డీపీ భక్తీ ప్రదర్శించేసిన టీడీపీ !

ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఆకర్షించడానికి తెలుగుదేశం తంటాలు పడుతుందో.. లేకపోతే ఇప్పుడిప్పుడే మెరుగుపడుతుతున్న సంబంధాల్ని మరింత ముందుకు తీసుకెళ్లాలనుకుంటుందో కానీ.. కొన్ని విషయాలను పాటించేస్తున్నారు. తాజాగా తెలుగుదేశం పార్టీ తమ సోషల్ మీడియా అకౌంట్లన్నింటికీ డీపీలు మార్చేసింది. త్రివర్ణ పతాకాన్ని ఉంచింది. పార్టీ.. అనుబంధ విభాగాలు.. చంద్రబాబు, లోకేష్ ఇలా అందరి డీపీల్లో జాతీయ జెండా మాత్రమే కనిపిస్తోంది.

అజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా అందరూ డీపీలు మార్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. ఆగస్టు రెండో తేదీ నుంచి ఈ డీపీలు మార్చుకోవాలని పిలుపునిచ్చారు. అయితే తెలుగుదేశం పార్టీ నేతలు మొదట పట్టించుకోలేదు. ఇప్పుడు మార్చుకున్నారు. అజాదీ కా అమృత్ మహోత్సవాల కమిటీ మెంబర్‌గా ఉండి.. ప్రధాని ఇచ్చిన పిలుపునకు స్పందించకపోతే విమర్శలు వస్తాయన్న కారణంగా టీడీపీ ఈ డీపీలు మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది.

తెలుగు రాాష్ట్రాల్లో ఇలా మోదీ పిలుపు మేరకు డీపీలను ఏ ఇతర రాజకీయ పార్టీ మార్చుకోలేదు. బీజేపీతో పాటు ఆ పార్టీ నేతలు డీపీలు మార్చుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఆ పార్టీ నేతలు ఎలాంటి మార్పులు తమ సోషల్ మీడియా ఖాతాల్లో చేసుకోలేదు. డీపీలు మార్చితే జీడీపీలు పెరుగుతాయా అని టీఆర్ఎస్ నేతలు బీజేపీ నేతల తీరుపై విమర్సలు చేస్తున్నారు. కానీ టీడీపీ మాత్రం ఎలాంటి విమర్శలు చేయకుండా డీపీ భక్తిని ప్రదర్శించేసుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

” అగ్రిగోల్డ్ ” బాధితులూ ” అన్న హామీ “ని గుర్తు చేస్తున్నారు. !

పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు చేయక జగన్ నిండా మునిగిపోతున్నారు. హామీలు పొందిన వారు ఎదురు చూసి రోడ్డెక్కుతున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మొదటి బడ్జెట్‌లోనే అగ్రిగోల్డ్ బాధితులకు రూ....

హిందూపురం ఉపఎన్నికతో అన్నింటికీ చెక్ !

న్యూడ్ వీడియో వివాదం కారణంగా ఏర్పడిన డ్యామేజీని.. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట‌్టేందుకు వైసీపీ హైకమాండ్ ఉపఎన్నిక ఆలోచన చేసే చాన్స్ కనిపిస్తోంది. ఆ వీడియో...

రేవంత్‌కి ఇదే లాస్ట్ చాన్స్ !

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన మొదట్లో ఆయనను పార్టీ నేతలు బయటకు రానిచ్చేవారు కాదు. కనీసం అభిప్రాయాలు చెప్పడానికి ప్రెస్మీట్ పెట్టే అవకాశం లభించేది కాదు. ప్రజల్లో ఆయనకు ఉన్న పాపులారిటీని...

మోడీతో ఫైట్ : కేసీఆర్‌ది మొండి ధైర్యమా ? అతి నమ్మకమా ?

దేశంలో ఇప్పుడు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మోడీ ఢీకొట్టే లీడర్ లేడు. ఆయనకు త్రివిధ దళాలుగా చెప్పుకునే సీబీఐ, ఐటీ, ఈడీ ఉంటే ఉండవచ్చుగాక. అవి మాత్రమే కాదు ఎన్ని పన్నులు బాదేస్తున్నా.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close