నెక్ట్స్ ఎలక్షన్ పోరాటానికి టీడీపీకి “ఊహించని కిక్ స్టార్ట్” !

ఎన్నికల పోరాటానికి రాజకీయ పార్టీలు ముహుర్తం పెట్టుకుని సభలో..సమావేశాలో పెట్టి ప్రారంభోత్సవాలు చేసుకుంటాయి. అయితే వచ్చే ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ పోరాటానికి వైసీపీనే ముహుర్తం పెట్టింది. తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై వైసీపీ కార్యకర్తలు దాడి చేయడంతో దాన్నే అవకాశంగా మల్చుకున్న చంద్రబాబు 36 గంటల దీక్ష చేశారు. ఓ వైపు కొడుతూంటే.. చంద్రబాబు దీక్షలేంటి అని సెటైర్లు వేసుకున్న వాళ్లు ఉన్నారు కానీ.. 36 గంటలు ముగిసే సరికి తెలుగుదేశం పార్టీలో ఎక్కడా లేని ఉత్సాహం కనిపిస్తోంది. అధికార పార్టీ ఎన్ని దాడులు చేసినా.. ఎన్ని కేసులు పెట్టినా పోరాటమే ఇక మార్గమని వారు డిసైడయ్యారు. కదిలి వచ్చారు.

అన్‌ ఎక్స్‌పెక్టెడ్‌గా చేపట్టిన దీక్షనే అయినా .. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వచ్చారు. ఆ ఉత్సాహం ఊహించని విధంగా సాగింది. ఏ ఒక్క నేత కూడా బేలగా కనిపించలేదు. ప్రసంగాల్లోనూ దమ్ముంటే రంటే చూసుకుదామని సవాల్ చేశారు. అధికారంలోకి వస్తామన్న ధీమా ప్రతి ఒక్కరిలో కనిపించింది. పట్టాభి వాడిన పదాన్ని రీ సౌండ్‌లో వినిపించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రెండున్నరేళ్లుగా ఎదుర్కొంటున్న దాడుల్లో కసి ఇప్పుడిప్పుడే బయటకు రావడం ప్రారంభమయిందని ఆ పార్టీ నేతలు సంతృప్తిగా ఉన్నారు.

చంద్రబాబు అధికారంలో ఉంటే.. లా అండ్ ఆర్డర్ పేరు చెప్పి పార్టీ నేతల్ని గీత దాటనీయకుండా కంట్రోల్ చేస్తారు. ఈ సారి అలాంటి పరిస్థితి ఉండబోదని.. కార్యకర్తల కసిని తాను ఆర్థం చేసుకుంటానన్న సందేశాన్ని చంద్రబాబు నేరుగానే పంపారు. ఆయన ఎదురుగానే ఎంతో మంది నేతలు ..అధికారంలోకి రాగానే ప్రతీకారం ఖాయమన్న సంకేతాలు పంపారు. ఎవర్నీ వారించలేదు. నారా లోకేష్ కూడా అదే తరహాలో ప్రసంగించడం అందర్నీ ఆకట్టుకుంది. క్యాడర్‌లో గత రెండున్నరేళ్లలో లేని స్థైర్యాన్ని తీసుకొచ్చింది.

వైసీపీ నేతలు ఎన్ని బూతులు తిట్టారో లెక్కలేదు. ఇప్పటికీ తిడుతూనే ఉన్నారు. చంద్రబాబు మీద బాంబులేస్తామంటున్నారు. ఇవన్నీ కళ్ల ముందు ఉన్నా.. సీఎంను అనకపోయినా… సజ్జలను పట్టాభి అన్నమాటను పట్టుకుని సీఎం స్వయంగా తనను అన్నారని చెప్పుకోవడం.. ఆ పేరుతో టీడీపీపై దాడులు చేయడం.. ఓ రకంగా టీడీపీకే కలిసి వస్తోంది. సెంటిమెంట్ రచ్చగొట్టి..భావోద్వేగంతో ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమిద్దామనుకుంటే రివర్స్ అయి .. టీడీపీకి వచ్చే ఎన్నికల పోరాటానికి సన్నద్ధమయ్యేలా గొప్ప లాంఛింగ్ కార్యక్రమాన్ని ఇచ్చినట్లుయిందన్న భావన వైసీపీలోనే ప్రారంభమయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close