కడపలో అయినా ఇల్లలకగానే పండుగ కాదు స్మీ!

ఇల్లలకగానే పండుగకాదన్నట్లు, వైకాపా ఎమ్మెల్యేలను చేర్చుకోగానే తెదేపా పండగ చేసుకొనే పరిస్థితి లేదు. ముందు ఊహించినట్లుగానే పార్టీలో పాత, కొత్త నేతల గ్రూపుల మధ్య సిగపట్లు మొదలయిపోయాయి. కొన్ని రోజుల క్రితమే తెదేపా సీనియర్ నేత శిల్పా మోహన్ రెడ్డి అనుచరుడిపై భూమా నాగిరెడ్డి వర్గం దాడి చేసిందని పెద్ద గొడవ జరిగింది. మళ్ళీ ఇవ్వాళ్ళ బద్ధ విరోదులయిన రామసుబ్బారెడ్డి, ఆదినారాయణ గ్రూపులు కడప జిల్లాలో గొడవపడ్డాయి. రామసుబ్బారెడ్డి, ఎంపి సి.ఎం. రమేష్ తో కలిసి కడప జిల్లాలో ఆదినారాయణ రెడ్డి వర్గానికి పట్టున్న ప్రాంతాలుగా పేరుపడ్డ పెద్దదండ్లూరు, సిరిగేపల్లి గ్రామాలలో పర్యటించదానికి వచ్చినప్పుడు, ఆదినారాయణ రెడ్డి వర్గం ఆగ్రహంతో వారిపై రాళ్ళతో దాడి చేసింది. ఆ దాడిలో రామసుబ్బారెడ్డి వర్గానికి చెందిన కొందరు గాయపడ్డారు. ఆ కారణంగా ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇటువంటివేవో జరిగే అవకాశం ఉందని ముందే భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినా జరగకూడనిది జరిగిపోయింది.

సీనియర్ తెదేపా నేత అయిన తనపై కొత్తగా పార్టీలో చేరిన ఆదినారాయణ రెడ్డి వర్గం రాళ్ళతో దాడిచేసినందుకు రామసుబ్బారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. అభిమానులు ఆహ్వానిస్తేనే తను అక్కడికి వచ్చేను తప్ప వేరే ఉద్దేశ్యంతో కాదని అన్నారు. ఆదినారాయణ రెడ్డి మళ్ళీ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడితే సహించబోనని హెచ్చరించారు. ఈ సంఘటన గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి పిర్యాదు చేస్తానని చెప్పారు.

తన చిరకాల రాజకీయ ప్రత్యర్ధి అయిన ఆదినారాయణ రెడ్డిని పార్టీలోకి తీసుకోవద్దని, తీసుకొంటే అతని వలన తనకు రాజకీయంగా చాలా ఇబ్బందులు వస్తాయని రామసుబ్బారెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని చాలాసార్లు కోరారు. కానీ కడప జిల్లాలో వైకాపాను దెబ్బ తీయాలనే ఉద్దేశ్యంతో రామసుబ్బారెడ్డికి ఇష్టం లేకపోయినప్పటికీ ఆయనను బలవంతంగా ఒప్పించి ఆదినారాయణ రెడ్డిని పార్టీలో చేర్చుకొన్నారు. ఇప్పుడు జిల్లాలో వారి మధ్య ఆదిపత్యపోరు మొదలయింది. ఇంతవరకు కడప జిల్లాలో వైకాపాదే పైచెయ్యిగా ఉన్నప్పటికీ, తెదేపాలో ఇటువంటి సమస్యలు ఉండేవి కావు. జిల్లా నేతలందరూ వైకాపాని కలసికట్టుగా ఎదుర్కొంటూ ఉండేవారు. కానీ వైకాపా ఎమ్మెల్యేలు తెదేపాలో చేరిన తరువాత, వైకాపాకి జిల్లాలో చెక్ పెట్టడం మాట అటుంచి వారిలో వారే కీచులాడుకొంటున్నారు. ఇవన్నీ ముందే ఊహించినవే కనుక ఇప్పుడు చేయగలిగిందేమీ లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అత‌డు వ‌చ్చి.. ప‌దిహేనేళ్లు!

అత‌డు.. ర‌చ‌యిత‌గా, ద‌ర్శ‌కుడిగా త్రివిక్ర‌మ్ స‌త్తా చెప్పిన చిత్ర‌మ్‌. మ‌హేష్ స్టైలీష్ న‌ట‌న‌ని చూపించిన సినిమా. మేకింగ్‌లో.. కొత్త పుంత‌లు తొక్కించిన సినిమా. ఇప్ప‌టికీ.. ఆ సినిమా గురించి మ‌హేష్‌, త్రివిక్ర‌మ్ అభిమానులు...

చిరు చేప‌ల ఫ్రై.. సూప‌ర్ హిట్టు

లాక్ డౌన్ స‌మ‌యంలోనూ మ‌రింత యాక్టీవ్ గా క‌నిపిస్తున్నారు చిరంజీవి. ప్ర‌జ‌ల్ని చైత‌న్య ప‌రుస్తూ చిరు కొన్ని వీడియోలు చేశారు. పోలీసుల పిలుపు మేర‌కు ప్లాస్మా డొనేష‌న్ క్యాంపులో పాల్గొని.. వాళ్ల‌ని ఉత్సాహ...

ఏపీలో కరోనా మరణమృదంగం..! ఆపడానికి ప్రయత్నాల్లేవా..?

ఆంధ్రప్రదేశ్‌లో మరణాలు రెండు వేలు దాటిపోయాయి. గత రెండు రోజులుగా.. రోజుకు కొద్దిగా తక్కువగా వంద మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా వైరస్ అనేది ప్రాణాంతకం కాదని... చికిత్స చేస్తే పోతుందని ప్రభుత్వం...

“అప్పడం వ్యాక్సిన్” కనిపెట్టిన కేంద్రమంత్రికే కరోనా..!

కరోనా వైరస్‌కు ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తల దగ్గర్నుంచి భారతీయ జనతా పార్టీ నేతల వరకూ..అందరూ.. మందు కనిపెట్టే పనిలో బిజీగా ఉన్నారు. సైంటిస్టులు ఇంకా కుస్తీలు పడుతున్నారు కానీ.. భారతీయ జనతా పార్టీ...

HOT NEWS

[X] Close
[X] Close