపీ ప్రభుత్వం కల్పించిన భద్రత విషయాన్ని గుర్తించి..పోలీసింగ్ అంటే ఎలా ఉండరో.. ఆయన అర్థం చెప్పారు.

చంద్రబాబుపై దాడికి డీజీపీ బాధ్యత వహించాలని.. టీడీపీ డిమాండ్ చేశారు.పోలీసుల లాఠీ.. రౌడీల చేతికి ఎలా వెళ్లిందని..టీడీపీ నేత నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. నిరసన తెలిపే హక్కు అందరికీ ఉందన్న డీజీపీ.. జగన్ పర్యటనలో మేం నిరసన తెలిపేందుకు అనుమతి ఇస్తారా అని నిలదీశారు. వైసీపీ వాళ్లకు మాత్రమే డీజీపీలా సవాంగ్‌ తీరు: ఉందని మండిపడ్డారు. సవాంగ్‌పై ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. శాంతిభద్రతలు కాపాడటంలో డీజీపీ విఫలమని టీడీపీ నేత వర్ల రామయ్య తేల్చారు.

టీడీపీ హయాంలో.. డీజీపీగా ఉన్న ఆర్పీ ఠాకూర్ పై.. వైసీపీ ఇలాగే విరుచుకుపడేది. కానీ.. ఠాకూర్ వ్యవహారశైలి ఇంత వివాదాస్పదంగా ఉండేది కాదు. రాజకీయ విమర్శలు పట్టించుకోనని.. సవాంగ్ ప్రెస్ మీట్ లో చెప్పి.. ఆయన రాజకీయ విమర్శలు చేయడం… విపక్షాల ఆగ్రహానికి కారణం అయింది. గతంలో సిన్సియర్ అధికారిగా పేరున్న సవాంగ్.. ఇలా… ఏకపక్షంగా.. వైసీపీ కార్యకర్తగా వ్యవహరిస్తారని ఊహించలేకపోతున్నామని.. టీడీపీ నేతలు అంతర్గత సంభాషణల్లో ఫీలైపోతున్నారు. విజయవాడలో కాల్ మనీ కేసు బయటకు వచ్చినప్పుడు… గౌతం సవాంగ్ విజయవాడ కమిషనర్ గా ఉన్నారు. అప్పుడు ..పనితీరుకు.. ఇప్పుడు పనితీరుకు.. అందరూ.. పోలికలు తెచ్చుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రివ్యూ: నిశ్శ‌బ్దం

తెలుగు360 రేటింగ్ 2/5 పొడుపు క‌థ వేయ‌డంలో కాదు. దాన్ని విప్ప‌డంలో అంత‌కంటే ఎక్కువ మ‌జా ఉంటుంది. థ్రిల్ల‌ర్ సినిమాలూ అంతే. అందులో చిక్కుముడులు కాదు. దాన్ని విప్పే విధానం ముఖ్యం. థ్రిల్ల‌ర్...

రివ్యూ: ఒరేయ్‌.. బుజ్జిగా

తెలుగు360 రేటింగ్ 2.25/5 క‌న్‌ఫ్యూజ్ డ్రామాలు భ‌లే బాగుంటాయి. దాంట్లోంచి బోలెడంత కామెడీ చేయొచ్చు. క‌థేమీ లేక‌పోయినా - ఆ గంద‌ర‌గోళంతోనే క‌థ న‌డిపేయొచ్చు. విజ‌య్ కుమార్ కొండా తీసిన `గుండె జారి...

తీరు మారకుంటే ఇతర అధికారాన్ని వినియోగిస్తాం..! ఏపీ సర్కార్‌కు హైకోర్టు హెచ్చరిక..!

హైకోర్టుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై హైకోర్టు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.ఈ అంశంపై జరిగిన విచారణలో రూల్‌ ఆఫ్‌ లా సరిగ్గా అమలు కాకుంటే...

హిమాన్షుకు గాయం..! అంతగా చర్చించుకున్నారేంటి..?

కేటీఆర్ కుమారుడు హిమాన్షు గుర్రపుస్వారీ చేస్తూండగా కిందపడి గాయాలయ్యాయి. ఆయనను హుటాహుటిన కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. కాలుకు ఓ మాదిరి గాయం అయిందని ఇతర చోట్ల స్వల్ప గాయాలయ్యాయని ప్రచారం జరిగింది. అయితే...

HOT NEWS

[X] Close
[X] Close