రాజకీయ పార్టీలు అధికారంలో ఉంటే మహర్దశ పడుతుంది. పార్టీకి విరాళాలు కుప్పలు, తెప్పలుగా వచ్చిపడతాయి. దానికి కారణం అధికారమే. విపక్షంలో ఉంటే అసలు పట్టించుకోరు. కానీ కొన్ని పార్టీలు భిన్నంగా ఉంటాయి.అలాంటి వాటిలో టీటీడీ, వైసీపీ రెండూ ఉంటాయి. టీడీపీ విజయం సాధించిన తర్వాత .. ఆ పార్టీకి విరాళాలు తగ్గిపోయాయి. గత ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.83 కోట్లు వచ్చాయి. ప్రతిపక్షంలో ఉన్న అంతకు ముందు ఏడాదితో పోలిస్తే కనీసం రూ. 17 కోట్లుకుపైగా తగ్గిపోయాయి. విరాళాల వివరాలను టీడీపీ ఎన్నికల సంఘానికి అందించింది.
జనసేన పార్టీకి రూ. 25 కోట్ల విరాళాలు వచ్చాయి. కానీ ఓడిపోయినా వైసీపీకి మాత్రం రూ. 140కోట్లకుపైగా విరాళాలు వచ్చాయి.కొన్ని ప్రత్యేకమైన ఎలక్టోరల్ ట్రస్టుల ద్వారా వైసీపీకి ఈ విరాళాలు వచ్చాయి. ఆ ట్రస్టులకు కొంత మంది.. ఫలానాపార్టీకి మాత్రమే ఇవ్వాలి అని చెప్పి నిధులిస్తారు. అలా వైసీపీకే అవి ఆ పార్టీకి చేర్చారు. ఎన్నికల్లో పెట్టిన ఖర్చుల చెల్లింపుల కోసం వీటిని వాడి ఉంటారు. తన వద్ద డబ్బుల్లేవని పార్టీకి నడపడం కష్టంగా ఉందని జగన్ ఓ సారి జోక్ చేశారు.
బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఘోరంగా ఉంది. ఆ పార్టీకి గత ఆర్థిక సంవత్సరంలో రూ. 15 కోట్ల విరాళాలుకూడా రాలేదు. అధికారంలోఉన్న కాలంలో ఆ పార్టీకి క్యాష్ ఫెస్టివల్ జరిగేది. స్వయంగా కేసీఆర్ తమ పార్టీ అత్యంత ధనికమైనదని ప్రకటించుకున్నారు. సొంత విమానం కూడా ఉందని చెబుతారు. రూ. వెయ్యికోట్ల వరకూ నిధులు ఆ పార్టీ దగ్గర ఉన్నాయి.