టీడీపీలో “కర్నూలు” పంచాయతీ ఎవరో ఒకరు పార్టీ మారేదాకా తెగదా..?

కడప జిల్లా జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన రామసుబ్బారెడ్డి, ఆదినారాయణ రెడ్డిలను ఒకే ఒరలో ఇమడ్చగలిగిన .. టీడీపీ అధినేతకు.. మరికొన్ని నియోజకవర్గాలకు అంతకు మించిన సవాళ్లు సృష్టిస్తున్నాయి. వీటిలో ఎక్కువగా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వలస వచ్చిన నియోజకవర్గాలే ఉన్నాయి. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో.. టిక్కెట్లు ఆశిస్తున్న ఇద్దరు నేతలు.. ఒకరిపై ఒకరు పోటీ పడి విమర్శలు చేసుకుంటున్నారు. మధ్యలోకి లోకేష్‌ను తీసుకొస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి.. గత ఎన్నికల్లో…వైసీపీ తరపున పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన టీజీ వెంకటేష్‌పై విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన వైసీపీలోనే కొనసాగాలనుకున్నారు కానీ.. భూమా నాగిరెడ్డి సమీప బంధువు ఎస్వీ మోహన్ రెడ్డి కావడంతో.. భూమా పార్టీ మారిన తర్వాత.. ఆయనను కూడా జగన్ దూరం పెట్టారు. దీంతో .. టీడీపీలో చేరిపోవాల్సి వచ్చింది.

ఎస్వీ మోహన్ రెడ్డి టీడీపీలో చేరిన తర్వాత పరిస్థితుల్ని సరిదిద్దడానికి.. టీజీ వెంకటేష్‌కి..రాజ్యసభ అవకాశం కల్పించారు చంద్రబాబు. అయితే.. టీజీ మాత్రం.. తన కుమారుడు టీజీ భరత్‌ను.. రేసులోకి తీసుకొచ్చారు. తన కుమారుడుకి అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వాల్సిందేనని.. పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో కొద్ది రోజుల కిందట… కర్నూలు పర్యటనకు వచ్చిన లోకేష్‌.. ఎస్వీ మోహన్ రెడ్డికి అనధికారికంగా టిక్కెట్ ప్రకటించారు. అప్పట్నుంచి.. కర్నూలు పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది. గెలిచే వాళ్లకే టిక్కెట్ ఇస్తారని..అది తమకేనని టీజీ వెంకటేషన్ పదే పదే చెబుతున్నారు. పోటీ చేస్తే లోకేష్ పోటీ చేయాలి కానీ.. ఇతరులకు ఇస్తే ఒప్పుకోబోమని.. ఎస్వీ మోహన్ రెడ్డి అంటున్నారు.

ఈ క్రమంలో ఒకరిని పార్టీలోకి ఆకర్షించేందుకు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. కర్నూలులో ఆ పార్టీకి సరైన అభ్యర్థి లేరు. ఎస్వీ మోహన్ రెడ్డి పార్టీ మారిన ఓ తర్వాత ఓ ముస్లిం అభ్యర్థిని ఇన్చార్జ్‌గా పెట్టినప్పటికీ.. బలమైన అభ్యర్థి కారన్న ఆలోచన.. ఆ పార్టీ వర్గాల్లో ఉంది. టీజీ వర్గీయులకు.. వైసీపీ నేతలు.. ఆఫర్లు ఇవ్వడం ప్రారంభించారని చర్చ జరుగుతోంది. అదే సమయంలో.. కర్నూలు అసెంబ్లీ విషయంలో మరో ట్విస్ట్ కూడా.. ఉండే అవకాశం కనిపిస్తోంది. పార్టీలో చేరబోతున్న కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి వర్గం.. కూడా.. కర్నూలు టిక్కెట్‌ను డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో.. ఇప్పుడు… కర్నూలు అసెంబ్లీ టిక్కెట్ ఇష్యూ.. టీడీపీకి పరిష్కరించంలేని సమస్యగా మారుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...
video

‘మ‌న‌మే’ ఫ‌స్ట్ సింగిల్: సోలో లైఫే సోబెట‌రంటున్న శ‌ర్వా!

https://www.youtube.com/watch?v=XGJtiqVzZiA ఈమ‌ధ్య టాలీవుడ్ లో గ‌ట్టిగా వినిపిస్తున్న పేరు... హేష‌మ్‌ అబ్దుల్ వాహ‌బ్‌. 'ఖుషి', 'హాయ్ నాన్న‌' సినిమాల్లో సూప‌ర్ హిట్ పాట‌లు ఇచ్చారు. ఇప్పుడు శ‌ర్వానంద్ 'మ‌న‌మే' చిత్రానికీ ఆయ‌నే స్వ‌రాలు అందిస్తున్నారు....

ఇంకా “బలమైన” భ్రమల్లోనే కేటీఆర్ !

కేటీఆర్ నియోజకవర్గాల వారీ సమీక్ష సమావేశాల్లో రేవంత్ రెడ్డిని తిట్టి... ఎన్నికల్లో దున్నిపారేస్తామని ప్రసంగించి వెళ్లిపోతున్నారు. గ్రౌండ్ లెవల్లో పరిస్థితిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించడం లేదు. కనీసం ...
video

ట్రైల‌ర్ టాక్‌: ఫ్యామిలీమెన్ టూ మెంట‌ల్ మెన్‌

https://www.youtube.com/watch?v=xB7b3RzicUU విజ‌య్ దేవ‌ర‌కొండ అంటే ఎగ్రెసివ్‌నెస్ గుర్తొస్తుంది. అర్జున్ రెడ్డి నుంచి అది అల‌వాటైపోయింది. అయితే... త‌న‌లో కూల్ & కామ్ పెర్‌ఫార్మ‌ర్ ఉన్నాడు. దాన్ని బ‌య‌ట‌కు లాగే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు ప‌ర‌శురామ్. 'ఫ్యామిలీస్టార్‌'...

HOT NEWS

css.php
[X] Close
[X] Close