ప్రియాంక హత్య కేసు : అసలు నిందితులు పోలీసులే..!

ప్రియాంక రెడ్డి హత్య కేసులో పోలీసులు అచ్చం సినిమాల్లో వ్యవహరించినట్లే వ్యవహరించారు. అయితే.. హీరోయిక్ మూవ్ కాదు.. అచ్చంగా…అది బ్యాడ్ పోలీస్ రియాక్షనే. రాత్రి పన్నెండు గంటలకు ప్రియాంక రెడ్డి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయిస్తే.. వారి స్పందన అత్యంత ఘోరంగా ఉంది. పోలీసులు తమతో అమర్యాదగా ప్రవర్తించారని అమ్మాయి మిస్సైందని ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్తే.. ఎవరితో లేచిపోయిందో అని మాట్లాడారని ప్రియాంక తండ్రి కన్నీరుమున్నీరవుతున్నారు. మా పరిధిలోకి రాదని శంషాబాద్ పోలీసులు చెప్పారని రూరల్ పీఎస్‌లో ఫిర్యాదు చేయమన్నారన్నారు. అక్కడికి వెళ్తే ప్రియాంక అదృశ్యమైన ప్రాంతం శంషాబాద్‌కే వస్తుందన్నారని.. ఫిర్యాదు తీసుకోవడానికే రెండు, మూడు గంటలు తిప్పించారని ప్రియాంక తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.

పోలీసుల నుంచే తీవ్ర జాప్యం జరిగిందని .. ముందే పోలీసులు స్పందిస్తే మా అమ్మాయి బతికుండేదేమోనని కన్నీరు పెట్టుకుంటున్నారు. వంతెన కింద శవం కాలుతుందన్న సమాచారం వచ్చిన తర్వాతే పోలీసులు కేసు నమోదు చేశారు. వారు కదిలే సరికే ఘోరం జరిగిపోయింది. ప్రియాంక రెడ్డి హత్య కేసులో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పాషా అనే లారీ డ్రైవర్ తో పాటు క్లీనర్లు నలుగురు కలిసి ప్రియాంక రెడ్డిపై అత్యాచారం హత్య చేసినట్లుగా గుర్తింంచారు.

నిందితులు మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు. టోల్ ప్లాజా వెనకాల ఉన్న ఖాళీ ప్రదేశంలో ప్రియాంకరెడ్డిని రేప్ చేసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.

ప్రియాంక రెడ్డిని కిరోసిన్ తో కాల్చి చంపినట్లు పోస్టుమార్టం రిపోర్ట్‌లో గుర్తించారు. కిరోసిన్ అని తేలడంతో లారీ డ్రైవర్లే చంపినట్టు నిర్ధారణకు వచ్చారు పోలీసులు. ప్రియాంకరెడ్డి హత్య ఘటన… దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అత్యంత దారుణంగా.. ఒంటరిగా అమ్మాయి కనబడితే.. తోడేళ్ల మాదిరిగా.. అత్యాచారం చేసి చంపిన ఘటన..సభ్యసమాజంలో భయాందోళనలు నింపుతోంది. సోషల్ మీడియాలోనూ ఇదే టాపిక్ ట్రెండింగ్ అవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రముఖులకు కరోనా ..! ఏది నిజం..? ఏది అబద్దం..?

బ్రిటన్ ప్రధానమంత్రి కూడా కరోనా సోకింది. అయితే ఆయన దాచి పెట్టుకోలేదు. ప్రజల ముందు పెట్టారు. కానీ.. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నేతలకు మాత్రం... అందుకు మినహాయింపు అయినట్లుగా ఉంది. తమకు వస్తే...

కోన వెంక‌ట్ గాలి తీసేసిన వైఎస్సార్‌

కోన వెంక‌ట్ వైకాపా సానుభూతి ప‌రుడు. జ‌గ‌న్ కి ఓ ర‌కంగా భక్తుడు. ఆప్రేమ వైఎస్సార్ నుంచే వ‌చ్చింది. వీలున్న‌ప్పుడ‌ల్లా ఆయ‌న గొప్ప‌ద‌నాన్ని గుర్తు చేసుకుంటూనే ఉంటాడు కోన వెంక‌ట్. ఈ రోజు...

అప్పుడు ఫ్లాపే.. కానీ ఇప్పుడు హిట్టు

కొన్ని సినిమాలంతే. వెండి తెర‌పై చూస్తున్న‌ప్పుడు ఒక‌లా ఉంటాయి. ఇంట్లో టీవీలో చూస్తున్న‌ప్పుడు మ‌రోలా క‌నిపిస్తాయి. 'సినిమా బాగానే ఉంది క‌దా.. ఎందుకు ఆడ‌లేదో' అనే అనుమానాలు వ‌స్తాయి. ఇంకొన్ని వెండి...

ప్రైవేటు ఆస్పత్రికి అచ్చెన్న..!

అచ్చెన్నాయుడిని ప్రవైటు ఆస్పత్రికి తరలిచాలని హైకోర్టు ఆదేశించింది. తన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని .. ప్రైవేటు ఆస్పత్రికి తరలించేలా ఆదేశాలివ్వాలంటూ... అచ్చెన్న పెట్టుకున్న పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు...

HOT NEWS

[X] Close
[X] Close