టీడీపీ సస్పెన్షన్ : జగన్ మూడ్ డిస్టర్బ్ చేసిన డిప్యూటీ స్పీకర్ ..!

రైతుల పంటలకు ప్రభుత్వం బీమా ప్రీమియం చెల్లించకపోవడంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రైతులు సర్వం కోల్పోయారు. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో వెల్లడిచింది. ఈ అంశంపై అసెంబ్లీలో అధికారపక్షం అడ్డంగా దొరికిపోయింది. రైతులకు నష్టపరిహారం ప్రకటన అంశంపై చర్చలో పంటల బీమా ప్రీమియంను చెల్లించామని వ్యవసాయమంత్రి కన్నబాబు ప్రకటించారు. అసెంబ్లీలో అబద్ధాలు చెప్పవద్దని.. ప్రీమియం చెల్లించలేదని, నిరూపిస్తామని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ సవాల్ చేశారు. ప్రీమియం చెల్లించలేదని ఆర్టీఐ ద్వారా తీసుకొచ్చిన సమాచారం తన వద్ద ఉందని పత్రాలను కేశవ్ చూపించారు. దీంతో.. వెంటనే అధికార పక్షం మాట మార్చింది. డిసెంబర్‌ 15న ప్రీమియం చెల్లిస్తామని చెప్పుకొచ్చారు. వైసీపీ తీరుపై టీడీపీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని చంద్రబాబు కోరారు. స్పీకర్ చైర్‌లో ఉన్న డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి వెంటనే అవకాశం ఇచ్చారు. ఇలా మైక్ ఇవ్వడంపై జగన్ అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబు మాట్లాడుతున్న సమయంలో అధికార పక్షం నిరసన వ్యక్తం చేయడంతో చంద్రబాబు మైక్‌ కట్‌ చేశారు.

దీంతో టీడీపీ నిరసన వ్యక్తం చేసింది. స్పీకర్‌ వెల్‌లో చంద్రబాబు బైఠాయించారు. చంద్రబాబు స్పీకర్‌ వెల్‌లో బైఠాయించడంతో … ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును కించపరిచేలా మాట్లాడారు. చంద్రబాబు రౌడీయిజం చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ సభ్యులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని… డిసెంబర్ నెలాఖరునాటికి రైతులందరికీ ఇన్‌పుట్ సబ్సిడీ అందిస్తామని ప్రకటించారు. చంద్రబాబు కావాలనే పోడియం ఎదుట బైఠాయించారని.. గతంలో ఏ ప్రతిపక్ష నేత ఇలా వ్యవహరించలేదన్నారు. తన వయసుకు తగ్గట్టు చంద్రబాబు మాట్లాడాలని.. కళ్లెర్రజేసి మమ్మల్ని భయపెడుతున్నారని మండిపడ్డారు. స్పష్టత ఇచ్చాక కూడా.. అదే అంశాన్ని లేవనెత్తడం సరికాదన్నారు.

పోడియం ముందు బైఠాయిచడంతో స్పీకర్ టీడీప సభ్యులను సస్పెండ్ చేయాలని నిర్ణయించారు. అసెంబ్లీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి ఒక రోజు పాటు సస్పెండ్ చేశారు. సస్పెండైన ఎమ్మెల్యేలందరూ.. అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించారు. రైతులకు తక్షణం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ధర్నా దృశ్యాలను చిత్రీకరిస్తున్న.. ఎమ్మెల్యేల సహాయకులను అసెంబ్లీ భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ధర్నా చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలకు అడ్డుగా మార్షల్స్ నిలబడ్డారు. ఈ సందర్భంగా చీఫ్ మార్షల్‌తో పయ్యావుల కేశవ్ వాగ్వాదానికి దిగారు.

రైతులకు నష్టపరిహారం అంశంపై ప్రభుత్వం క్లారిటీతో వ్యవహరించడం లేదు. ఇన్ పుట్ సబ్సిడీ ఇస్తామని చెబుతున్నారు కానీ.. వర్షాల వల్ల సర్వం కోల్పోయిన రైతులను తక్షణం ఆదుకునే ఒక్కటంటే.. ఒక్క చర్య తీసుకోలేదు. చివరికి కడప సిటీలో కొన్ని వేల మంది వరదల కారణంగా నష్టపోయినా ఎలాంటి పరిహారం ప్రకటించలేదు. ఈ అంశాలపై సభలో అయినా ముఖ్యమంత్రి జగన్ కీలక ప్రకటన చేసి.. ప్రతిపక్ష నేతల నోళ్లు మూయిస్తారని అనుకున్నారు కానీ.. వారిని నోరెత్తకుండా చేసి బయటకు పంపేశారు. రైతులకు ఇవ్వదల్చుకున్న సాయం విషయం మాత్రం ప్రకటించలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close