ఫీజు కోసం మోహన్‌బాబు ఇప్పుడు కోర్టుకెళ్లరా..?: టీడీపీ

ఫీజు రీఎంబర్స్‌మెంట్ పథకాన్ని పేరు మార్చి.. నిబంధనలు మార్చి.. ప్రజాధనాన్ని ప్రైవేటు కాలేజీలకు దోచి పెడుతున్నారని.. తెలుగుదేశం పార్టీ నేత ధూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు. అర్హత లేని కాలేజీల్లోనూ ఇష్టానుసారం ఫీజులు పెంచారని.. వైసీపీకి కావాల్సినవారి కాలేజీలకు ఇబ్బడి ముబ్బడిగా ఫీజులు పెంచి… అర్హత ఉన్న కాలేజీల్లో ఫీజులు తగ్గించారని ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ రావడం లేదన్న మోహన్‌బాబు ఇప్పుడు హైకోర్టుకు వెళ్లడంలేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏడాది పూర్తయిన సందర్భంగా టీడీపీ నేతలు.. ప్రభుత్వ లోటుపాట్లను.. ప్రత్యేకంగా వివరాలతో సహా మీడియా ముందు పెడుతున్నారు. పథకాల అమలుపై ధూళిపాళ్ల నరేంద్ర తీవ్రమైన విమర్శలు చేశారు.

గత ప్రభుత్వ పథకాలకే వైసీపీ ప్రభుత్వం పేర్లు మార్చుతోందని.. అన్నదాత సుఖీభవ పథకం పేరు మార్చి రైతు భరోసా ఇని పెట్టారని.. అయితే.. ప్రభుత్వ విధానాల వల్ల 23లక్షల మంది రైతులకు.. టీడీపీ హయాంలో లబ్దిదారులుగా ఉండి కూడా ఇప్పుడు పథకాలు పొందలేకపోతున్నారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం చేసేది గోరంత, ప్రచారం కొండంత అని మండిపడ్డారు. గతంలో ఉన్న స్కాలర్ షిప్ పథకానికి జగనన్న వసతి దీవెన , అమృతహస్తం పథకానికి జగనన్న గోరుముద్దగా మార్చారని విమర్శించారు. మేనిఫెస్టోలో పెట్టిన డ్వాక్రా రుణాలను ఇంతవరకు మాఫీ చేయలేదని … సున్నా వడ్డీకి కొంత సొమ్ము ఇచ్చి..గొప్పగా చెప్పుకుంటున్నారని విమర్శించారు.

వైఎస్‌, చంద్రబాబు హయాంలోనూ సున్నా వడ్డీ పథకం ఉందని .. సున్నా వడ్డీ కింద గత ప్రభుత్వం రూ.5లక్షలు ఇస్తే…వైసీపీ ప్రభుత్వం రూ.3లక్షలే ఇస్తోందని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. మహిళల ఖాతాల్లో రూ.15వేలు వేస్తామన్న హమీ ఏమైందని ప్రశ్నించారు. సీఎం జగన్‌ ప్రచారం కోసం పాకులాడుతున్నారని .. నిజంగా ప్రజలకు మేలు చేయాలని అనుకోవడం లేదన్నారు. గత ప్రభుత్వంలో ఉండి.. ఆపేసిన పథకాలను తెలుగుదేశం పార్టీ ప్రముఖంగా ప్రజల్లోకి చర్చకు పెట్టే ప్రయత్నం చేస్తోంది. అలాగే.. పాత పథకాలు…పేర్లు మార్చిన పథకాల వల్ల.. ప్రజలకు జరిగిన నష్టాలను వివరించే ప్రయత్నం చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొత్త హీరోయిన్ల తలరాతలు మారుస్తున్న రాంగోపాల్ వర్మ

సినిమా ఇండస్ట్రీలో బ్రేక్ రావడం అన్నది అంత ఆషామాషీ కాదు. వందల మంది ఆర్టిస్టులు బ్రేక్ కోసం ప్రయత్నిస్తున్నా, టాలెంట్ విషయంలో కొదువ లేకపోయినా, అదృష్టం కలిసి రాక, సరైన గాడ్ ఫాదర్...

ఓయ్ ద‌ర్శ‌కుడితో చిరు త‌న‌య‌

చిరంజీవి కుమార్తె సుస్మిత సైతం.. చిత్ర‌సీమ‌తో మ‌మేకం అవుతుంది. చిరు చిత్రాల‌కు కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా సేవ‌లు అందించింది. ఇప్పుడు నిర్మాత‌గానూ మారింది. గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ సంస్థ ను స్థాపించి కొన్ని వెబ్...

గవర్నర్‌ను లైట్ తీసుకున్న తెలంగాణ అధికారులు..!

కరోనా వ్యాప్తి విషయంలో తెలంగాణ సర్కార్ పట్టించుకోవడం లేదు.. కాస్త పట్టించుకుందామనుకున్న గవర్నర్‌ను అధికార యంత్రాంగం లెక్క చేయడం లేదు. తెలంగాణలో కరోనా పరిస్థితులపై తీవ్రమైన విమర్శలు వస్తున్న సమయంలో.. సీఎం...

‘పుష్ష‌’ కోసం భారీ స్కెచ్‌

30 - 40 మందితో షూటింగులు జ‌రుపుకోండి... అంటూ ప్ర‌భుత్వాలు క్లియ‌రెన్స్ ఇచ్చేసినా - ఒక్క పెద్ద సినిమా కూడా ప‌ట్టాలెక్క‌లేదు. చిన్నా, చిత‌కా సినిమాలు, త‌క్కువ టీమ్ తో ప‌ని కానిచ్చేస్తున్నా,...

HOT NEWS

[X] Close
[X] Close